పత్రికా ప్రకటన చిత్తూరు, మార్చి 21: చిత్తూరు ఎలక్షన్స్ ది బెస్ట్ ఎలక్షన్స్ గా అయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి పి.ఎస్.ప్రద్యుమ్న పేర్కొన్నారు.గురువారం స్థానిక జిల్లా సచివాలయంలో సార్వత్రిక ఎన్నికలలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి ఆద్వర్యంలో జిల్లా నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకొనే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోటీ చేసే అభ్యర్థుల ఖర్చులపై నిఘా పెట్టాలని తెలిపారు. నేడు సెక్టోరల్ అధికారులు పోలింగ్ స్టేషన్ లకు వెళ్లి మౌలిక వసతులను పరిశీలించాలన్నారు. సెక్టోరల్ అధికారులకు మరో విడత శిక్షణా కార్యక్రమం ఉంటుందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో విభిన్న ప్రతిభావంతులు నూటికి నూరు శాతం తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టాలని విభిన్న ప్రతిభావంతుల ఏ.డి.శ్రీధర్ రెడ్డి ని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ.వి.ఎం ల రాoడమైజేషణ్ జరుగుతూ ఉందని చెప్పారు. ఈ సారి సార్వత్రిక ఎన్నికలు ఒకే విడతలో జరుగుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఎన్నికల విధులు నిర్వహించాలన్నారు. అబ్సర్వర్లు ఎన్నికలకు సంబంధించి ఏ విషయం గురించి అడిగిన అందుకు ఆర్.ఓ లు విపులంగా సమాదానాలను తెలియజేయాలన్నారు. జిల్లాలో ఏ పోలింగ్ స్టేషన్ లో కూడా సమస్య అనేది ఉత్పన్నం కాకూడదన్నారు.బ్యాంకులలో లక్ష రూపాయల లావాదేవీలు జరుగుతూ ఉంటే వాటి పై బ్యాంకు అధికారులు నిఘా ఉంచాలని తెలిపారు. 1950 కాల్ సెంటర్ ను అలాగే సి-విజిల్ యాప్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీష ,జే.సి.2 కమల కుమారి ,డి.ఆర్.ఓ గంగాధర గౌడ్ ,జిల్లా స్థాయి ఎన్నికల నోడల్ అధికారులు ,తదితరులు పాల్గొన్నారు.
ఏపీ ఎన్నికల వివరాలు - ShareChat
9.6k వీక్షించారు
10 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post