మేలుకో భారతీయుడా మేలుకో ఈ దేశంలో ఏం జరుగుతుందో ఒక్కసారి మేల్కొని చూడు ఆగస్ట్ 15 వచ్చింది కదా ఇక వాట్సాప్ స్టేటస్ లతో ఫేస్బుక్ పోస్టులతో హోరెత్తించండి ఒక తెల్ల చొక్కా తొడిగి దానికి చిన్న జాతీయ జెండా ని పెట్టి 52 సెకన్ల జాతీయగీతాన్ని పాడి మీ మీ దేశభక్తిని చాటుతున్నారని పొంగిపొర్లుతున్న రేమో దేశ గౌరవం పెంచె పని ఏరోజైనా చేస్తున్నారా నీ పక్కనే ఉన్న అమ్మ అక్క లాంటి ఆడపిల్లలను మాటలతో కించపరుస్తున్నారు చేతులతో నరకం చూపెడుతున్నారు నువ్వేం చేస్తున్నావ్ పక్కనే నీలాంటి వాడు ఎవడో తిండికి గతిలేక ఆకలితో అలమటిస్తూ రోడ్డున పడి అడుక్కు తింటున్నాడు నువ్వేం చేస్తున్నావ్ ఒక దేశంలో ఉంటూ ఓకే గాలిని పీలుస్తూ కనిపించని ఆ దేవుడి కోసం కొట్టుకు చస్తున్నారు నీ జాతీయ జెండా ని ముక్కలు ముక్కలు చేస్తున్నారు నువ్వేం చేస్తున్నావ్ ధర్మం మట్టి కలిసిపోయింది మానవత్వం చచ్చిబూడిద అయిపోయింది మరి నీ దేశ గౌరవం అలా తగలబడిపోతుంటే నువ్వేం చేస్తున్నావ్ ఏదో ఒరోజు నా జాతీయ జెండా ని కూడా విభజించి మతం కో జెండాని ఎగుర వేసుకుంటారు కావచ్చు అప్పుడు కూడా నువ్వు ఇలాగే చూస్తూ ఊరుకుంtawa మూడు రంగుల జెండా ఏనాడైతే ముసిముసిగా నవ్వుతూ రెపరెపలాడుతుందో ఆనాడు నా దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు దొంగలు వేల కోట్ల రూపాయలతో నా దేశ బార్డర్ ను దాటేసినా లగ్జరీగా బతుకుతున్నారు నా దేశ సంపదను గద్ద పక్షిలా ఎత్తుకుపోతున్న చూస్తున్నమె తప్ప ఏమి చేయలేకపోయాను ఏమైంది నాలుగురోజుల టీవీలో పేపర్లో వచ్చి పాతబడింది నడిరోడ్డుపై ఒక అమ్మాయిపై అత్యాచారం జరిగింది అమ్మాయి విలవిల కొట్టుకుంటూ చనిపోయింది ఏమయింది వంద కొవ్వొత్తులతో రోడ్డుపై నివాళులు తెలిపాయి కఠినులు ని శిక్షించాలని నడిరోడ్డుపై ధర్నాలు చేశాయి మహిళా సంఘాలని ఒక్కటఅయ్యాయి మరి ఏమయింది గొంతు మూగబోయింది కొవ్వొత్తి కరిగిపోయింది అలాంటి ఘటనలు మామూలు అయిపోయాయి పంటలు పండక అప్పులు తీరక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఏమయింది నా దేశ వెన్నుముక విరిగిపోయిందని మైకుల్లో మాటలు తూటాల్లా పేలాయి రైతు సంఘాలు మార్కెట్లు బందు చేశాయి నాయకుల పరామర్శ లు ఎక్కువయ్యాయి మరి ఏమయింది ఐదులక్షల నజరానా వచ్చింది ఏమైంది టెంట్ హౌస్ కిచ్చిన డేట్ అయింది మైక్ ల కట్టిన బిల్ అయింది చావు పై ఆడిన నాటకం అయ్యింది చివరికి నాకర్థమయింది ఏమిటంటే ఐదు సంవత్సరాల కాలానికి వాళ్ళు వేసే గాలానికి మనం చేపల్లా చిక్కుకుంటునామ్ వాళ్లు ఆడే ఆటలో పావులం అవుతున్నాం నిజమైన స్వతంత్రం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇట్లు మీ భారతీయుడు ....... . సాయిచరణ్ తేజ్ ఎం
217 views
7 months ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post