beauty - అందానికి బీట్రూట్ * గుప్పెడు ఓట్స్ నీ , బీట్రూట్ ముక్కల్నీ తీసుకుని మెత్తని పేస్టులా చేసుకోవాలి . దానికి చెంచా తేనె , కాస్త నిమ్మరసం కలుపుకొని ముఖానికి రాసుకుని మునివేళ్లతో మృదువుగా మర్దన చేయాలి . తరవాత చన్నీళ్లతో కడిగేసుకోవాలి . రెండు నిమిషాలాగి నీళ్లను మరిగించి , ముఖానికి ఆవిరిపడితే సరి . . . చర్మం కాంతులీనుతుంది . * బీట్రూట్ ముక్కని మెత్తని పేస్ట్ లా చేసుకుని దానికి చెంచా నిమ్మరసం , కోడిగుడ్డులోని తెల్లసొన కలిపి బాగా గిలక్కొట్టాలి . ఆ మిశ్రమాన్ని ముఖానికీ మెడకీ , చేతులకూ రాసుకోవాలి . ఆరాక గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి . ఇలా తరచూ చేస్తుంటే చర్మం బిగుతుగా మారి ముడతల సమస్య దూరమవుతుంది . * బీట్రూట్ రసానికి కొంచెం తేనె కలిపి , పెదాలకు రాసుకుని పది నిమిషాల పాటు ఆరనివ్వాలి . ఇలా రోజూ రాత్రి పడుకునే ముందు రాస్తే పెదాలు మృదువుగా మారతాయి . * బీట్ రూట్ రసంలో కొంచెం పెరుగూ , బాదం నూనె , చెంచా ఉసిరిక పొడి కలిపి పేస్ట్ లా చేసుకుని , దాన్ని తలకు రాసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఎదుగుదుతుంది . అది కండిషనర్గానూ ఉపయోగపడుతుంది . * జుట్టు తెల్లబడిందనో , చక్కని రంగులో కనిపించాలనో భావించే వారు రసాయనాలు కలిపిన రంగుల్ని వాడే బదులు బీట్ రూట్ రసాన్ని వారానికోసారి తలకు పట్టించి , అరగంట ఆగి తలస్నానం చేయాలి . దీనివల్ల జుట్టు చక్కని రంగులో కనబడుతుంది . - ShareChat
189 వీక్షించారు
4 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post