👩‍👧పిల్లల పెంపకం - మార్కులు కాదు , మేథాశక్తి కావాలి ! పిల్లల ఫెయిలైనా , పాసైనా వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే . పరీక్షల్లో అధిక శాతం మార్కులు సాధించి వారిని సంతోషపెట్టాల్సిన బాధ్యత పిల్లలది కాదు . . అని ఓతల్లి చేసిన సోషల్ మీడియా పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నది . కొందరు తల్లిదండ్రులు అధిక శాతం మార్కులు తెచ్చుకోవాలని పిల్లలను విపరీతమైన ఒత్తిడికి గురిచేస్తుంటారు . దీనివల్ల చివరకు ఆ పిల్లలు ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఆందోళన చెందుతారు . పిల్లలు పరీక్షల్లో ఫెయిలయినప్పుడు వారికి తల్లిదండ్రులు సాంత్వన ఇవ్వాల్సిన అవసరం ఉన్నదనే సారాంశంతో ఢిల్లీకి చెందిన వందన సుఫియా కటోచ్ అనే మహిళా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది . ఇటీవల విడుదలైన పదో తరగతి సీబీఎస్సీ ఫలితాల్లో తన కొడుకు 60 శాతం మార్కులతో పాసయ్యాడు . సాధించింది తక్కువ మార్కులే అయినా తనకు గర్వంగా ఉందనీ , సంతోషంగా ఆ విషయాన్ని పోస్ట్ చేసింది . 90 శాతం మార్కులు సాధించకపోయినా పర్వాలేదు , పాసయ్యాడు చాలు . . అంటూ పోస్ట్ రాసింది . అమర్ తనవంతుగా చాలా కష్టపడి చదివాడు . అతని శ్రమ ఏమాత్రం వృథా కాలేదని తెలిపింది . పిల్లలకు కావాల్సిన మార్కులతో అవసరమైన తెలివి రాదు , వారికి కావాల్సింది మేథాశక్తి అని ఆమె అంటున్నది . తల్లిదండ్రుల కలలను నెరవేర్చడానికి కాదు పిల్లలున్నది . పిల్లల ఇష్టాయిష్టాలను కూడా పేరెంట్స్ గౌరవించాలని , వారి అభిరుచికి తగినట్లుగా చదివించాలని వందన ఇతర తల్లిదండ్రులను కోరింది . పిల్లలను అనవసరమైన ఒత్తిడికి గురి చేయకుండా , వారిని సంతోషంగా ఉంచాలని సందేశమిచ్చింది . ఇలా వందన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . - ShareChat
172 వీక్షించారు
7 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post