ShareChat
click to see wallet page
🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻 బుధవారం, సెప్టంబర్.24, 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం తిథి:తదియ తె4.19 వరకు వారం:బుధవారం(సౌమ్యవాసరే) నక్షత్రం:చిత్ర మ3.11 వరకు యోగం:ఐంద్రం రా9.06 వరకు కరణం:తైతుల మ3.27 వరకు తదుపరి గరజి తె4.19 వరకు వర్జ్యం:రా9.20 - 11.06 దుర్ముహూర్తము:ఉ11.28 - 12.17 అమృతకాలం:ఉ8.12 - 9.56 రాహుకాలం:మ12.00 - 1.30 యమగండ/కేతుకాలం:ఉ7.30 -9.00 సూర్యరాశి:కన్య చంద్రరాశి:తుల సూర్యోదయం:5.52 సూర్యాస్తమయం:5.54 సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏🏻 _*🚩రేపు ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవి అలంకరణ🚩*_ 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ *"ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ* *నారీనీల సమానకుంతల ధరీ నిత్యాన్నదానేశ్వరీ* *సాక్షాత్ మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ* *భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ"* కాశీ లేదా వారణాసి అంటే అందరికీ గుర్తొచ్చే విషయాలు పవిత్ర గంగా నది , కాశీ విశ్వనాధుడు. వీటితో పాటు అతి ముఖ్యమైన మరో ప్రదేశం కూడా ఇక్కడ ఉంది. అదే కాశీ అన్నపూర్ణ ఆలయం. ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ఆకలితో అలమటించరు. అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారు. పరమశివుని సతీమణి పార్వతీ దేవి అన్నపూర్ణ రూపంలో ఇక్కడ పూజలందుకుంటున్నారు. ఈ భూమిపై మానవులు బ్రతకడానికి తిండి , నీరు ఎంత ముఖ్యమైనవో అందరికీ తెలిసిందే. కాశీలో అందరి దాహాన్ని గంగమ్మ తీరిస్తే , ఆకలిని అన్నపూర్ణమ్మ తీరుస్తుంది. ప్రజలకు ఇక్కడ ఎప్పుడూ సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. కాశీ విశ్వనాథ్ ఆలయానికి సమీపంలో విశ్వనాథ్ గలీలోని దశశ్వమేధ్ రోడ్డులో అన్నపూర్ణ ఆలయం ఉంది. *అన్నపూర్ణా దేవి కథ* కాశీ అన్నపూర్ణ దేవికి సంబంధించి ప్రముఖంగా ఒక కథ ప్రచారంలో ఉంది. పవిత్ర హిందూ గ్రంధాలు , పురాణాల ప్రకారం... ఓ సారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్నీ మాయే అని అంటాడు. భక్తుల ఆకలిని తీర్చే అమ్మ అయిన పార్వతీ దేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్లిపోతుంది. దాంతో ఆహారం దొరకక ప్రజలు అలమటించడం ప్రారంభవుతుంది. ప్రజల కష్టాలను చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది. చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటలను వెనక్కి తీసుకుని భిక్ష పాత్రను పట్టుకుని పార్వతీ దేవి వద్దకు వెళ్లి ఆహారాన్ని అడిగినట్లు చెబుతారు. అప్పటి నుండి పార్వతీ దేవి అన్నపూర్ణగా కాశీలో నేటికీ భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉందని నమ్ముతారు. *అన్నకూట్ ఉత్సవం* ఈ ఆలయంలో అన్నపూర్ణ దేవి యొక్క బంగారు విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాన్ని దీపావళి తరువాత మరుసటి రోజు వచ్చే అన్నకూట్ పండుగలో సంవత్సరానికి ఒకసారి భక్తుల దర్శనం కోసం ఉంచుతారు. ఇతర రోజులలో అన్నపూర్ణ ఆలయ గర్భగుడిలో అమ్మవారి విగ్రహం ఇత్తడి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తుంది. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో నిర్వహించే అన్నకూట్ ఉత్సవాన్ని వీక్షించేందుకు అనేక ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు. వారికి ఇక్కడ ప్రత్యేక నాణేలను కూడా పంపిణీ చేస్తారు. కాశీలో ప్రజలు ఎవరూ ఆకలితో ఉండకుండా అన్నపూర్ణ దేవి చూసుకుంటుందని భక్తుల విశ్వాసం. *ఆలయ సందర్శన* భక్తులు కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని దర్శించుకున్న తరువాత అన్నపూర్ణ ఆలయానికి వెళతారు. వారు ఆలయ వంటశాల నిర్వహణకు గానూ తగిన వస్తువులను విరాళంగా ఇవ్వడంతో పాటు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించే ఉచిత అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక్కడ వంటగది , భోజన శాల చాలా మెరుగ్గా నిర్వహించబడతాయి. స్వచ్ఛంధ సేవకులు భక్తులను ఆహారాన్ని పంపిణీ చేస్తారు. *ఎప్పుడు దర్శించాలి* దీపావళి మరియు అన్నకూట్ పండుగ సమయాల్లో వారణాసిలోని అన్నపూర్ణ దేవి ఆలయ సందర్శన ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. మీరు రద్దీ లేకుండా దర్శనం చేసుకోవాలంటే నవంబర్ ఆఖరులో లేదా డిసెంబర్ లో ట్రిప్ ప్లాన్ చేసుకోవడం మంచిది. ఇతర ప్రాంతాల నుండి వచ్చే యాత్రికుల కోసం అన్నపూర్ణ ఆలయం వద్ద నిరాడంబరమైన సౌకర్యాలు కలిగిన ఉచిత వసతి కూడా అందుబాటులో ఉంది. అయితే సందర్శకులు ముందుగానే ధర్మశాల వద్ద గదుల లభ్యతను తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది. *ఆలయం తెరిచి ఉండే సమయాలు:* ఉదయం 4 గంటల నుండి 11.30 వరకు , రాత్రి 7 గంటల నుండి 11 గంటల వరకకు అన్నపూర్ణాదేవిని తెల్లని పుష్పాలతో పూజించాలి. *"హ్రీం శ్రీం క్లీం ఓం నమో భాగవత్యన్నపూర్ణేశ మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా"* అనే మంత్రాన్ని జపించాలి. అమ్మవారికి నైవేద్యంగా దధ్ధోజనం , పొంగలి నివేదించాలి. అన్నపూర్ణ అష్టోత్తరం , స్తోత్రాలు పారాయణం చేయాలి. *శ్రీ అన్నపూర్ణా అష్టోత్తర శతనామావళి* ఓం అన్నపూర్ణాయై నమః ఓం శివాయై - దేవ్యై నమః ఓం భీమాయై - పుష్ట్యై నమః ఓం సరస్వత్యై - సర్వజ్ఞాయై నమః ఓం పార్వత్యై - దుర్గాయై నమః ఓం శర్వాణ్యై నమః ఓం శివవల్లభాయై నమః ఓం వేదవేద్యాయై నమః ఓం మహావిద్యాయై నమః ఓం విద్యాదాత్ర్యై - విశారదాయై నమః ఓం కుమార్యై - త్రిపురాయై నమః ఓం లక్ష్మ్యై - భయహారిణ్యై నమః ఓం భ్వాన్యై నమః ఓం విష్ణుజనన్యై నమః ఓం బ్రహ్మదిజనన్యై నమః ఓం గణేశ జనన్యై - శక్త్యై నమః ఓం కౌమారజనన్యై - శుభాయై నమః ఓం భోగప్రదాయై - భగవత్యై నమః ఓం భక్తాభీష్టప్రదాయిన్యై నమః ఓం భవరోగహరాయై నమః ఓం భవ్యాయై - శుభ్రాయై నమః ఓం పరమమంగళాయై నమః ఓం భ్వాన్యై - చంచలాయై నమః ఓం గౌర్యై నమః ఓం చారుచంద్రకళాధరాయై నమః ఓం విశాలక్ష్యై - విశ్వమాత్రే నమః ఓం విశ్వవంద్యాయై నమః ఓం విలాసిన్యై - ఆర్యాయై నమః ఓం కల్యాణ నిలయాయై నమః ఓం ర్ద్రాణ్యై కమలాసనాయై నమః ఓం శుభప్రదాయై - శుభాయై నమః ఓం అనంతాయై నమః ఓం మత్తపీనపయోధరాయై నమః ఓం అంబాయై నమః ఓం సంహారమథన్యై నమః ఓం మృడాన్యై నమః ఓం సర్వమంగళాయై నమః ఓం విష్ణు సేవితాయై నమః ఓం సిద్దాయై - బ్రహ్మాణ్యై నమః ఓం సురసేవితాయై నమః ఓం పరమానందాయై నమః ఓం శాంత్యై నమః ఓం పరమానందరూపిణ్యై నమః ఓం పరమానంద జనన్యై నమః ఓం పరానంద ప్రదాయిన్యై నమః ఓం పరోపకార నిరతాయై నమః ఓం పరమాయై నమః ఓం భక్తవత్సలాయై నమః ఓం పూర్ణచంద్రాబ్భవదనాయై నమః ఓం పూర్ణచందనిభాంశుకాయై నమః ఓం శుభలక్షణ సంపన్నాయై నమః ఓం శుభానంద గుణార్ణవాయై నమః ఓం శుభసౌభాగ్యనిలయాయై నమః ఓం శుభదాయై నమః ఓం రతిప్రియాయై నమః ఓం చండికాయై నమః ఓం చండమదనాయై నమః ఓం చండదర్పనివారిణ్యై నమః ఓం మార్తాండనయనాయై నమః ఓం సాధ్వ్యై నమః ఓం చంద్రాగ్నినయనాయై నమః ఓం సత్యై నమః ఓం పుండరీకహరాయై నమః ఓం పూర్ణాయై నమః ఓం పుణ్యదాయై నమః ఓం పుణ్యరూపిణ్యై నమః ఓం మాయాతీతాయై నమః ఓం శ్రేష్ఠమాయాయై నమః ఓం శ్రేష్ఠధర్మాత్మవందితాయై నమః ఓం అసృష్ట్యై నమః ఓం సంగరహితాయై నమః ఓం సృష్టిహేతుకవర్థిన్యై నమః ఓం వృషారూఢాయై నమః ఓం శూలహస్తాయై నమః ఓం స్థితి సంహార కారిణ్యై నమః ఓం మందస్మితాయై నమః ఓం స్కందమాత్రే నమః ఓం శుద్దచిత్తాయై నమః ఓం మునిస్తుత్యాయై నమః ఓం మహాభగవత్యై - దక్షాయై నమః ఓం దక్షాధ్వరవినాశిన్యై నమః ఓం సర్వార్థ దాత్ర్యై నమః ఓం సావిత్ర్యై నమః ఓం సదాశివకుటింబిన్యై నమః ఓం నిత్యసుందరస్ర్వాంగై నమః ఓం సచ్చిదానంద లక్షణాయై నమః ఓం సర్వదేవతా సంపూజ్యాయై నమః ఓం శంకరప్రియవల్లభాయై నమః ఓం సర్వధారాయై నమః ఓం మహాసాధ్వ్యై నమః ఓం శ్రీ అన్నపూర్ణాయై నమః *శ్రీ అన్నపూర్ణా స్తోత్రమ్* 🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏 ఓం శ్రీ అన్న పూర్ణ దేవియే నమః #ఈరోజు పంచాంగం # పంచాంగం #బుధవారం స్పెషల్ విషెస్ #♥ప్రేమతో శుభోదయం🌄 #💞Good morning💞
ఈరోజు  పంచాంగం - అన్నపూర్ణేశ్వరీ మాతా ஒு: 9%;0 అన్నపూర్ణేశ్వరీ మాతా ஒு: 9%;0 - ShareChat

More like this