ShareChat
click to see wallet page
*రైతు ప్రయోజనాల కోసం ఆత్మ కమిటీ కృషి చేయాలి — ఎమ్మెల్యే జారె* 📅 24.09.2025 – బుధవారం అశ్వారావుపేట మండలకేంద్రంలోని శ్రీ శ్రీ ఫంక్షన్ హాల్‌లో ఆత్మ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ *మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్* గారితో కలిసి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అశ్వారావుపేట *ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు *సుంకవల్లి వీరభద్రరావు* గారు ఆత్మ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు మరో 25 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడుతూ, “రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆత్మ కమిటీ చురుకైన పాత్ర పోషించాలి. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ఈ కమిటీ వంతు కృషి అవసరం” అని అన్నారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న *కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్* పథకాల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అలాగే, *ఐటీడీఏ ద్వారా గిరిజనులకు అదనంగా మంజూరైన *1000 ఇళ్లకు సంబంధించిన *ఇందిరమ్మ ఇండ్ల అర్హత పత్రాలు* పంపిణీ చేశారు. జిల్లా అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. #🔹కాంగ్రెస్ #🌍నా తెలంగాణ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🏛️రాజకీయాలు #కాంగ్రెస్
🔹కాంగ్రెస్ - ಭn  1ನ1 4= irs 0=10 ~R I @ಬmanl ur Lu {ುನ  ಭn  1ನ1 4= irs 0=10 ~R I @ಬmanl ur Lu {ುನ - ShareChat

More like this