ShareChat
click to see wallet page
*🌿🌼🙏🌿🌼🙏అష్ట ఐశ్వర్యాలను ... ఆరోగ్యాన్ని.. స్త్రీలకు ఐదవతనాన్నిప్రసాధించే విశాఖ కనకమహాలక్ష్మి అమ్మవారు🙏🌼🌿* 🌿🌼🙏విశాఖపట్నంలోని ఆలయాలలో ప్రముఖమైనది కనకమహాలక్ష్మి ఆలయం. బురుజుపేటలో నెలకొన్న ఈ ఆలయం క్రిందటి శతాబ్దం పూర్వార్ధంలో వెలుగులోకి వచ్చిందని ప్రతీతి. కనకమహాలక్ష్మి విశాఖ పాలకుల ఇలవేలుపు. విశాఖ వాసులకే కాదు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి గత శతాబ్ద కాలంగా ఆరాధ్య దైవం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విశాఖ నగరం నడిబొడ్డున కొలువు ఉన్నారు. నేడొక ప్రముఖ పట్టణంగా గుర్తింపబడిన విశాఖ వంద సంవత్సరాల క్రిందట ఒక చిన్న ఊరే ! శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారు విశాఖపట్నంలో భక్తుల నీరాజనాలతో విలసిల్లుతున్నది. భక్తులపాలిట కల్పవల్లిగా ఆరోగ్యాన్ని, స్త్రీలకు ఐదవతనాన్ని ప్రసాదించే దేవతామూర్తిగా కొలువబడుతోంది. శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారిని సత్యంగల తల్లిగా, కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా, స్త్రీలకు ఐదవ తనాన్ని, నగరవాసులకు ఆరోగ్యాన్ని ఇనుమడింపచేసే దేవతామూర్తిగా భక్తులు శ్రీ అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో సేవిస్తూంటారు.🙏🌼🌿 🌿🌼🙏మరి ఈ ఆలయ చరిత్ర, మహిమలు, విశేషాలేంటో తెలుసుకుందాం ..🙏🌼🌿 🌿🌼🙏శ్రీకనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం శ్రీకనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం ఇతర దేవాలయాలలో వలె కాకుండా గోపురం లేని బహిరంగ మండపంలో మనకు దర్శనమిస్తుంది. ఇదీ ఈ అమ్మవారి ప్రత్యేకత. సుమారు 150 ఏళ్ల క్రితం ఈ ప్రాంతం ఓ చిన్న గ్రామంగా విశాఖ రాజులపాలనలో ఉండేదని, శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు నాడు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన విశాఖ రాజుల ఇలవేల్పు అని తెలుస్తోంది.🙏🌼🌿 🌿🌼🙏ఈ అమ్మవారు స్వయంభు: విశాఖ రాజుల కోట బురుజు ఈ పరిసరాల్లో ఉండేదని, అందుచేతనే ఈ ప్రదేశాన్ని బురుజుపేట అనే పేరు వచ్చిందని చారిత్రక ఆధారాలు తెలియచేస్తున్నాయి. ఈ అమ్మవారు స్వయంభు: .ఆశ్చర్యకరంగా ఇక్కడ అమ్మవారికి ఎడమచెయ్యి సగం వరకే ఉంది.🙏🌼🌿 🌿🌼🙏భక్తులే స్వయంగా మరో విషయం ఏమటంటే అమ్మవారి పైన గోపురం లాంటిది ఏమి ఉండదు. కేవలం కొబ్బరి ఆకులతో పందిరాలు ఏర్పాటు చేస్తారు . ఇక్కడ భక్తులే స్వయం గా పూజలు చేయవచ్చు. పసుపు, కుంకుమా చీరలు భక్తులు అమ్మవారికి సమర్పిస్తున్నారు. పూజారులు ఎవరు ఉండరు, భక్తులే స్వయంగా పూజలు చేసి నమస్కరించి భయటకు వస్తారు. 🌿🌼🙏సంతానం లేని మహిళలకు సంతానం కలిగించే తల్లిగా ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ఎవరికి వారే ఆ అమ్మను కొలుచుకునే భాగ్యం ఉంటుంది. అందుకే భక్తులంతా అమ్మవారికి పసుపు ,కుంకుమలతో పూజలు చేసి, కొబ్బరికాయలు కొట్టి దేవికి నివేదించే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది. సంతానం లేని మహిళలకు సంతానం కలిగించే తల్లిగా ఉత్తరాంధ్ర ప్రజలకు నమ్మకం కలిగిన తల్లిగా మారారు. అందుకే పుట్టిన బిడ్డలను అమ్మవారి ఒడిలో పెట్టి పూజలు చేయడం ఉత్తరాంధ్ర ప్రజలకు అలవాటు. అలాగే అరుదుగా అమ్మవారిని భక్తులే నేరుగా పసుపు కుంకుమలు, పాలు పవిత్ర జలాలతో పూజలు చేసే ఆచారం ఈ సన్నిధానంలో సాగటం మరో విశేషం.🙏🌼🌿 🌿🌼🙏ఒకప్పటి విశాఖను పాలించిన రాజుల కులదేవత ఈ దేవాలయానికి సంబంధించి సరియైన చారిత్రక ఆధారాలులేవు. ఒకప్పటి విశాఖను పాలించిన రాజుల కులదేవత, కుటుంబ దేవతగా తెలుస్తుంది. అప్పటి రాజుల యొక్క కోట బురుజు కలప్రాంతం అయిన బురుజుపేటలో కల అమ్మవారు అందరికీ అందుబాటులో కనిపిస్తుంది.🙏🌼🌿 🌿🌼🙏స్థానిక కథనం ప్రకారం, స్థానిక కథనం ప్రకారం, 1912 లో శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారి యొక్క విగ్రహం బావి నుండి తీయబడింది. అది రహదారి మధ్య ప్రతిష్ఠించబడి ఉండేది. రహదారిని విస్తరించడానికి విశాఖ మునిసిఫల్ అధికారులు విగ్రహాన్ని తొలగించి మరోచోట ప్రతిష్ఠించారు. అది జరిగిన 1917 సంవత్సరంలో విసాఖలో ప్లేగు వ్యాధి ప్రభలి అనేకమంది చనిపోయారు. ఇది అమ్మవారి విగ్రహాన్ని తొలగించడం వలనే జరిగిందని తలచి మళ్ళీ యధాస్థానానికి చేర్చారు. అప్పటికి వ్యాధి తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు అమ్మవారి మీద గురి ఏర్పడటం తరువాత ఆమె యొక్క మహిమలు కథలుగా విస్తరించడం ద్వారా విశేష ప్రాచుర్యం పొందినది.🙏🌼🌿 🌿🌼🙏మరో కథనం ప్రకారం.. సద్గుణ సంపన్నుడైన ఓ బ్రాహ్మనుడు కాశీకి వెళ్తూ విశాఖ తీరం మీదుగా బురుజుపేటకు చేరుకుంటాడు. అమ్మవారి విగ్రహం ఉన్న బావిలో స్నానమాచరించి సేద తీరుతాడు. ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై.. తాను కలియుగంలో భక్తుల కోర్కెలను తీర్చేందుకు అవతరించానని, తన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్టించాలని కోరుతుంది. అయితే, ఆ బ్రాహ్మనుడు తాను కాశీకి వెళ్తున్నానని, మన్నించాలని ప్రాదేయపడతాడు. ఆగ్రహానికి గురైన అమ్మవారు తన వామ హస్తంలోని పరిగ అనే ఆయుధంతో బ్రాహ్మనుడిని సంహరించేందుకు సిద్ధమవుతుంది. దీంతో బ్రాహ్మనుడు శివుడిని ప్రార్థిస్తాడు. శివుడు విషయాన్ని గ్రహించి.. అమ్మవారి వామ హస్తాన్ని మోచేతి పైవరకు ఖండిచి, శాంతిపజేస్తాడు. కనక మహాలక్ష్మీగా భక్తులను అనుగ్రహించాలని ఆదేశిస్తాడు. అందుకే, ఈ ఆలయంలో అమ్మవారికి వామహస్తం ఉండదు.🙏🌼🌿 🌿🌼🙏గురువారం ప్రీతికరమైన రోజు అమ్మవారి సేవలకు " గురువారం " ప్రీతికరమైన రోజు. ఆ రోజు తెల్లవారినది మొదలు రాత్రి వరకు భక్తులు అమ్మవారిని దర్శించి , తీర్థ, ప్రసాదాలను స్వీకరిస్తుంటారు. ఈ ప్రాంతంలోని భక్తులు తమకు పుట్టిన పసికందును కూడా అమ్మవారి ఒడిలో ఉంచి ఆమె అనుగ్రహాన్ని కోరుకుంటారు, ఆరాధిస్తారు.🙏🌼🌿 🌿🌼🙏ప్రతి ఏటా మార్గశిర మాసం నెలరోజులు అమ్మవారి వార్షిక మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ నెలలో వచ్చే అన్ని గురువారాల్లో ఇరవై నాలుగు గంటలు ప్రజలు అమ్మవారిని దర్శిస్తారు. సామూహిక అష్టోత్తర కుంకుమార్చన ఇక్కడి ప్రత్యేకత. మార్గశిర మాసంలో అన్నదానం చేసినవారికి మార్గశిర మాసంలో అన్నదానం చేసినవారికి అమ్మవారి దీవెనలు కలుగుతాయి అని ప్రగాఢ విశ్వాసం. ఈ మధ్యే మార్గశిర దీక్ష మరియు మండల దీక్ష అనే రెండు మాలధారణ వేడుకలు ప్రారంబించారు, ఈ దీక్షలో అమ్మరి దీవెనలు ఎక్కవ పొందవచ్చును అని నమ్మకం. ఉగాది పర్వదినం, ఆంధ్రుల కొత్త సంవత్సర ప్రారంభ దినం, ఆ రోజున అమ్మవారు వెండి ఆభరణాలతో అలంకరించబడి, దేదీప్యంగా దర్శనమిస్తారు. శరన్నవరాత్రులుగా పిలుచుకునే, నవరాత్రి వేడుకల్లో 5వ రోజున అమ్మవారిని లక్ష కుంకుమార్చనతో అలంకరిస్తారు.🙏🌼🌿 🌿🌼🙏ఆశ్వీయిజ శుద్ద దశమి వరకు ఆశ్వీయిజ శుద్ద దశమి వరకు శరన్నవరాత్రి వేడుకల్లె భాగంగా వరుసగా లక్ష కుంకుమార్చన, లక్ష చామంతుల పూజ, లడ్డూల పూజ. క్షీరాభిషేకం. కులువల పూజ, లక్ష తులసి పూజ, లక్ష గాజుల పూజ, పుష్ప యాగం, శాకాంబరి, స్వర్ణాభరణ చీర అలంకరణలో పూజలు నిర్వరించడం జరుగుతోంది. ఆ తొమ్మిది రోజులు నిర్వర్తించే సహస్ర నామార్చన, శ్రీ చక్రనామావర్చన, లక్ష్మీ హోమంలో పాల్గొంటూ భక్తులు పుణీతులు అవుతుంటారు. తిరుపతిలో మాదిరిగానే ఇక్కడ కూడా అమ్మవారికి అష్టదళ సువర్ణ పద్మారాధన జరుపబడుతుంది. మాలధారణ సాంప్రదాయం కూడా ఉంది. ఆకుపచ్చని వస్త్రాలు ధరించి భక్తులు మాలధారణ చేపడతారు.🙏🌼🌿 🌿🌼🙏నిత్యపూజలు: ఉదయం పూజ:ఉ. 5 గం, మధ్యాహ్నం పూజ: ఉ 11.30 గం, ప్రదోష పూజ : సా. 6 గం. సర్వదర్శనం ఉ. 6 గం. నుండి వార్షిక ఉత్సవాలు : మార్గశిర మాసంలో నెలరోజుల పాటు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో విశాఖపట్నం వాసులే కాకుండా, ఇరుగు, పొరుగు జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని సేవిస్తుంటారు. ఈ నెల రోజులు అమ్మవారి సన్నిధి నిత్య కళ్యాణం, పచ్చతోరణంగా కనిపిస్తుంది. రథోత్సవం, వేదపండిత సదస్సు, సాంస్కృతిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. చివరి గురువారం అన్న ప్రసాద వితరణను జరుపుతారు. మార్గశిరమాసం సందర్భంగా మీరూ ఆ కనకమహాలక్ష్మిని సందర్శించి తరించండి.🙏🌼🌿 🌿🌼🙏ఇలా చేరుకోవాలి: అమ్మవారి దేవస్థానానికి చేరుకోడానికి విశాఖపట్నం రైల్వే స్టేషన్, బస్ కాంప్లెక్స్‌ల నుంచి బస్సు సదుపాయం ఉంది. ఆటోల్లో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. విశాఖపట్నం సందర్శనకు వచ్చే పర్యాటకులు తప్పకుండా సందర్శించాల్సిన చారిత్రాత్మక ప్రాంతం ఇది. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి పాత పోస్టాఫీసుకు వెళ్లే మార్గంలో ప్రతీ సిటీ బస్సు అమ్మవారి ఆలయం వద్ద నిలుస్తుంది. అలాగే విశాఖ ఎయిర్‌ పోర్టు నుంచి కేవలం 18 కిలోమీటర్ల దూరంలో అమ్మవారి ఆలయం ఉంది. అలాగే రైల్వే స్టేషన్‌ నుంచి దాదాపు 5 నుండి 10 కిలోమీటర్ల దూరంలో కొలువైన అమ్మవారికి ఆలయం ప్రయాణం పరంగా అత్యంత సులభ తరంగా ఉంటుంది.🙏🌼🌿 ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః __________________________________________ HARI BABU.G __________________________________________ #sri kanaka mahalakshmi devi #sri kanaka mahalakshmi devi #kanaka mahalakshmi ammavari sambaralu #vizag kanaka mahalakshmi ammagaru🙏🙏
sri kanaka mahalakshmi devi - శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారు janali Tippahh శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారు janali Tippahh - ShareChat

More like this