ShareChat
click to see wallet page
రాచర్ల గురుకుల బాలికల వసతీ గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. వసతి గృహంలో సౌకర్యాలను గురించి విద్యార్థినిలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి విద్యార్థినిలకు సౌకర్యాలు కల్పించటంలో నిర్లక్ష్యం తగదన్న ఎమ్మెల్యే.. వసతీ గృహంలోని సమస్యలను మంత్రి డోలా దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే. ఎమ్మెల్యే చొరవతో తక్షణమే రూ. 5 లక్షల రూపాయల RO ప్లాంట్ మంజూరు చేసిన మంత్రి డోలా. గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు రాచర్ల గురుకుల బాలికల వసతి గృహాన్ని శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని తరగతి గదులను పరిశీలించి అక్కడి విద్యార్థినిలతో ఎమ్మెల్యే మాట్లాడి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలోని తరగతి గదుల్లో లైటింగ్, మరియు ఫ్యాన్లు పని చేయటంలేదని గమనించిన ఎమ్మెల్యే వెంటనే మరమ్మత్తులు నిర్వహించాలని ఆదేశించారు. అదే విధంగా విద్యార్థుల నివాస గదులను, మరియు మరుగుదొడ్లు, దోబీ లను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం వసతి గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు వచ్చిన సమయంలో తీసుకొనే జాగ్రత్తలు, వైద్య పరీక్షలు వంటి అంశాలను, విద్యా బోధన పై ఆరా తీశారు.. విద్యార్థులకు సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం తగదని, విద్యార్థులు తమకు ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకొని రావచ్చునన్నారు.. వసతీ గృహంలోని సమస్యలను ఫోన్ ద్వారా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి తెలియచేయగా ఎమ్మెల్యే చొరవతో వెంటనే రూ. 5 లక్షల రూపాయల RO వాటర్ ప్లాంట్ మంజూరు చేశారు. కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిందని, నాణ్యమైన విద్యా, నాణ్యమైన ఆహారం, మౌళిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కటికే యోగానంద్, సొసైటీ బ్యాంక్ చైర్మన్ గోపిరెడ్డి జీవన్ రెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు... #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు
🎯AP రాజకీయాలు - ShareChat

More like this