ShareChat
click to see wallet page
పొద్దుగూకే వేళాయే💕 గువ్వలన్ని గూళ్ళకు సేరిపాయె మావ జాడ మాత్రం కానరాకపాయే ఏడున్నాడో ఏమైపోనాడో సద్ది తీసుకొని సంతకు పోయిన పెనిమిటి ఏడికిపోయెనో💕 సూరయ్య కూడా కొండల్లో కెళ్లిపాయె కూలి పనులకు పోయిన రైతన్నలు కూడా ఇంటి దారి పట్ట బట్టే మావ జాడ మాత్రం కానరాకపాయె కొత్త సీర కట్టుకొని💕 కొప్పున మల్లెలు సుట్టుకొని కాళ్లకు పట్టగొలుసులు పెట్టుకుని చేతికి మట్టిగాజులు తొడుక్కొని మెడలో పచ్చలహారం ఏసుకొని నుదుట బొట్టు పెట్టుకొని💕 పాపిట్ల సింధూరం దిద్దుకొని నా మావ కోసం ఎదురుసూత్తంటే దుఃఖం ఆగకపాయె💕 ఇట్లా తయ్యారుగమ్మని రోజు చెప్పెటోనివి తీరక తీరక పని దీర్చుకుని ఇయ్యాల గిట్లా తయ్యారైతే నువ్వేమో సూడకపోతివి💕 ఏంది మావ ఈ దాగుడుమూతలు నీ సీతాలు నీ కోసం గుక్కబట్టి ఏడుత్తదని తెలిసి ఇట్టా సెయ్యడం నీకు నాయమా మావ ఏడున్నా గిప్పడు 💕 నా ముందు వాలిపో మావ #✍️కవితలు #💘ప్రేమ కవితలు 💟 #🖋️నేటి కవితల స్టేటస్

More like this