ShareChat
click to see wallet page
మహలయా అమావాస్య రోజున మీ కుటుంబ సభ్యులందరూ ఈ సంకల్పం చెప్పుకుంటే మంచిది.* ➖➖➖✍️ మీ గోత్రం... మీ పేరు చెప్పుకొని... నా జన్మకు మూల కారణమైన నా తల్లి -దండ్రులకు నా యొక్క అనంతకోటి నమస్కారములు. అలాగే నా తల్లి - దండ్రులకు మూలమైన తాతలకు, ముత్తాతలకు అనంత కోటి ప్రణామములు. సృష్టి ప్రారంభం నుండి ఇప్పటి వరకూ ఈ వంశ పరంపరల్లో జన్మించిన పూర్వీకులైన వారందరికీ అనంతకోటి నమస్కారములు. ఎందరో యోగులు, మహాత్ములు, పుణ్యాత్ములైన మీ అందరి యొక్క సంస్కార బలం నాలో ప్రవేశించి, నేను ఇంతటి గొప్ప జ్ఞానంతో కూడిన జీవితాన్ని పొందియున్నాను. ఈ వంశంలో జన్మించినందుకు నేను ఎంతగానో గర్వించు చున్నాను. మీలో ఉన్న సద్భావాలు నాలో ప్రవేశించి లోక హిత కార్యాలు చేసేటటువంటి శక్తిని ప్రసాదించండి. ఈ వంశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఆ చంద్రార్కము అవనిలో విలసిల్లునట్లుగా ఆశీర్వదించండి. నాలోనూ, నా కుటుంబ సభ్యుల లందరిలోనూ ఉన్నటువంటి దోషాలను తొలగించి, క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయుః, ఆరోగ్య, ఐశ్వర్య ముల నొసగి, ధర్మార్ద, కామ, మోక్ష ముల నొసగి, అహం పదార్ద రహిత స్థితి కలిగేటట్లుగా దీవించి నా జన్మ ధన్యత చేకూర్చగలరని కోరుతూ.. అష్ట వసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, త్రిమూర్తులు, త్రిమాతలు, అష్ట దిక్పాలకులు, నవ గ్రహాలు, సమస్త సద్గురువులు మరియు సమస్త దేవతా మూర్తుల యొక్క ఆశీస్సులను కోరుతూ నా యొక్క అనంత కోటి నమస్కారములు సమర్పించుచూ మనసా, వాచా, కర్మణా, త్రికరణ శుద్ధిగా .. ఈ మహాలయ అమావాస్య రోజున సంకల్పం చేసి పెద్దలందరికీ నమస్కరించు చున్నాను.🙏``` . *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు* 🌷🙏🌷``` 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏``` 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) *
కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) - ShareChat

More like this