ShareChat
click to see wallet page
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో నవంబర్ 14,15 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్‌ను విజయవంతం చేయాలని కోరుతూ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దేశంలోని ప్రధాన పెట్టుబడిదారులతో ముంబయి తాజ్ ప్యాలెస్ హోటల్‌లో సోమవారం రోడ్ షో నిర్వహించారు. భాగస్వామ్య సదస్సుకు హాజరై ఏపీలో ఉన్న వసతులు, వనరులు, ఇస్తున్న రాయితీలు, పెట్టుబడులపై పూర్తిస్థాయి సమాచారాన్ని తెలుసుకోవచ్చని మంత్రి తెలిపారు. ఈ రోడ్ షోలో టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, ట్రాఫిగురా సీఈవో సచిన్ గుప్తా, సీఐఐ వెస్ట్రన్ రీజియన్ ఛైర్మన్ రిషికుమార్ బాగ్లా, డిప్యూటీ ఛైర్మన్ విఆర్ అద్వానీ, సీఐఐ ఏపీ ఛైర్మన్ గన్నమని మురళీకృష్ణ, ఏపీ పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ పాల్గొన్నారు. #InvestInAP #NaraLokesh #AndhraPradesh #😱భయపెడుతున్న బంగారం ధరలు
😱భయపెడుతున్న బంగారం ధరలు - ShareChat
00:34

More like this