ShareChat
click to see wallet page
#ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #మార్గశిర మాసం ప్రాశస్త్యం 🕉️ విశిష్ట పండుగల మాసం 🪔మహావిష్ణు ప్రీతికరంమైన మార్గశిర మాసం మోక్షదాయిని #మార్గశిర మాసం 🕉️ విశిష్ట పండుగల మాసం #ముక్తికి మార్గం మార్గశిర మాసం #మోక్షానికి మార్గం మార్గశిర మాసం *మార్గశిరం* మాసానాం మార్గశీర్షాహం'(మాసాల్లో మార్గ శిర మాసాన్ని నేనే) అంటాడు గీతాచార్యుడు. చాంద్రమానం ప్రకారం వచ్చే తొమ్మిదో మాసం- మార్గశిరం. చంద్రుడు మృగశిర నక్ష త్రంలో ఉండే నెల ఇది. ప్రకృతి కాంతకు సీమంతంగా, తుషార బిందువుల హేమంతంగా కవులు దీన్ని అభివర్ణించారు. 'మార్గశీర్షం' అనే మాట జన వ్యవహారంలో మార్గశిరంగా మారింది. ఈ మాసానికి పూర్వం 'అగ్ర హోమాగ్ని' అనే పేరు ఉండేది. ఇదే మాసంతో సంవత్సరం ప్రారంభమ య్యేదనీ కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మాసాన్ని భక్తులు సాక్షాత్తు పరమాత్మ స్వరూపంగా భావిస్తారు. అందువల్ల ఈ రోజుల్లో విష్ణువును పూజించాలని శాస్త్ర వచనం. ప్రతిరోజూ ప్రాతఃకాలం నన్ను స్మరించేవారికి, సదా ప్రార్ధించే భక్తులకు నన్ను నేను పూర్తిగా సమర్పించుకుంటాను' అని మహావిష్ణువు సృష్టికర్త బ్రహ్మకు వివరించాడని 'విష్ణుపురాణం' చెబుతోంది. మార్గశిర మాసంలో సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలని పెద్దలంటారు. తులసి మొక్క మొదట్లో ఉండే మట్టిని తాకాలని, 'ఓం నమో నారాయణాయ' మంత్రాన్ని పఠించాలని, పుణ్య నదుల్ని స్మరిస్తూ పవిత్ర స్నానాలు చేయాలని చెబుతారు. మహావిష్ణువును తులసి దళాలతో పూజి స్తారు. ఆ స్వామి చేతిలో ధరించిన శంఖాన్ని సైతం పూజించడం, భక్తజనులు పాటించే ఒక సంప్రదాయం. 'పాంచజన్యమా! నీ నాదం అసామాన్యం. అది ఆలకిం చిన వెంటనే, దేవతలందరూ ఒక్కటై వచ్చేలా చేయగలిగిన ఘనత నీది నీకు సాదర నమస్కారం. నీ కాంతి ప్రభఅత్యంత అనుపమానం. అది పదివేల చంద్రుల కంటే అధికం' అని భక్తులు శ్లోక సహితంగా స్తుతిస్తారు. సూర్యనారాయణ రూపుడైన విష్ణువు, ష్ణువు, వృశ్చికం నుంచి ధనూరాశిలోకి రాశిలోకి ప్రవేశించే కాలం ఇది. ఇదే నెలలో ధను ర్మాసం ప్రారంభమవుతుంది. విష్ణువును యోగనిద్ర నుంచి మేల్కొలుపుతూ ఆరాధకులు 'ధనుర్మాస వ్రతం' ఆచరిస్తారు. కొందరు కాత్యాయనీ వ్రతం ఎంతో నిష్ఠగా నిర్వ ర్తిస్తుండటం చిరకాల సంప్రదా యంగా వస్తోంది. అనేక పర్వాలకు, పండుగ లకు మార్గశిరం నెలవు. మార్గ శిర లక్ష్మీవారాలు ఆ దేవిని పూజించేందుకు ఉత్తమమైన రోజులని భావిస్తారు. గురువా రాన్ని 'లక్ష్మీవారం' అంటారు. మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్ర హ్మణ్య షష్ఠి'గా ప్రసిద్ధి చెందింది. ఈ షష్ఠి శివతన యుడైన కుమారస్వామికి ప్రియమైన తిథి కావడంతో, కొన్నిచోట్ల దీన్ని 'సుబ్బరాయ షష్టి'గా ఆచరిస్తారు. మార్గశిర శుద్ధ ఏకాదశి అనేది- వైకుంఠ ఏకాదశి లేదా మోక్ష ఏకాదశిగా విఖ్యాతి చెందింది. వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారం నుంచి చేసే దైవ దర్శనం మోక్షప్రదమని భక్తులు విశ్వసిస్తారు. ఇదే ఏకాదశి 'గీతా జయంతి గానూ ప్రసిద్ధి చెందింది. భారతీయ ఆధ్యాత్మిక వాఙ్మయంలో శిఖరాయమానంగా కీర్తించే 'భగవద్గీత'ను ప్రవచించిన రోజుగా ఈ ఏకాదశిని పరిగణిస్తారు. మార్గశిర శుక్లపక్ష త్రయోదశినాడు 'హనుమత్ వ్రతం ఆచరిస్తారు. స్వామిని షోడశోపచారా లతో పూజిస్తారు. గోధుమ అప్పాలు, గోధుమ రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పిస్తారు. భక్తి పూర్వకంగా తోరాన్ని ఏడాదిపాటు ధరిస్తారు. మార్గశిర పూర్ణిమను 'దత్త జయంతి'గానూ పరిగణిస్తారు. త్రిమూర్త స్వరూపుడిగా దత్తాత్రేయుణ్ని అర్చించే రోజు ఇది. నేడు 'గురుచరిత్ర' పారాయణం అనేక ఫలితాల నిస్తుందని పలువురు విశ్వసిస్తారు. కొన్ని ప్రాంతాల్లో- మార్గశిరంలోని శుక్ల అష్ట మిని 'కాలభైరవ అష్టమి'గా పిలుస్తారు. కాశీ క్షేత్ర పాలకుడైన కాలభైరవుణ్ని, శివుణ్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కృష్ణపక్ష ఏకాదశిని 'ఉత్పత్తి ఏకాదశి' అంటారు. ఒక సందర్భంలో, 'ఏకాదశి' కన్య ఆవిర్భవించడం వల్ల ఈ పేరు వచ్చిందని పురాణగాథలు చెబుతాయి. భక్తజనావళి దైవమాసంగా భావించే ఈ మార్గశిరం, ఇలా ఎన్నో విలక్షణతలను సంతరించుకుంది! *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 - |rse೨೦o ముఠశరం మాస ఆరంభ శుభాభిసందనలు nOO Daily Wish Telugu 0+91 9700 722 711 |rse೨೦o ముఠశరం మాస ఆరంభ శుభాభిసందనలు nOO Daily Wish Telugu 0+91 9700 722 711 - ShareChat

More like this