వెన్నెల వాకిటిలో
తెల్లని పూవులపై
తుమ్మెద చేసిన మధుర సంతకం
మన ప్రేమ💕🕊
యవ్వన లోగిలిలో
గూడు కట్టుకున్న
అందమైన సుందర మందిరమే
మన ప్రేమ💕🕊
కన్నుల కౌగిలిలో చెదిరిపోని
స్వప్నాలకు
సాక్ష్యమే మన ప్రేమ💕🕊
మది పూదోటలో
తొలకరి చినుకులా
చేరి ఆమని పూదోటగా
విరబూసిందే మన ప్రేమ💕🕊
శరత్తులో కురిసే వెన్నెల
వెన్నెలలో కురిసే వర్షం
ఆ రెంటి కలయికే వెన్నెల వర్షం
ఆ వెన్నెల వర్షమే మన ప్రేమ💕🕊
ఆ వెన్నెల వర్షంలో తడుస్తూ
ఒకరికొకరు తోడునీడవుతూ
సాగిపోదాములే ఇలా
రంగురంగుల సీతాకోకచిలుకలా💕🕊 #✍️కవితలు #💘ప్రేమ కవితలు 💟 #🖋️నేటి కవితల స్టేటస్
