*_రాక్షసులు_*
*_రాక్షసులు ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారు??_*
*రాక్షసులు అనేపదం వినపడగానే మనమనస్సులో ఒకరకమయిన భయం, వారి దోషపూరిత ప్రవర్తన, వారిపట్ల అసహ్యం కలుగుతాయి*. *ఎందుకంటే వారి గురించి వారి మనోభావాల గురించి మనం విన్న కథలు అలా మన మనస్సులో ముద్రలు వేశాయి. ఇక పూర్వం వారి ఆకారములు, ప్రవర్తనలు ఎలావున్నా యుగాలననుసరించినా వారిబుద్ధులు మాత్రం మారలేదు. అటువంటి బుద్ధికలవాడు రాక్షసునిగానే వర్ణింపబడుతున్నాడు*.
*మొదటిలో అంటే కృతయుగములో రాక్షసులు జలములలో నివసించేవారట*. *అక్కడనుండే లోకానికి ఉపకారం చేసే వేదాలను దొంగిలించటం* *లాంటివి చేయటము వలన భగవంతుడు* *మత్స్యావతారమెత్తి*,
*వరాహావతారములెత్తి*వారిని* *సంహరించాడు*.
*ఇలాకాదు అని వాళ్ళు నీళ్ళమధ్యలో దీవులలో చేరి లోకములో దుర్మార్గములు చేయటము మాత్రమేకాక, ఆ భావాలను వ్యాపింపచేయాలని ప్రయత్నించారు.*
*అయితే అప్పుడు కూడా ఆయన రామాది అవతారాలను దాల్చి వాళ్లను నిర్మూలించాడు*.
*ఇలాకూడా లాభం లేదు, మనకార్యం*
*నెరవేరాలంటే మనం మానవుల బంధువర్గంగా మారాలని* *సంకల్పించి, కంస, దుర్యోధన, జరాసంధ, శిశుపాలాది రూపాలలో మానవులకు మరింత దగ్గరగా బంధువర్గంగా మారి భూమిపై తమ ధర్మాన్ని విస్తృతం చెయ్యాలని తీవ్రంగా ప్రయత్నించి చాలావరకు మానవజాతిని తమకనుకూలముగా మార్చగలిగారు*.
*ఆయనకూడా ఊరుకోకుండా కృష్ణావతారమెత్తి, సద్బుద్ధి కలిగిన మానవులద్వారానే వారిని ఊచకోత కోపించి, మానవుల కర్తవ్యాన్ని తెలియపరచాడు*.
*ఇక మనం బయటవుంటే*
*వాసుదేవుని నుండి మనం* *తప్పించుకోలేము*. *ఆయనకు దొరకకుండా వుండేందుకు*.
*ఎక్కడచేరి మనప్రయత్నాలు సాగించాలా అని బాగా ఆలోచించి ఈ కలియుగములో మానవ మనస్సులలో నివాసము ఏర్పరచుకున్నారు.*
*అక్కడ నుండి తమ పనులు కొనసాగిస్తున్నారు.*
*అందుకే మనలో కోపాలు, ఈర్ష్య, అసూయాది గుణాలు, ధర్మవిరుద్ధమయిన ప్రవర్తన, భగవంతుని ఉనికిని*
*వ్యతిరేకించటం, సాటి జీవులపట్ల జాలి లేకపోవటం లాంటి లక్షణాలు పొడసూపుతున్నాయి*.
*మనలోనే నివాసమున్న ఈ రాక్షసజాతి మనమాదమరచివున్న సందర్భములో మన మనస్సును అరిషడ్వర్గాలవైపు మళ్ళించటానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు*.
*ఆదమరచామో మనలో వారిగుణాలు ప్రజ్వరిల్లుతుంటాయి. భగవన్నామమనే కవచాన్ని ధరించి ప్రేమ, శమదమాదులనే ఆయుధాలు ధరించి జాగురూకులమై ఉండాలి*.
*వాళ్ళు తలెత్తిన ప్రతిసారీ చావుదెబ్బ తీయాలి.*
*ఇది చాలా కష్టతరమయిన పోరాటం*. *ఎదుటవున్న శత్రువునయితే కనిపెట్టి వుండవచ్చు*. *లోపలున్న ఈ*
*రాక్షసులను* *కనిపెట్టిఉండటమే పెద్ద కష్టం*. *ఇక యుద్ధమెంత కఠినమో ఆలోచించాలి మనం*.
*ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా మన పతనం ఖాయం.* #మన సంప్రదాయాలు సమాచారం
