#🎶గణేశ భజన–మంత్రాలు–ఆరతి🪔 #గణేశారాధన/గణపతి ఆరాధన 🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #వినాయక వైభవం 🕉️🔱🕉️ వినాయకుని విశిష్టత 🙏 #🕉️వినాయక మంత్రాలు
*ఓం లంబోదరాయ నమః*
గణేశ రూపాలు ఎన్నో ఉన్నాయి. గణేశ మంత్రాలు కూడా అసంఖ్యాకమే. ఒక్కోనామానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. ప్రతి మంత్రానికీ విశిష్ట పరమార్థం, ప్రయోజనం ఉంటాయి. ఏ సమయంలో ఎప్పుడైనా ఎవరైనా జపించుకోగలిగే గణపతి మంత్రాలు మూడింటిని చూద్దాం.
_మంత్రం :_ *ఓం లంబోదరాయ నమః*
_వివరణ :_ సృష్టికంతకూ మూలమైన వానికి నమస్కారం అని మంత్రార్థం. లంబోదరుడంటే సాధారణమైన అర్థంలో బానబొజ్జ కలవాడని చెబుతాం. కానీ బ్రహ్మవైవర్త పురాణంలోని గణపతి ఖండం లంబ శబ్దానికి బ్రహ్మాండ భాండములనే వివరణ ఇచ్చింది. లంబోదరుడంటే సృష్టిలోని బ్రహ్మాండాలన్నీ ఉదరంలోనే దాచుకున్నవాడని అర్థం. సిద్దిలక్ష్మీదేవిని అంకముపై కూర్చుండబెట్టుకుని లంబోదరుడు దర్శనమిస్తాడు.
_నేపథ్యం :_ లంబోదర శబ్దాన్ని గురించి ముద్దలపురాణం చక్కగా వివరించింది. భాగవతంలో కూడా బ్రహ్మవర్చసః కామస్తు యదేతా బ్రహ్మణస్పతిం అంటే బ్రహ్మవర్చస్సు, విద్యకావాలనుకునేవారు లంబోదరుణ్ణి పూజించాలని చెప్పారు. లంబోదర లకుమి కథా అనేకీర్తన లంబోదరుడు లక్ష్మీకరుడు అని చెబుతుంది.
_చేయవలసిన క్రమం :_ రోజూ 108 సార్లు
_నైవేద్యం :_ వడపప్పు, ఉండ్రాళ్లు, పెసరపప్పు, పానకం వంటివి ఏవైనా.
_ప్రయోజనం:_ విద్య, యశస్సు, సంపద కలుగుతాయి. స్త్రీలకు వివాహప్రాప్తి, సౌందర్యప్రాప్తి.
_-_
_మంత్రం :_ *ఓం ఫాలచంద్రాయ నమః*
_వివరణ:_ అరచంద్రునివంటి నుదురు కలిగిన స్వామికి నమస్కారం అని మంత్రారం.
_నేపథ్యం:_ స్వామి శిరస్సు మీద ఉండే చంద్రుడు వేరు. ఆకాశంలో మనకు కనిపించే చంద్రుడు వేరు.
నుదురు చంద్రవంకలావుంటే శ్రేష్టమైన జాతకుడవుతాడని సాముద్రిక శాస్త్రం చెపుతుంది. ఇటువంటి స్వామి అందరికీ ఆరాధ్యుడు. రసూల్ ఖాన్ అనేకవి శిశుశశి ఈక్ అయిన ఫాలచంద్ర గణపతికి తాను బందీనైపోయానని చెప్పుకున్నాడు.
_చేయవలసిన క్రమం:_ యధాశక్తి
_నైవేద్యం :_ పళ్లు, పాలు, వడపప్పు వంటివి.
_ప్రయోజనాలు :_ చంద్రుడు మనస్సుకు కారకుడు. ఫాలచంద్ర గణపతిని అర్చిస్తే మానసిక సమస్యలు తొలగిపోతాయి. జ్ఞానము కలుగుతుంది. బుద్ది తీక్ష మవుతుంది. గణపతి సద్విద్య, సద్భుద్ది కలిగిస్తాడు.
_-_
_మంత్రం :_ *ఓం గజవకాయ నమః*
_వివరణ :_ ఏనుగు ముఖం కలిగిన స్వామికి వందనం అని మంత్రార్థం. గజ అన్నప్పుడు గ అంటే జ్ఞానం. జ్జ అంటే ఆచరణ. అంటే ఆచరణాత్మకమైన జ్ఞానాన్ని కలిగించే దేవర గజవక్షుడు. ఈ స్వామి ఎనిమిది ముఖాలతో ఎర్రని శరీరం కలిగివుంటాడు.
_నేపధ్యం:_ నారదపురాణంలో చెప్పిన మహామంత్రాలలో ఇదికూడా ఉంది. శుక్లాంబరధరం విష్ణుం శ్లోకంలో ప్రసన్నవదనం అంటే సింహ. గజముఖాలు కలిగిన్ స్వామి అనే అర్ధాన్ని పెద్దలు చెబుతారు. ఏనుగు ముఖం గంభీరమైంది. దాని మనస్సులో ఏముందో ఎవరికీ తెలియదు. శిక్షించినా, రక్షించినా అపూర్వమైన రీతిలో చేయడం గజవదనుని ప్రత్యేకత
_చేయవలసిన క్రమం :_ రోజుకు 27 సార్లు తగకుండా చేయాలి.
_నేవేద్యం:_ బెల్లంముక్క చాలు.
_ప్రయోజనాలు :_ గజవదనుడైన గణపతిని పూజిస్తే మనలోని ఎనిమిది అవలక్షణాలు తొలగుతాయి. ఉత్సాహం ఫలితం ఆలస్యం చెయ్యిడం, లోభం, దీనత్వం, నిద్ర, సోమరితనం, అరకొరగా పనిచేయడం, స్తబ్దత, మతిమరుపు ఒకప్పుడు ఈ ఎనిమిది అవలక్షణాలూ ఒకప్పుడు దేవతా సైన్యాలకు కలిగితే వాటిని తొలగించడానికే పరమాత్మ గజవదనంతో వచ్చాడు. జ్ఞానం బలం, చురుకైన బుద్ధి సిద్ధిస్తాయి. పోటీపరీక్షలకు చదువుకునే పిల్లలు ఈ మంత్రం జపించాలి.
*డైలీ విష్ వీక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు*
*🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
