*గంజాయి కేసులో ముద్దాయిలు అరెస్ట్*
వెదుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయంపై వచ్చిన విశ్వసనీయ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని, ఎస్ఐ భాగ్యరాజు గారి ఆధ్వర్యంలో వెదులపల్లి విఆర్ఓ మరియు స్టువర్టుపురం విఆర్వోలను వెంట తీసుకొని వృక్షనగర్ ప్రాంతంలో దాడి నిర్వహించారు.
దాడి సమయంలో మేడ్రగుత్తి ప్రతాప్ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తుండగా గుర్తించారు. అదే సమయంలో సాయి హర్షద రెడ్డి అనే వ్యక్తి ప్రతాప్ నుండి గంజాయి కొనుగోలు చేసినట్టు నిర్ధారణ జరిగింది.దీంతో ఇద్దరినీ వెంటనే అదుపులోకి తీసుకుని విచారించి VRΟల సమక్షంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసును దర్యాప్తు చేసి, కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారు ఈ నెల 19 వరకు రిమాండ్ కు పంపించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ భాగ్యరాజు గారు మాట్లాడుతూ
వెదుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి, మత్తు బిళ్లు, నాటు సారాయి వంటి నిషేధిత పదార్థాలను అమ్మేవారిపై మరియు కొనుగోలు చేసేవారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు అవసరమైతే పీడీ యాక్ట్ అమలు చేస్తాం.
అలాగే, ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం ఉన్నవారు ఎద్దులపల్లి పోలీసులకు తెలియజేయాలని, సమాచారదాత వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
#🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్

