ShareChat
click to see wallet page
తమిళనాడులోని ఒక కుగ్రామం, రామే శ్వరం నుండి సుమారు 75 kms. దూరంలో ఉంది "తిరుఉత్తర కోసమాంగై". మధురై వెళ్లే దార్లో వస్తుం ది ఈ ప్రదేశం. ఊరిపేరు పలకడం కొంచెం కష్టమే. మనందరికీ సొంతఊరు ఉన్నట్టే పరమేశ్వరుడికి కూడా సొంతఊరు ఉంది. శివాలయం మొట్టమొదట వెలిసిన ప్రాంతం ఇదే. 3000 సంవత్సరాలకు పూర్వమే ఈ శివాలయం నిర్మించారు. శివభక్తురాలైన మండోదరి శివుడ్ని ప్రార్ధించి "నాకు ఒక గొప్ప శివభక్తుడ్ని భర్త గా ప్రసాదించు ఈశ్వరా!" అని వేడుకుంటే తన భక్తుడైన రావణబ్రహ్మను మండోదరికిచ్చి ఇక్కడే వివాహం జరిపారు. ఏ దేవాలయంలో కూడా పూజకుపయో గించని మొగలిపువ్వును ఇక్కడ మాత్రమే స్వామి వారికి అలంకరిస్తారు. ఇక్కడ వెలసిన రేగిపండు చెట్టు 3000 సంవత్సరాలకు పూర్వమే ఉంది. ఇక్క డ శివుడు శివలింగరూపంలో, మరకతరూపంలో, స్పటికలింగంలో దర్శనమిస్తారు. నటరాజరూపం లో 5 అడుగుల విగ్రహం మరకతంతో చేయబడిం ది. ఇది అత్యంత విశిష్టమైంది. ఆ మరకతం నుండి వచ్చే Vibrations ను మనం తట్టుకోలేం కాబట్టి స్వామివార్ని ఎప్పు డూ విభూది, గంధపుపూతతో ఉంచుతారు. కేవ లం ఆరుద్ర నక్షత్రంరోజు మాత్రమే నిజరూపదర్శ నముంటుంది. అలాగే ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి స్పటికలింగానికి అభిషేకం చేసి తర్వాత Locker లో భద్రపరుస్తారు. 20 ఎకరాల సువిశాల ప్రాంగణంలో అ త్యంతప్రాచీనమైన ఈ శివాలయదర్శనం మన పూర్వజన్మసుకృతం. ఈ ఆలయానికి సమీపంలో అమ్మవారు వారాహిరూపంలో వెలిశారు. భక్తులు పసుపుకొమ్ములను ఆ ప్రాంగణంలోనే నూరి, ము ద్దచేసి, అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలాంటి ఎన్నో విశేషాలతో కూడిన తిరుఉత్తర కోసమాంగై ఆలయం గురించి మన ఆంధ్రులకు పెద్దగా తెలీదు. మీరెప్పుడైనా రామే శ్వరం యాత్రకెళ్తే తప్పక ఈ దేవాలయదర్శనం చేసుకోండి. #"భక్తి సమాచారం" #🙏🏻భక్తి కోట్స్📝 #🙏భక్తి స్పెషల్ #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status
"భక్తి సమాచారం" - ShareChat

More like this