ShareChat
click to see wallet page
మధుమాసవేళ విరిసిన పూవులు నీరాక కోసం ఎదురు చూస్తున్నవి ఆ పూవులను మాలగా కట్టి జడలో తురుముతావని💗✨ సాయంసంధ్యలో కురిసిన జల్లులు ఏడదాగినవోనని నీకై వెతకసాగెను చిలిపి చిరుజల్లులు మోముపై మెల్లగా చిలకరించెదవని💗✨ పున్నమి వెన్నెల రేయి నీకై నిరీక్షించింది పెదవులలో చిరునవ్వుల వెన్నెలని కురిపిస్తావని💗✨ నీకోసం ఎదురు చూసి చూసి నా నయనాలు కలువ పూవులై వికసించెను ఆ పున్నమి చంద్రునిలో నీ మోము అగుపించెను💗✨ దాగుడు మూతలు చాలించి ఇక రావేల... నీకోసం కలలు కన్న ఈ తరుణి కనులలో మనసులో నీవే అని తెలుసుకొనవేల.......💗✨ #✍️కవితలు #🖋️నేటి కవితల స్టేటస్ #💘ప్రేమ కవితలు 💟

More like this