నర్సీపట్నం మున్సిపాలిటీ 14వ వార్డు జోగిపాలెం నుండి భలిఘట్టం బైపాస్ రోడ్‌లో ఏర్పడిన పెద్ద గుంట కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు జనసేన సీనియర్ నాయకుడు శ్రీ అప్పన దొరబాబు గారు తెలుసుకున్నారు.
వెంటనే స్పందించిన దొరబాబు గారు, నర్సీపట్నం టౌన్ జనసేన నాయకులు, అధికారులు కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించి, తక్షణమే రోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ అధ్యక్షుడు అద్దెపల్లి గణేష్ గారు, మారిశెట్టి రాజా, తాతబాబు, సమిరెడ్డి కిరణ్, పోతుల గణేష్, సుకల నాని, లోకారపు ఈశ్వర్, చల్ల చిట్టీబాబు, త్రినాద్ తదితరులు పాల్గొన్నారు.
#PawanKalyan #JanasenaParty
#📸నేను తీసిన ఫొటోస్/వీడియోలు #narsipatnam

01:00