#📙ఆధ్యాత్మిక మాటలు #🕉️ గణపతి బప్పా మోరియా #🙏నా దేశ గొప్పతనం #🎶భక్తి పాటలు🔱  
30-10-2025	ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా"	మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు ఇప్పుడు చాలా-చాలా సాధారణముగా ఉండాలి, ఫ్యాషనబుల్ మరియు ఖరీదైన వస్త్రాలు ధరించినా కూడా దేహాభిమానము వస్తుంది’’
ప్రశ్న:-భాగ్యములో ఉన్నత పదవి లేకపోతే పిల్లలు ఏ విషయములో సోమరులుగా ఉంటారు?
జవాబు:-బాబా అంటారు - పిల్లలూ, స్వయాన్ని తీర్చిదిద్దుకునేందుకు చార్ట్ పెట్టండి. స్మృతి చార్ట్ పెట్టడము వలన చాలా లాభము ఉంటుంది. నోట్ బుక్ సదా చేతిలో ఉండాలి. చెక్ చేసుకోండి - ఎంత సమయము తండ్రిని స్మృతి చేశాను? నా రిజిస్టర్ ఎలా ఉంది? దైవీ క్యారెక్టర్ ఉందా? కర్మలు చేస్తున్నప్పుడు బాబా స్మృతి ఉంటుందా? స్మృతి ద్వారానే తుప్పు తొలగుతుంది, ఉన్నతమైన భాగ్యము తయారవుతుంది.
పాట:-భోళానాథుని కన్నా అతీతమైనవారు లేరు...
▶
ఓంశాంతి. మధురాతి మధురమైన పిల్లల వద్ద ఈ లక్ష్మీ-నారాయణుల చిత్రము ఇంటిలో తప్పకుండా ఉండాలి. వీరిని (లక్ష్మీ-నారాయణులను) చూస్తే చాలా సంతోషము కలగాలి ఎందుకంటే ఇదే మీ చదువు యొక్క లక్ష్యము-ఉద్దేశ్యము. మనము విద్యార్థులము మరియు మనల్ని ఈశ్వరుడు చదివిస్తున్నారు అని మీకు తెలుసు. మనము ఈశ్వరీయ స్టూడెంట్స్ లేక విద్యార్థులము, మనము ఇది చదువుకుంటున్నాము. అందరి కొరకు ఇదొక్కటే ఉద్దేశ్యము. వీరిని చూస్తే చాలా సంతోషము కలగాలి. పాట కూడా పిల్లలు విన్నారు. వారు చాలా భోళానాథుడు. కొంతమంది శంకరుడిని భోళానాథుడని భావిస్తారు, మళ్ళీ శివుడిని మరియు శంకరుడిని కలిపేస్తారు. ఇప్పుడు మీకు తెలుసు - ఆ శివుడు ఉన్నతోన్నతమైన భగవంతుడు మరియు శంకరుడు దేవత, మరి ఇద్దరూ ఒక్కరే ఎలా అవుతారు. భక్తులను రక్షించేవారు... అని కూడా పాటలో విన్నారు, అనగా తప్పకుండా భక్తులకు ఏవో ఆపదలు ఉన్నాయి. పంచ వికారాల ఆపదలు అందరికీ ఉన్నాయి. అందరూ భక్తులే. జ్ఞాని అని ఎవ్వరినీ అనలేరు. ఏ విధముగా శివుడు మరియు శంకరుడు వేర్వేరో, అదే విధముగా జ్ఞానము మరియు భక్తి పూర్తిగా వేర్వేరు విషయాలు. ఎప్పుడైతే జ్ఞానము లభిస్తుందో, అప్పుడిక భక్తి ఉండదు. మీరు సుఖధామానికి యజమానులుగా అవుతారు. అర్ధకల్పము కొరకు సద్గతి లభిస్తుంది. ఒక్క సూచనతోనే మీరు అర్ధకల్పము యొక్క వారసత్వాన్ని పొందుతారు. భక్తులకు ఎన్ని కష్టాలు ఉన్నాయో మీరు చూస్తున్నారు. జ్ఞానము ద్వారా మీరు దేవతలుగా అవుతారు, ఆ తర్వాత భక్తులకు కష్టాలు వచ్చినప్పుడు అంటే దుఃఖము కలిగినప్పుడు తండ్రి వస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, డ్రామానుసారముగా ఏదైతే గతించిందో, అది మళ్ళీ రిపీట్ అవ్వనున్నది. ఆ తర్వాత భక్తి మొదలైనప్పుడు వామ మార్గము ప్రారంభమవుతుంది అనగా పతితులుగా అయ్యే మార్గము ప్రారంభమవుతుంది. అందులో కూడా నంబర్ వన్ కామము, ఈ విషయములోనే ఏమని చెప్తారంటే - కామముపై విజయాన్ని పొందినట్లయితే మీరు జగత్ జీతులుగా అవుతారు. వారెవ్వరూ విజయము పొందలేరు. రావణ రాజ్యములో వికారాలు లేకుండానైతే ఎవ్వరి శరీరమూ జన్మించదు, సత్యయుగములో రావణ రాజ్యము ఉండదు. అక్కడ కూడా ఒకవేళ రావణుడు ఉంటే ఇక మరి భగవంతుడు రామ రాజ్యాన్ని స్థాపన చేసి ఏమి చేసినట్లు? తండ్రికి ఎంత చింత ఉంటుంది. నా పిల్లలు సుఖముగా ఉండాలి అని కోరుకుంటారు. పిల్లలు సుఖముగా ఉండాలని ధనాన్ని కూడబెట్టి పిల్లలకు ఇస్తారు. కానీ ఇక్కడైతే అలా జరగదు. ఇది ఉన్నదే దుఃఖము యొక్క ప్రపంచము. అనంతమైన తండ్రి చెప్తున్నారు, మీరు అక్కడ జన్మ-జన్మాంతరాలు సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. మీకు అపారమైన ధనము లభిస్తుంది, 21 జన్మలు అక్కడ ఎటువంటి దుఃఖము ఉండదు. దివాలా తీయరు. ఈ విషయాలను బుద్ధిలో ధారణ చేసి ఆంతరికముగా చాలా సంతోషముగా ఉండాలి. మీ జ్ఞానము మరియు యోగము అంతా గుప్తమైనవి. స్థూలమైన ఆయుధాలు మొదలైనవేవీ లేవు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇది జ్ఞాన ఖడ్గము. కానీ దీనికి గుర్తుగా వారు స్థూలమైన ఆయుధాలను దేవీల చేతులలో చూపించారు. శాస్త్రాలు మొదలైనవి ఎవరైతే చదువుతారో, వారెప్పుడూ, ఇది జ్ఞాన ఖడ్గము, ఇది జ్ఞాన కత్తి అని అనరు. ఇది అనంతమైన తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు. శక్తి సైన్యము విజయము పొందారంటే వారి వద్ద తప్పకుండా ఏవో ఆయుధాలు ఉంటాయని వారు భావిస్తారు. తండ్రి వచ్చి ఈ పొరపాట్లన్నింటినీ తెలియజేస్తారు. మీ ఈ విషయాలను చాలామంది మనుష్యులు వింటారు. విద్వాంసులు మొదలైనవారు కూడా ఒక రోజు వస్తారు. వీరు అనంతమైన తండ్రి కదా. పిల్లలైన మీరు శ్రీమతముపై నడుచుకోవడములోనే కళ్యాణముంది, అప్పుడు దేహాభిమానము తొలగుతుంది, అందుకే షావుకారులు రారు. తండ్రి అంటున్నారు, దేహ అహంకారాన్ని వదలండి. మంచి వస్త్రాలు మొదలైనవాటి యొక్క నషా కూడా ఉంటుంది. మీరు ఇప్పుడు వనవాహములో ఉన్నారు కదా. ఇప్పుడు మీరు అత్తవారింటికి వెళ్తారు. అక్కడ మీకు చాలా ఆభరణాలు వేస్తారు. ఇక్కడ ఖరీదైన వస్త్రాలు ధరించకూడదు. తండ్రి చెప్తున్నారు, పూర్తిగా సాధారణముగా ఉండాలి. నేను ఎటువంటి కర్మలు చేస్తానో, నన్ను చూసి ఇతరులు చేస్తారు. పిల్లలు కూడా సాధారణముగా ఉండాలి. లేకపోతే దేహ అభిమానము వస్తుంది. అవన్నీ చాలా నష్టపరుస్తాయి. మనము అత్తవారింటికి వెళ్తామని, అక్కడ మనకు చాలా ఆభరణాలు లభిస్తాయని మీకు తెలుసు. ఇక్కడ మీరు ఆభరణాలు మొదలైనవి ధరించకూడదు. ఈ రోజుల్లో దొంగతనాలు మొదలైనవి ఎన్ని జరుగుతున్నాయి. దారిలోనే దొంగలు దోచుకుంటారు. రోజురోజుకూ ఈ గొడవలు మొదలైనవి ఎక్కువవుతూ ఉంటాయి, అందుకే తండ్రి అంటున్నారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి. దేహాభిమానములోకి రావడముతో తండ్రిని మర్చిపోతారు. ఈ శ్రమ ఇప్పుడే చేయవలసి ఉంటుంది. ఇక తర్వాత భక్తి మార్గములో ఎప్పుడూ ఈ శ్రమ చేయవలసిన అవసరముండదు.
ఇప్పుడు మీరు సంగమములో ఉన్నారు. తండ్రి పురుషోత్తమ సంగమయుగములోనే వస్తారని మీకు తెలుసు. యుద్ధము కూడా తప్పకుండా జరుగుతుంది. అటామిక్ బాంబులు మొదలైనవి చాలా తయారుచేస్తూ ఉంటారు. వాటిని తయారుచేయడం ఆపమని ఎంత తల కొట్టుకున్నా కానీ అలా జరగదు. అది డ్రామాలో నిశ్చితమై ఉంది. అర్థం చేయించినా కూడా అర్థం చేసుకోరు. మృత్యువు జరగవలసిందే అన్నప్పుడు అవి తయారుచేయడమనేది ఎలా ఆగుతుంది. వారు అర్థం చేసుకున్నా కానీ తయారుచేయడం మానరు. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. యాదవులు మరియు కౌరవులు సమాప్తమవ్వాల్సిందే. యాదవులంటే యూరోప్ వాసులు. వారిది సైన్స్ గర్వము, దానితో వినాశనము జరుగుతుంది. ఆ తర్వాత సైలెన్స్ గర్వము యొక్క విజయము జరుగుతుంది. మీకు శాంతి యొక్క గర్వములో ఉండటము (శాంతి స్వరూపముగా ఉండటము) నేర్పించడం జరుగుతుంది. తండ్రిని స్మృతి చేయండి - డెడ్ సైలెన్స్. ఆత్మనైన నేను శరీరము నుండి అతీతముగా ఉన్నాను. శరీరాన్ని విడిచిపెట్టడానికి మనము పురుషార్థము చేసినట్లుగా, ఎప్పుడైనా, ఎవరైనా శరీరాన్ని విడిచిపెట్టడానికి పురుషార్థము చేస్తారా? ప్రపంచమంతా వెతికి రండి - ఓ ఆత్మా, ఇప్పుడు నీవు శరీరాన్ని వదలి వెళ్ళాలి అని చెప్పేవారు ఎవరైనా ఉన్నారా. పవిత్రముగా అవ్వండి. లేకపోతే తర్వాత శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. శిక్షలు ఎవరు అనుభవిస్తారు? ఆత్మ. నీవు ఫలానా పాపాలు చేసావు, శిక్షలు అనుభవించు అని ఆ సమయములో సాక్షాత్కారమవుతుంది. ఆ సమయములో జన్మ-జన్మాంతరాల శిక్ష లభిస్తున్నట్లుగా అనుభవమవుతుంది. ఇంతటి దుఃఖాన్ని అనుభవించడమంటే, ఇక సుఖము యొక్క బ్యాలెన్స్ ఏముంటుంది? తండ్రి అంటున్నారు, ఇప్పుడు ఎటువంటి పాప కర్మలు చేయకండి, మీ రిజిస్టర్ పెట్టుకోండి. ప్రతి ఒక్క పాఠశాలలో నడవడిక యొక్క రిజిస్టర్ ను పెడతారు కదా. భారత్ యొక్క క్యారెక్టర్ బాలేదు అని ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా అంటారు. మేము వీరి (లక్ష్మీ-నారాయణుల) వంటి క్యారెక్టర్స్ ను తయారుచేసుకుంటున్నామని చెప్పండి. ఈ లక్ష్మీ-నారాయణుల చిత్రమైతే సదా మీతోపాటు ఉండాలి. ఇది లక్ష్యము-ఉద్దేశ్యము. మనము ఈ విధముగా తయారవుతాము. శ్రీమతము ఆధారముగా మనము ఈ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నాము. ఇక్కడ నడవడికను తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇక్కడ మీ కచేరి కూడా జరుగుతుంది. అన్ని సెంటర్లలోనూ పిల్లలు కచేరి జరపాలి. చార్ట్ పెడితే పరివర్తన అవుతారు అని రోజూ చెప్పండి. ఎవరి భాగ్యములోనైనా లేకపోతే, ఇక వారు సోమరులుగా అయిపోతారు. చార్ట్ పెట్టడము చాలా మంచిది.
మనము ఈ 84 జన్మల చక్రాన్ని తెలుసుకోవడము ద్వారానే చక్రవర్తీ రాజులుగా అవుతామని మీకు తెలుసు. ఇది ఎంత సహజము. అంతేకాక పవిత్రముగా కూడా అవ్వాలి. స్మృతియాత్ర యొక్క చార్ట్ పెట్టండి, ఇందులో మీకు చాలా లాభముంది. నోట్ బుక్ తీయలేదంటే, బాబాను స్మృతి చేయలేదని భావించండి. నోట్ బుక్ సదా చేతిలో ఉంచుకోండి. ఎంత సమయము తండ్రిని స్మృతి చేసాను అని మీ చార్ట్ చూసుకోండి. స్మృతి లేకుండా తుప్పు వదలదు. తుప్పును వదిలించేందుకు వస్తువును కిరోసిన్ లో వేస్తారు కదా. కర్మలు చేస్తూ కూడా తండ్రిని స్మృతి చేయాలి, అప్పుడు పురుషార్థము యొక్క ఫలము లభిస్తుంది. ఇందులో శ్రమ ఉంది కదా. తలపై కిరీటాన్ని ఊరికే అలా పెట్టరు కదా. బాబా ఇంత ఉన్నత పదవిని ఇస్తున్నారు, ఎంతోకొంత శ్రమించాలి కదా. ఇందులో కాళ్ళు, చేతులు మొదలైనవేవీ కదిలించవలసిన అవసరము లేదు. చదువైతే పూర్తిగా సహజమైనది. శివబాబా నుండి బ్రహ్మా ద్వారా మనము ఈ విధముగా అవుతున్నామని మీ బుద్ధిలో ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా బ్యాడ్జ్ ధరించి ఉండాలి. వాస్తవానికి ఇది కోట్ ఆఫ్ ఆర్మ్స్ (రాజ ముద్ర) అని చెప్పండి. అర్థం చేయించడములో చాలా రాయల్టీ ఉండాలి. చాలా మధురతతో అర్థం చేయించాలి. రాజ ముద్ర గురించి కూడా అర్థం చేయించాలి. ప్రీతి బుద్ధి మరియు విపరీత బుద్ధి అని దేనిని అంటారు? మీకు తండ్రి గురించి తెలుసా? లౌకిక తండ్రినైతే గాడ్ అని అనరు. ఆ అనంతమైన తండ్రియే పతిత-పావనుడు, సుఖ సాగరుడు. వారి నుండే అపారమైన సుఖము లభిస్తుంది. తల్లి-తండ్రులు సుఖము ఇస్తారని అజ్ఞాన కాలములో భావిస్తారు. వారు అత్తవారింటికి పంపిస్తారు. ఇప్పుడు మీది అనంతమైన అత్తవారిల్లు, అది హద్దులోని అత్తవారిల్లు. ఆ తల్లి-తండ్రులు మహా అయితే 5-7 లక్షలు లేక కోటి రూపాయలు ఇస్తారు. మీకైతే తండ్రి, పదమా పదమపతులుగా అయ్యే పిల్లలు అని పేరు పెట్టారు. అక్కడైతే ధనము యొక్క విషయమే లేదు. అక్కడ అన్నీ లభిస్తాయి. చాలా మంచి-మంచి మహళ్ళు ఉంటాయి. జన్మ-జన్మాంతరాల కొరకు మీకు మహళ్ళు లభిస్తాయి. సుదాముని ఉదాహరణ ఉంది కదా. పిడికెడు బియ్యమని విన్నారు కనుక ఇక్కడకు కూడా అవి తీసుకుని వస్తారు. ఇప్పుడు వట్టి బియ్యమైతే తినరు. కావున దానితో పాటు కొంత మసాలా మొదలైనవి కూడా తీసుకువస్తారు. ఎంత ప్రేమతో తీసుకువస్తారు. బాబా అయితే మనకు జన్మ-జన్మాంతరాల కొరకు ఇస్తారు, అందుకే వారిని దాత అని అంటారు. భక్తి మార్గములో మీరు ఈశ్వరార్థము ఇస్తే దానికి అల్పకాలము కొరకు మరుసటి జన్మలో లభిస్తుంది. కొంతమంది పేదవారికి ఇస్తారు, కాలేజ్ నిర్మిస్తారు, దానికి వారికి మరుసటి జన్మలో చదువు దానముగా లభిస్తుంది. ధర్మశాలలు నిర్మిస్తే ఇల్లు లభిస్తుంది ఎందుకంటే ధర్మశాలలకు చాలామంది వచ్చి సుఖము పొందుతారు. ఇక్కడ ఇది జన్మ-జన్మాంతరాల విషయము. శివబాబాకు ఏదైతే ఇస్తారో, దానినంతా మన కోసమే ఉపయోగిస్తారని మీకు తెలుసు. శివబాబా అయితే తమ వద్ద ఉంచుకోరు. అంతా ఇచ్చేయండి, అప్పుడు విశ్వానికి యజమానిగా అవుతారని వీరికి కూడా చెప్పారు. వినాశన సాక్షాత్కారము కూడా చేయించారు, రాజ్యము యొక్క సాక్షాత్కారము కూడా చేయించారు. అంతే, బాబా నన్ను విశ్వానికి యజమానిగా చేస్తున్నారు అని నషా కలిగింది. గీతలో కూడా అర్జునుడికి - నన్ను స్మృతి చేసినట్లయితే నీవు ఈ విధముగా అవుతావు అని సాక్షాత్కారము చేయించినట్లుగా ఉంది. వినాశనము మరియు స్థాపన యొక్క సాక్షాత్కారము చేయించారు. వీరికి కూడా ప్రారంభములో సంతోషము యొక్క పాదరసము పైకి ఎక్కింది. డ్రామాలో ఈ పాత్ర ఉంది. భగీరథుని గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. మేము ఇలా అవుతాము అని పిల్లలైన మీకు ఈ లక్ష్యము-ఉద్దేశ్యము బుద్ధిలో ఉండాలి. ఎంత పురుషార్థము చేస్తారో, అంత ఉన్నత పదవిని పొందుతారు. ఫాలో ఫాదర్ అని అంటూ ఉంటారు. ఇది ఈ సమయము యొక్క విషయమే. అనంతమైన తండ్రి చెప్తున్నారు, నేను ఏదైతే సలహా ఇస్తున్నానో, దానిని ఫాలో చేయండి. వీరు ఏం చేసారో, అది కూడా చెప్తారు. వారిని వ్యాపారి, రత్నాకరుడు, ఇంద్రజాలికుడు అని అంటారు కదా. బాబా అకస్మాత్తుగానే అంతా వదిలేశారు. మొదట ఆ రత్నాల వ్యాపారిగా ఉండేవారు, ఇప్పుడు అవినాశీ జ్ఞాన రత్నాల వ్యాపారిగా అయ్యారు. నరకాన్ని స్వర్గముగా చేయడం ఎంత గొప్ప ఇంద్రజాలము. అంతేకాక, వీరు వ్యాపారి కూడా. పిల్లలకు ఎంత మంచి వ్యాపారము ఇస్తారు. మీ వద్ద ఉన్న విలువలేనివాటిని మరియు పిడికెడు బియ్యాన్ని తీసుకుని మహళ్ళు ఇస్తారు. వారు ఎంత మంచి సంపాదనను చేయిస్తారు. వజ్రాల వ్యాపారములో కూడా ఇలాగే జరుగుతుంది. ఎవరైనా అమెరికన్ కస్టమర్ వస్తే, వారి నుండి 100 రూపాయల వస్తువుకు 500, 1000 రూపాయలు కూడా తీసుకుంటారు. వారి నుండైతే చాలా డబ్బులు తీసుకుంటారు. మీ వద్దనైతే అన్నిటికన్నా పాత వస్తువు ఉంది, అదే ప్రాచీన యోగము.
మీకు ఇప్పుడు భోళానాథుడైన తండ్రి లభించారు. వారు ఎంత భోళా. మిమ్మల్ని వారు ఎలా తయారుచేస్తున్నారు. విలువలేనివాటికి రిటర్న్ లో మిమ్మల్ని 21 జన్మల కోసం ఎలా తయారుచేస్తారు. మనుష్యులకు ఏమీ తెలియదు. అప్పుడప్పుడు భోళానాథుడు ఇది ఇచ్చారని అంటారు, అప్పుడప్పుడు అంబ ఇచ్చారని అంటారు లేక గురువు ఇచ్చారని అంటారు. ఇక్కడ ఉన్నది చదువు. మీరు ఈశ్వరీయ పాఠశాలలో కూర్చున్నారు. ఈశ్వరీయ పాఠశాల అని గీతను అంటారు. గీతలో భగవానువాచ అని ఉంది. కానీ భగవంతుడు అని ఎవరిని అంటారో కూడా ఎవ్వరికీ తెలియదు. పరమపిత పరమాత్మ గురించి తెలుసా అని ఎవరినైనా అడగండి. తండ్రి తోట యజమాని. మిమ్మల్ని ముళ్ళ నుండి పుష్పాలుగా తయారుచేస్తున్నారు. దానిని గార్డెన్ ఆఫ్ అల్లాహ్ (అల్లా యొక్క పుష్పాల తోట) అని అంటారు. యూరోపియన్లు కూడా ప్యారడైజ్ అని అంటారు. భారత్ పరిస్తాన్ గా ఉండేది, ఇప్పుడు కబ్రిస్తాన్ (స్మశానవాటిక) గా ఉంది. ఇప్పుడు మళ్ళీ మీరు పరిస్తాన్ కు యజమానులుగా అవుతారు. తండ్రి వచ్చి నిద్రిస్తున్న వారిని మేలుకొలుపుతారు. ఇది కూడా మీకు నంబరువారు పురుషార్థానుసారముగా తెలుసు. ఎవరైతే స్వయం మేలుకుంటారో, వారు ఇతరులను కూడా మేలుకొలుపుతారు. మేలుకొలపడం లేదు అంటే స్వయం మేలుకోలేదని అర్థము. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ పాటలు మొదలైనవి కూడా డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి. కొన్ని పాటలు చాలా బాగున్నాయి. మీరు ఉదాసీనముగా ఉన్నప్పుడు ఈ పాటలు పెట్టుకున్నట్లయితే సంతోషములోకి వస్తారు. రాత్రి ప్రయాణీకుడా అలసిపోకు - ఈ పాట కూడా బాగుంటుంది. ఇప్పుడు రాత్రి పూర్తవుతుంది. భక్తి ఎంతగా చేస్తే అంత త్వరగా భగవంతుడు లభిస్తారని మనుష్యులు భావిస్తారు. హనుమంతుడు మొదలైనవారి సాక్షాత్కారము కలిగితే భగవంతుడు లభించారని భావిస్తారు. తండ్రి అంటున్నారు, ఈ సాక్షాత్కారాలు మొదలైనవన్నీ డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి. ఎటువంటి భావన పెట్టుకుంటే, అటువంటి సాక్షాత్కారము జరుగుతుంది. అంతేకానీ అటువంటి వారెవ్వరూ ఉండరు. తండ్రి చెప్పారు - ఈ బ్యాడ్జి అయితే అందరూ సదా ధరించి ఉండాలి. రకరకాల బ్యాడ్జిలు తయారవుతూ ఉంటాయి. అర్థం చేయించేందుకు ఇది చాలా బాగుంటుంది.
మీరు ఆత్మిక మిలటరీ కదా. మిలటరీ వారికి సదా గుర్తులు ఉంటాయి. పిల్లలైన మీ వద్ద కూడా బ్యాడ్జి ఉంటే - మేము ఇలా తయారవుతున్నాము అని నషా ఉంటుంది. మనము విద్యార్థులము. బాబా మనల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తున్నారు. మనుష్యులు దేవతలను పూజిస్తారు. దేవతలు దేవతలను పూజించరు. ఇక్కడ మనుష్యులు దేవతలను పూజిస్తారు ఎందుకంటే వారు శ్రేష్ఠమైనవారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. బుద్ధిలో సదా మీ లక్ష్యము-ఉద్దేశ్యము గుర్తుంచుకోవాలి. లక్ష్మీ-నారాయణుల చిత్రము సదా మీతోపాటు ఉండాలి. మేము ఈ విధముగా తయారయ్యేందుకు చదువుకుంటున్నాము, ఇప్పుడు మేము ఈశ్వరీయ విద్యార్థులము అని ఇదే సంతోషములో ఉండండి.
2. మీ వద్ద ఉన్న పాత విలువలేనివాటిని మరియు పిడికెడు బియ్యాన్ని ఇచ్చి మహళ్ళను తీసుకోవాలి. బ్రహ్మాబాబాను ఫాలో చేసి అవినాశీ జ్ఞాన రత్నాల వ్యాపారులుగా అవ్వాలి.
వరదానము:-నిశ్చయము యొక్క ఆధారముగా విజయీ రత్నాలుగా అయ్యి సర్వుల కొరకు మాస్టర్ ఆశ్రయ దాత భవ
నిశ్చయబుద్ధి కలిగిన పిల్లలు విజయులుగా అయిన కారణముగా సదా సంతోషములో నాట్యము చేస్తారు. వారు తమ విజయాన్ని వర్ణన చెయ్యరు, కానీ విజయులుగా అయిన కారణముగా వారు ఇతరులకు కూడా ధైర్యాన్ని పెంచుతారు. వారు ఎవ్వరినీ కించపరిచే ప్రయత్నము చెయ్యరు. వారు తండ్రి సమానముగా మాస్టర్ ఆశ్రయ దాతలుగా అవుతారు అనగా ఇతరులను కింది నుండి పైకి లేపుతారు. వారు వ్యర్థము నుండి సదా దూరముగా ఉంటారు. వ్యర్థము నుండి పక్కకు వెళ్ళటమే విజయులుగా అవ్వటము. ఇటువంటి విజయీ పిల్లలు సర్వుల కొరకు మాస్టర్ ఆశ్రయ దాతలుగా అవుతారు.
స్లోగన్:-నిస్వార్థ మరియు నిర్వికల్ప స్థితి ద్వారా సేవ చేసేవారే సఫలతా మూర్తులు.
 
అవ్యక్త సూచనలు - స్వయము కొరకు మరియు సర్వుల కొరకు మనసు ద్వారా యోగ శక్తులను ప్రయోగము చెయ్యండి
యోగ ప్రయోగము చేసేందుకు దృష్టి-వృత్తిలో కూడా పవిత్రతను ఇంకా ఎక్కువగా అండర్ లైన్ చెయ్యండి. ముఖ్యమైన పునాది ఏమిటంటే - మీ సంకల్పాలను శుద్ధముగా, జ్ఞాన స్వరూపముగా, శక్తి స్వరూపముగా తయారుచేసుకోండి. ఎవరు ఎంతగా భ్రమిస్తూ, అలజడి మరియు దుఃఖపు అలతో వచ్చినా కానీ, వారు సంతోషముగా ఉండటాన్ని అసంభవముగా భావించినా కానీ, మీ ఎదురుగా వస్తూనే మీ మూర్తి, మీ వృత్తి, మీ దృష్టి ఆ ఆత్మను పరివర్తన చేయాలి. ఇదే యోగ ప్రయోగము.
"
