ShareChat
click to see wallet page
మంత్రాలయ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి... మంత్రాలయము ************** ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన ఒక పుణ్యక్షేత్రం. కలియుగ కల్పవృక్షం ~ మంత్రాలయ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఓం నమో శ్రీ రాఘవేంద్రాయ నమః ధృవనక్షత్ర సమానమైన రాఘవేంద్రస్వామివారి పుణ్యక్షేత్రం మంత్రాలయం . తుంగభద్రా నదీతీరంలో ఉంది. ఇది రాఘవేంద్రస్వామి యొక్క అతి ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం. ఇది కర్నూలు నుండి 100కి.మీ దూరంలో ఉంది. ఇక్కడకు దగ్గరలో పంచముఖి ఆంజనేయుని ఆలయం ఉంది. ఇక్కడ ప్రతిరోజు ఉచిత అన్నదానం జరుగుతుంది. ఇక్కడ గురువారం ప్రత్యకత. ఇక్కడ సాయంత్రం స్వామివారి ఏనుగు అందరిని దీవిస్తూ సందడి చేస్తుంది. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి. ---------------------------------------------- శ్రీ గురు రాఘవేంద్ర స్వామి (1595-1671), హిందూ మతములో ఓ ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించాడు. ఇతను వైష్ణవాన్ని అనునయించాడు, మరియు మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించాడు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. ఇతను శ్రీమూల రాముడి మరియు శ్రీ పంచముఖ ముఖ్యప్రాణదేవరు (పంచముఖ హనుమంతుడు) యొక్క పరమ భక్తుడు. ఇతను పంచముఖిలో తపస్సు చేసాడు, ఇచ్చట హనుమంతుణ్ణి దర్శించాడు. మంత్రాలయంలో తన మఠాన్ని స్థాపించాడు, మరియు ఇక్కడే సజీవ సమాధి అయ్యాడు. వేలకొలదీ భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు. #🌅శుభోదయం #🌷గురువారం స్పెషల్ విషెస్ #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #🛕రాఘవేంద్ర స్వామి🙏 #🛕మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి🕉️
🌅శుభోదయం - ShareChat

More like this