ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి
కూటమి ప్రభుత్వం కృషి..
గిద్దలూరు ఆర్టీసీ డిపోలో నిర్వహించిన ఉత్తమ ఉద్యోగుల అభినందన సభలో పాల్గోన్న ఆర్టీసీ డీ.ఎం ద్వారకా తిరుమలరావు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..
గిద్దలూరు ఆర్టీసీ డిపోను మరింత అభివృద్ధి చేయాలని కోరిన ఎమ్మెల్యే ముత్తుముల*
తక్షణమే ఆర్టీసీ అభివృద్ధికి రూ. 2 కోట్లు మంజూరు చేసిన ఆర్టీసీ ఎం.డీ ద్వారకా..
ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్టిసి ఎండి శ్రీ సి.హెచ్ ద్వారకా తిరుమలరావు గారు పేర్కొన్నారు. గిద్దలూరు ఆర్టీసీ డిపోలో నిర్వహించిన ఉత్తమ ఉద్యోగుల అభినందన సభలో రాష్ట్ర ఆర్టీసీ ఎం.డీ శ్రీ ద్వారకా తిరుమలరావు మరియు గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గార్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.. మొదటగా ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాన్ని పరిశీలించి, డిపో ప్రాంగణంలో పూలమొక్కలను నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. గత వైసీపీ పాలకులు కేవలం తమ స్వార్ధం కోసం ఆర్టీసీ విలీనం పేరుతో ఆర్టీసీ కార్మికులను నయవంచన చేశారని కార్మికుల ఖాతాల్లోని పిఎఫ్ నగదును సైతం కాచేశారన్నారు. రాష్ట్ర సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యువనాయకుడు నారా లోకేష్ గార్లు నిత్యం కార్మికుల సంక్షేమం కోసమే శ్రమిస్తున్నారనన్నారు. గిద్దలూరు ఆర్టీసీ డిపోను గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే అభివృద్ధి చేశానని, ప్రస్తుతం గిద్దలూరు ఆర్టీసీ డిపోను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, ప్రయాణికులకు విశ్రాంతి, గదులు మరియు మరుగుదొడ్లు, ఆర్టీసీ కార్మికులకు విశ్రాంతి గదులు ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని ఎండీ గారిని కోరగా తక్షణమే స్పందించిన ఎండీ ద్వారకా తిరుమల రావు గారు గిద్దలూరు ఆర్టీసీ డిపో అభివృద్ధికి రూ. 2 కోట్లు మంజూరు చేశారు. ఈ సందర్బంగా ఆర్టీసీ కార్మికులు గిద్దలూరు ప్రజల తరుపున ఎమ్మెల్యే ధన్యవాదములు తెలిపారు. అనంతరం ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శక్తి పథకం సజావుగా సాగుతుందని, స్త్రీ శక్తి పథకం విజయంలో ఆర్టీసీ కార్మికులదే ప్రధాన పాత్ర అని అన్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా 8 వేల మందికి పదోన్నతులు లభిస్తున్నాయని, అందులో మన జోన్ లో 1964 మందికి పదోన్నతులు లభిస్తున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెండింగ్ లో ఉన్న డీఎ లను విడుదల చేశామన్నారు.. గిద్దలూరు ఆర్టీసీ ముందుకు నడవటంలో డ్రైవర్, కండక్టర్లతో పాటు డిపోలోని గ్యారేజ్ కార్మికులు చాలా ప్రతిభ కలిగిన వారని, బస్సులు ఎటువంటి సమస్యలు లేకుండా సజావుగా నడవాలంటే గ్యారేజ్ కార్మికుల కృషే అని అన్నారు. కార్మికుల సంక్షేమం, ఆరోగ్య భద్రత, మౌళిక వసతుల కల్పన దిశగా కృషి చేస్తామన్నారు. ఈ సందర్బంగా ఆర్టీసీ డిపోలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు ప్రశంశా పత్రాలను అందచేశారు. ఆర్టీసీ గ్యారేజ్ కార్మికులకు రైన్ కోట్లను అందచేశారు.. ఈ కార్యక్రమలో నెల్లూరు జోన్ ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ సురేష్ రెడ్డి, నెల్లూరు జోన్ ఈడీ రాజేంద్ర ప్రసాద్, ఆర్టీసీ ఈడీఓ అప్పలరాజు, ఈడీఈ చెంగల్ రెడ్డి, జనసేన ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు, ఆర్టీసీ ఇన్ఛార్జ్ డీఎం మౌనిక, గిద్దలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, సొసైటీ బ్యాంక్ చైర్మన్ దుత్తా బాల ఈశ్వరయ్య, మరియు మరియు ఆర్టీసీ సిబ్బంది, కార్మికులు పాల్గోన్నారు. #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు

