ShareChat
click to see wallet page
శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం......!! శత్రు బాధలు, పిశాచ బాధలు, ఆరోగ్య సమస్యలువున్నవారు ప్రతినిత్యము అత్యంత శ్రద్ధతో శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం పఠించిన వారికి తప్పక శుభములు చేకూరగలవు. ఐదు ముఖాలు పదిచేతులు అందలి ఆయుధములు తూర్పున వానరము , దక్షిణమున నారసింహ , పడమర గరుత్మాన్ , ఉత్తరాన వరాహం పై భాగాన హయగ్రీవ ముఖములు కల్గిఉండే మూర్తి. ఒక్కొక్క ముఖానికి 3 నేత్రాలు .పూర్ణ రుద్రావతారం విభీషణుని కుమారుడు.నీలుని కొరకు అవతరించినమూర్తి శ్లో || విభీషణ సుతో నిలః సతతం సాధుపూజితః పంచవక్ర్త హనుమంత ముపాసే త్సమృద్దిభాక్ మూలమంత్రము : “ ఓమ్ హరి మర్కట మర్కటాయస్వాహా ” శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం.... వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా హస్తాబ్జె రసి ఖేట పుస్తక సుధాకుంభాం కుశా ద్రిం గదాం ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం సర్వారి గర్వాపహం భావం:- వానర ,నారసింహ ,గరుడ ,సూకర (వరాహం ), అశ్వ అనే అయిదు ముఖాలతో , అనేక అలంకారాలతో , దివ్య కాంతి తో,దేదీప్యమానమైన 15 నేత్రాలు, పద్మాలవంటి హస్తాలు, ఖడ్గం, డాలు, పుస్తకం, అమృత కలశం ,అంకుశం,పర్వతం ,నాగలి, మంచంకోడు (ఖత్వాంగం ),మణులు ,ధరించిన వాడు,సర్ప శత్రువు అయిన గరుత్మంతుని గర్వాన్ని హరించిన వాడు అయిన హనుమంతునికి నమస్కారం . . #☀️శుభ మధ్యాహ్నం #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🕉️శ్రీ ఆంజనేయం #🚩జై భజరంగబలి💪
☀️శుభ మధ్యాహ్నం - 7 [ ~shnu Vislnu Arts Ovishnuprabhanc 7 [ ~shnu Vislnu Arts Ovishnuprabhanc - ShareChat

More like this