ShareChat
click to see wallet page
*ప్రత్యేక మాస్టర్ ప్లాన్ తో మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల అభివృద్ధి --- ఎమ్మెల్యే జారె* *23.09.2025 - మంగళవారం* ములుగు జిల్లా మేడారంలో గిరిజన దేవతలైన సమ్మక్క-సారలమ్మ అమ్మవారి గద్దెల అభివృద్ధి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీమతి ధనసరి సీతక్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. *అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.* ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సమ్మక్క-సారలమ్మ గద్దెలను ఆధునికంగా అభివృద్ధి చేసి, యాత్రికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. *ఈ చారిత్రాత్మక నిర్ణయం గిరిజన సమాజంతో పాటు తెలంగాణ ప్రజలకు గర్వకారణమని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు అభిప్రాయపడ్డారు.* #కాంగ్రెస్ #🏛️రాజకీయాలు #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🌍నా తెలంగాణ #🔹కాంగ్రెస్
కాంగ్రెస్ - ShareChat

More like this