#💐నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు🎊 ఓక మంచి స్ఫూర్తిదాయకమైన, యావత్ దేశం మెచ్చిన సుపరిపాలకుడు మోదీజీ కి గౌరవ,అభిమాన,ఆత్మీయపూర్వక 75వ జన్మదిన శుభాకాంక్షలు! ( 17 - 9 - 2025)!
లేదా
భారతదేశాన్ని తన అసాధారణ నాయకత్వ పటిమతో ఓక తిరుగులేని,ఎదురులేని దేశంగా తీర్చిదిద్దిన గొప్ప ఘనత మన ప్రియతమ ప్రధాని మోదీజీ ది!
తన అద్భుతమైన నాయకత్వ పటిమతో,మచ్చలేని వ్యక్తిత్వంతో భారతదేశాన్ని అన్ని రంగాలలో ఓక బలమైన శక్తిగా తీర్చిదిద్దిడంలో,ఓక అసాధారణ,శత్రు దుర్బెద శక్తిగా మలచడంలో నూటికి నూరుపాళ్ళు విజయం సాధించారు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ గారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.ముఖ్యంగా ఆయన జన్మదినం అయిన ఈ సెప్టెంబర్ 17 ను పురస్కరించుకొని ఒక్కసారి మన మన ప్రధాని మోదీజీ గొప్పతనాన్ని,ఆయన నాయకత్వ లక్షణాలను,ఆయన ఎదిగిన తీరుతెన్నులను అశేష భారతదేశ ప్రజానీకం అయిన మనమందరం ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాల్సిన గురుతర బాధ్యత మనందరిపై వుంది.అదేవిధంగా ఓక సాధారణ టీ అమ్ముకునే దుకాణం వారి ఇంట 1950 వాద్ నగర్, మెహసానా ( గుజరాత్ ) లో జన్మించారు మన మోదీ జీ గారు.ఆయన తన చిన్ననాటి రోజుల్లో వాళ్ళ నాన్న అమ్మే టీ దుకాణానికి సహాయం చేస్తూ,చేదోడు, వాదోడిగా వున్న మోదీ ఆ తరువాత తానే స్వయంగా ఓక టీ దుకాణాన్ని నెలకొల్పాడు.అయితే 8 ఏళ్ల వయస్సులోనే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు నచ్చి ఆ సంస్థలో చేరారు.ఆ సంస్థలో అంచె లంచెలుగా ఎదుగుతూ 1985లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోని ఆ పార్టీ లో చేరారు.ఇక అక్కడి నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మోదీజీ తనకున్న వాక్ చాతుర్యం,నాయకత్వ లక్షణాలతో గుజరాత్ రాష్ట్రానికి ఏకంగా బీజేపీ పార్టీ తరపున రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు.ఇక ఆ తరువాత ఆయన రాజకీయ జీవితం ఉప్పందుకుంది,1995 లో ఏకంగా ఆయన బీజేపీ జాతీయ సంస్థ కార్యదర్శిగా ఎన్నికయ్యారు.ఓక విధంగా చెప్పాలంటే ఇక అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. ఎందుకంటే 1995 తరువాత కాలంలో గుజరాత్ రాష్ట్రం లోని ఓక స్థానానికి శాసన సభ్యునిగా గెలిచి ఏకంగా తన ప్రతిభాసామర్త్యాలతో,ఆ రాష్ట్ర ప్రజల విశేష ఆదరణతో గుజరాత్ రాష్ట్రానికే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.అలా గుజరాత్ రాష్ట్రాన్ని దాదాపు (2001- 14) 14 సంవత్సరాలు అత్యంత అప్రతిహాసంగా, సమర్థవంతంగా,దిగ్విజయంగా పరిపాలన సాగించారు.ఇక ఆ తరువాత ఎవరు ఊహించని విధంగా 2014 లో ఎంపీగా ఓక లోకసభ సీటును గెలుచుకొని ఏకంగా మన భారతదేశ ప్రధానిగా ఎన్నికయ్యారు.దీంతో 1984 తరువాత భారతీయ జనతా పార్టీకి లోకసభ లో అత్యధిక మెజారిటీ తెచ్చిన ఘనతను, గొప్ప చరిత్రను మన ప్రియతమ ప్రధాని మోదీ మూటగట్టుకున్నాడు, తన పేర సువర్ణాక్షరాలతో లీఖించుకున్నాడు.ఆయన ఈ విధంగా అత్యంత విజయవంతంగా మూడో మారు సైతం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు అంటే యావత్ ఈ దేశ ప్రజానీకం ఆయన నాయకత్వంపై అంచె లంచెల నమ్మకం ఉంచడమే.అలాగే కోట్లాదిమంది భారతదేశ ప్రజానీకం తన మీద పెట్టుకున్న ఆశలను ఏ మాత్రం వమ్ము చేయకుండా భారతదేశాన్ని అన్ని రంగాలలో ఓక బలియమైన శక్తిగా తీర్చిదిద్దడం లో మన ప్రియతమ ప్రధాని చూపిన దృఢదీక్ష,చూపిన ధైర్య సాహసాలు,తెగువ,ఓర్పు,సహన శక్తి నభుతో నాభవిష్యత్ అని చెప్పవచ్చు.ముఖ్యంగా గత పార్టీ ల మాదిరి అరకొర మెజారిటీ తెచ్చుకొని ఇతర చిన్న చితక పార్టీ ల కనుసన్నలతో పాలన సాగించే దౌర్భాగ్యానికి తెరదించుతూ తమ బీజేపీ పార్టీ సాధించిన అఖండ మెజారిటీ తో చాలా స్వేచ్ఛగా, బందుప్రీతికి,అవినీతికి ఆమడ దూరంలో వుంటూ ఓక జనరంజక పాలనను భారతదేశ ప్రజానీకానికి సాక్షాత్కరింప చేస్తూ దేశానికి పాలకుడు అంటే ఇలా ఉండాలి అనేలా ఓక ఆదర్శ పాలనకు నడుము బిగించి ఆశేష భారతదేశ ప్రజల అదరాభిమానాలకు పాత్రుడు కావడమే కాదు,యావత్ ప్రపంచం మన దేశం వైపు చూసేలా తన పరిపాలన సామర్త్యాలను చాలా గొప్పగా,అన్ని దేశాల నాయకులతో శెభాష్ అనిపించుకునేలా సాగించాడు మన ప్రియతమ ప్రధాని మోదీజీ గారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఏదిఏమైన మన దేశ శాంతి,సౌభాగ్యాల కోసం, సామాన్య ప్రజల యోగ, క్షేమాలు,అభివృద్ధి కోసం మనసా,వాచ,కర్మణ ఆవిరళ కృషి సలుపుతున్న మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీజీ గారికి యావత్ భారతదేశం, ఈ దేశ ప్రజలు ఎంతో రుణపడి వున్నారు అనే మాట అక్షర సత్యం.ఏమైనా ఆయన 75 వ జన్మదినం అయిన ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని మన ప్రియతమ ప్రధానిమంత్రివర్యులు అయిన మన నరేంద్ర మోదీజీ గారికి భారతదేశ ప్రజలం అయిన మనమందరం ఆయనకు ప్రేమ,అభిమాన, గౌరవ,ఆత్మీయతానురాగాలతో కూడిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజెయాల్సిన గురుతర బాధ్యత మనందరి భుజస్కంధాలపై ఎంతైనా ఉంది.అలాగే ఆ సర్వేశ్వరుని అనంత కరుణ,కృప,కటాక్షలతో ఇలాగే దేశానికి మంచి స్ఫూర్తిదాయకమైన సేవలు చేస్తూ ఆయన నిండు నూరేళ్లు,ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా,హృదయపూర్వకంగా కోరుకుందాం.జయ జయహో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీజీ గారు! మేరా హిందూస్తాన్ మహాన్!
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా!

00:58