ఏనాటిదో ఈ బంధం❣
ఏ జన్మదో ఈ అనుబంధం
నీకై వేచే ప్రతి నిమిషం
నాకొక యుగంలా అనిపిస్తుంటే
నీకోసం తలిచే ప్రతిక్షణం
నాకు ఏం తోచకుంటే.....❣
ఏదో ఒక రాగం మదిని మీటింది
నా ఎదను లోతుకు చేరి
నను కదిలించింది
ఆ రాగమే ఒక అమర గానమై
మనసును ఆవైపుకు
లాగిన వేళ❣
నీకోసం నా మనసు పరుగు తీసే
నీకోసం నా వయసు ఉరకలేసే
నీకోసం నా నయనం
ఎదురు చూసే❣
నీ కోసం నా హృదయం తపించిపోయే
నీ రాక నా మదికి
సాంత్వన కాదా
నీవు కనుల ముందు
నిలిచిన క్షణం
నా హృదయం అలలా ఎగసిపోదా❣ #✍️కవితలు #💘ప్రేమ కవితలు 💟 #🖋️నేటి కవితల స్టేటస్
