#🙏పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి కారణజన్ముడు,సాక్షాత్తు దైవాంశసంభూతుడు,ప్రేమ మూర్తి అయిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 99వ జయంతి శుభాకాంక్షలు! ( 23 - 11 - 2025)!
లేదా
' మానవసేవే మాధవసేవ ' అనే నామదేయానికి సార్థకత చేకూర్చి మరీ శివైక్యం పొందిన భగవాన్ sri పుట్టపర్తి సత్యసాయిబాబా వారు!
షిరిడీ సాయిబాబాకు మరో అవతారంగా అవతరించిన కారణజన్ముడు,దైవాంశసంభూతుడు అయిన శ్రీ భగవాన్ సత్యసాయిబాబావారి 99వ జయంతి నేడు.తాను జీవించినంత కాలం 'మానవసేవే మాధవసేవ ' అనే నామదేయానికి గొప్ప సార్థకత చేకూర్చడమే కాదు అధ్యంతం మత సామరస్యం,సకల ప్రాణుల పట్ల ప్రేమ భావం మానవాళిలో పెంపోదించేందుకు అవిరళ కృషి సల్పిన మహానుభావుడు,చారిత్రిక పురుషుడు మన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు.సరిగ్గా ఈ రోజు అంటే నవంబర్ 23,1926 వ సంవత్సరంలో ఈ భువి మీద మానవరూపంలో సాక్షాత్కరించిన శ్రీ భగవాన్ సత్యసాయిబాబా వారు దాదాపు 84 సంవత్సరాల పాటు అంటే ఏప్రిల్ 24,2011 వ రోజున శివైక్యం పొందేవరకు కూడా మానవాళిలో ఆధ్యాత్మికత,సేవా భావం వెల్లివిరిసేలా తన శక్తి మేరా విశేష కృషి చేశారు అనే మాట అక్షర సత్యం.అందులో భాగంగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ప్రజలకు ఉచిత విద్య,వైద్య సదుపాయాలు కల్పించే నిమిత్తమై తన స్వంత ప్రాంతమైన పుట్టపర్తి పట్టణంలో సత్యసాయి విద్యాసంస్థలు,సత్యసాయి మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ ను దీన జన ప్రజానీకం శ్రేయస్సు కోరి మరీ స్థాపించారు.అలాగే తన మాతృమూర్తి ఈశ్వరమ్మ అభ్యర్థన మేరకు పుట్టపర్తి గ్రామాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళకుండా తన తల్లి గారి ఆశయాల మేరకు అక్కడ విద్య,వైద్య సదుపాయలు ఉచితంగా మానవాళికి కల్పించడం తో పాటు,అనంతపురం జిల్లా ప్రజల యొక్క నీటి దాహర్తి తీర్చి జలదాత గా కూడా ప్రసిద్ధి నొందారు మన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. అంతేకాదు 'ధర్మసంస్థాపనార్తాయ సంభవాని యుగే యుగే ' అంటారే ఆ విధంగా అధర్మ,అన్యాయ పంథాలో సాగిపోతున్న ఈ సమాజాన్ని ఉద్దరించేందుకు తాను అవతరించానని స్వయంగా ప్రకటించుకున్న శ్రీ సత్యసాయిబాబా వారు చివరకు శివైక్యం పొందేవరకు కూడా అదే మాట మీద నిలబడ్డ నిఖారసైనా ఆధ్యాత్మిక వేత్త,మహా నుభావుడు ఈ భగవాన్ శ్రీ పుట్టపర్తి సత్యసాయిబాబా వారు.ముఖ్యంగా ఎల్లవేళలా మానవాళికి ఆయన ఇచ్చిన సందేశం ఒక్కటే ' ఆకలితో అలమటించిన వారికి ఆధ్యాత్మిక ప్రభోధలు చేయకండి,కాస్త అన్నం పెట్టండి చాలు' అన్నమే దైవ స్వరూపం అని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఉధ్బోదించారు.అంతేగాకుండా తాను ఈ లోకం నుంచి శాశ్వత నిష్క్రమణ తీసుకున్నప్పటికీ కూడా తన ఆశయాలు కొనసాగేలా సత్యసాయి సేవా సమితిలను స్థాపించి వారు ఆధ్యాత్మిక,ధార్మిక,సేవా కార్యక్రమాలతో దిగ్విజయంగా సాగిపోయేలా మంచి తర్పిదును ఇవ్వడం మూలాన ఇప్పటికి 40 సంవత్సరాలుగా ఆ సేవా సమితిలు ఆపదలో ప్రజలకు ఆపన్న హస్తం అందిస్తూనే వున్నాయి అనే మాట ఎవ్వరు కాదనలేని వాస్తవం.అందులో భాగంగా కరోనా మహమ్మారి మన దేశంలో విరుచుకుపడినప్పుడు సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు,సభ్యులు అయా రాష్ట్రాలలో ప్రజల కనీస అవసరాలైన తిండి,బట్ట,గూడు వంటివి తీర్చి నభూతో న భవిష్యత్ అన్న విధంగా సామాన్య ప్రజలకు సేవలు అందించారు.అంతేగాకుండా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఎంతో ముందు చూపుతో దీన జనులకు,నిరుపేదలకు,సామాన్యులకు వెలకట్టలేని, చిరస్మరణీయ సేవలు అందించి వారిని ఆదుకునే నిమిత్తమై 1960 లోనే సామాజిక సేవా కార్యక్రమాలకు స్వీకారం చుట్టి,మన దేశంతో పాటు పలు దేశాలలో సైతం సత్యసాయి మందిరాలను,సేవా సమితిలను ఏర్పాటు చేసి,స్థాపన గావించి తన జీవితానికి ఓక గొప్ప ఎనలేని ధన్యత,సార్థకత చేకూర్చుకున్నారు సాక్షాత్తు దైవాంశసంభూతుడు అయిన ఈ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు.
ఏదిఏమైన అన్ని మతాల సారాంశం కూడా మానవాళి ధర్మబద్దంగా జీవించమనే చెబుతాయని,అందరి దేవుళ్ళు ఒక్కటేనని ' సబ్ కా మాలిక్ ఏక్ హై ' అని,(హిందూ, ముస్లిం,క్రిస్టియన్స్, సిక్కులు,బౌద్ధ) మతస్తులు అందరూ కూడా బాయ్ బాయ్ అనుకుంటూ, భావిస్తూ జీవించాలని భగవాన్ పలు సందర్భాలలో ఉధ్బోదించి మానవాళిలో మత సామరస్యం వెల్లివిరిసేందుకు,సమాజంలో అన్ని మతస్తులు ఎలాంటి అలజడులు లేకుండా అత్యంత ప్రశాంత వాతావరణంలో కొనసాగుతూ శాంతియుత పథంలో ముందుకు సాగాలని మనసా,వాచ,కర్మణ ఆకాంక్షించారు ఆ కారణజన్ముడు,సాక్షాత్తు భగవత్ స్వరూపుడు అయిన మన భగవాన్ శ్రీ పుట్టపర్తి సత్యసాయిబాబా వారు.ఏమైనా శ్రీ సత్యసాయిబాబా వారు నేడు మన మధ్యలేకపోయినా ప్రేమ,దయ, శాంతి,కరుణ,సేవ,సర్వమానవకళ్యాణం,సర్వేజనా సుఖినోభవంతు వంటి సర్వోన్నత మానవీయ అంశాల విషయంలో ఆ దైవాంశసంభూతుడు వేసిన బలమైన పునాదులకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా మనమంతా నడుచుకుంటే అదే ఈ రోజు భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి 99వ జయంతిని పురస్కరించుకొని ఆ మహాపురుషుడికి,కారణజన్ముడికి,ప్రేమమూర్తికి,దివ్య స్వరూపుడికి మనమంతా అర్పించే నిజమైన,ఘనమైన,గొప్ప నివాళి!బొలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా కీ జై! జై శ్రీరామ్! శ్రీ సాయిరామ్!🏹🏹🏹🏹🕉️🕉️🕉️✍️✍️✍️✍️
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా!
00:42
