ShareChat
click to see wallet page
బంధమైనా అనుబంధమైనా🥀 చివరి వరకు నీకు తోడు నిలుస్తుందా కనుపాప చూసిన స్వప్నాలన్ని నిజమవుతావనుకున్నావే🥀 అంతలోనే నీరుగారిపోతే ఎలా నీదనుకున్న చెలిమి నీకు దూరమైనా నీ హృదయాంతరాలలో నిక్షిప్తమైన కన్నీటి జలధారలు🥀 కన్నుల నుండి ఉబికి వస్తుంటే మనసుకు వేదన ముసురేస్తుంటే ఏ బంధానికి అంతటి శక్తి లేదా శాశ్వతం కాని బంధాల కోసం తపనెందుకు🥀 ఎపుడు వీడిపోతాయో తెలియని బంధం కోసం ఆరాటం ఎందుకు జీవితం అంటే ఇంతేనా అని గతంలోనే ఉండిపోతే ఎలా🥀 ఒక్కసారి అలా బయటి ప్రపంచంలోకి చూడు బంధాల సంకెళ్ళు తెంచుకొని రా సరికొత్త బంధాలు ఆహ్వానిస్తున్నాయి అందమైన తీరాలు వేచి చూస్తున్నాయి ఓటమెరుగని ఓర్పువై🥀 కన్నీళ్ళెరుగని కనుపాపవై నీ నమ్మకే నీకు అండగా నీ నడక ప్రారంభించు గమ్యం చేరే దిశగా 🥀 విహంగమై హాయిగా గాలిలో తేలిపో అందరాని సుదూర తీరాలను చేరుకో 🥀🥀🥀🦋🥀🥀🥀🦋 #✍️కవితలు #💘ప్రేమ కవితలు 💟 #🖋️నేటి కవితల స్టేటస్

More like this