ShareChat
click to see wallet page
*బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, ప్రెస్ నోట్, తేది: 07.12.2025* *వరుసగా ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలు అరెస్ట్* *చాకచక్యంగా ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేసిన బాపట్ల సిసిఎస్ పోలీసులు* *ముద్దాయిల నుండి రూ. 21.2 లక్షల విలువ గల 37 ద్విచక్ర వాహనాలు స్వాధీనం* *గడిచిన వారం రోజుల్లో జిల్లా పోలీస్ యంత్రాంగం రూ. 40 లక్షల విలువ గల 60 బైకులను రికవరీ* *ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వాహనాలకు సేఫ్టీ లాక్‌లు, జిపిఎస్ వంటి పరికరాలు అమర్చుకోవాలని* *పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించి కేసు వివరాలను మీడియాలో వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు* బాపట్ల జిల్లాలో వరుసగా చోటుచేసుకున్న ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులను బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం, సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా చేధించి, దొంగతనాలకు పాల్పడుతున్న వారిని చాకచక్యంగా అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు ఆదివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. *కేసు వివరాలు* 1. Cr.No. 126/2025 U/S 303 (2) BNS of Vedullapalli PS (Bapatla Dist.) 2. Cr.No. 424/2025 U/S 303 (2) BNS of Bapatla Town PS (Bapatla Dist.) 3. Cr.No. 540/2023 U/S 379 IPC of Krishnalanka PS (NTR Dist.) 4. Cr.No. 254/2025 U/S 303 (2) BNS Chirala 1 Town PS (Bapatla Dist.) 5. Cr.No. 255/2025 U/S 303 (2) BNS Chirala 1 Town PS (Bapatla Dist.) 6. Cr.No. 256/2025 U/S 303 (2) BNS Chirala 1 Town PS (Bapatla Dist.) 7. Cr.No. 249/2025 U/S 303 (2) BNS Addanki PS (Bapatla Dist.) *ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులను ఛేదించిన విధానం:* బాపట్ల జిల్లాలో వరుసగా జరుగుతున్న ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులను జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు సవాలుగా తీసుకొని, బాపట్ల సిసిఎస్ డిఎస్పీ పి. జగదీష్ నాయక్ ఆధ్వర్యంలో సిసిఎస్ సిఐ ప్రేమయ్య మరియు వారి సిబ్బంది, జిల్లా పోలీస్ యంత్రాంగంతో కలిపి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని, సీసీ కెమెరాల ఆధారంగా వరుస కేసులను చాకచక్యంగా ఛేదించి, దొంగతనాలకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేశారు. దొంగిలించబడిన రూ. 21.2 లక్షల విలువగల 37 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. *ముద్దాయిల వివరాలు* 1. కగ్గ. సాంబశివరావు, S/O ప్రేమిలి, వయసు: 32 సంవత్సరాలు, కులం: ఉప్పర, పొత్తూరు గ్రామం, గుంటూరు మండలం, గుంటూరు జిల్లా. 2. దాసరి గోపిరాజు @ గోపి, S/O కోటేశ్వరరావు, 32 సంవత్సరాలు, కులం: ఎరుకుల, జగనన్న కాలనీ, బుర్లవారిపాలెం. ప్రస్తుత నివాసం: గాంధీనగర్ యానాది సంఘం, కోర్టు సెంటర్ వద్ద, పేరాల, చీరాల పట్టణం. 3. దాసరి దుర్గా రావు @ దుర్గ, S/O కోటేశ్వరరావు, 24 సంవత్సరాలు, కులం: ఎరుకుల, జగనన్న కాలనీ, బుర్లవారిపాలెం. ప్రస్తుత నివాసం: గాంధీనగర్ యానాది సంఘం, కోర్టు సెంటర్ వద్ద, పేరాల, చీరాల పట్టణం. *ముద్దాయిలు నేరం చేసిన విధానం:* *కగ్గ. సాంబశివరావు* లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ చెడు వ్యసనాలు మరియు విలాసాలకు అలవాటు పడటం వల్ల వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో, గత రెండు సంవత్సరాలుగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇళ్ల ముందర, ఆసుపత్రుల వద్ద పార్క్ చేసిన బైకులను దొంగతాళాలతో లాక్ తెరిచి దొంగతనం చేస్తూ వచ్చాడు. బాపట్ల, గుంటూరు, పల్నాడు, విజయవాడ, ఎన్‌టిఆర్ జిల్లాల్లో వరుస దొంగతనాలు చేసినట్లు తేలింది. దొంగతనం చేసిన వాహనాలను ఇతర జిల్లాల్లో విక్రయించేవాడు. ఇతడి మీద గతంలో ఎటువంటి కేసులు లేవు. మొత్తం 33 బైకులను దొంగిలించినట్లు గుర్తించారు. బాపట్ల టౌన్ పోలీసులు ఆదివారం ఉదయం అరెస్ట్ చేశారు. *దాసరి గోపిరాజు @ గోపి మరియు దాసరి దుర్గా రావు @ దుర్గ* ఇద్దరూ అన్నదమ్ములు. చీరాల పరిసరాల్లో చీపురులు అమ్ముతూ జీవనం సాగిస్తారు. సంపాదన సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గత 6 నెలలుగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. చీరాల 1 టౌన్, అద్దంకి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 4 ద్విచక్ర వాహనాలను దొంగిలించారు. చీరాల 1 టౌన్ పోలీసులు వారిని ఆదివారం ఉదయం అరెస్ట్ చేశారు. జిల్లా సిసిఎస్ పోలీసులు మరియు జిల్లా పోలీస్ యంత్రాంగం కలిసి కేసులను ఛేదించి, బాపట్లలో సాంబశివరావును, చీరాలలో గోపి మరియు దుర్గలను అరెస్ట్ చేశారు. మొత్తం ముగ్గురు ముద్దాయిల నుండి రూ. 21.2 లక్షల విలువగల 37 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. *ఎస్పీ గారి సందేశం:* ద్విచక్ర వాహనాల దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గడిచిన వారం రోజుల్లో జిల్లా పోలీస్ యంత్రాంగం రూ. 40 లక్షల విలువ గల 60 బైకులను రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహనాలకు సేఫ్టీ లాక్‌లు, జిపిఎస్ పరికరాలు అమర్చుకోవాలని తెలిపారు. లక్షల రూపాయలు ఖర్చుచేసి వాహనాలను కొనుగోలు చేసేవారు, వాహనాలు దొంగతనాలకు గురికాకుండా ఉండేందుకు సేఫ్టీ లాక్ లు, జిపిఎస్ ఏర్పాటు చేసుకోవడంలో నిర్లక్ష్యం వహించవద్దని ప్రజలకు తెలిపారు. *ప్రశంసలు* ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులను సమర్థవంతంగా చేధించి, ముద్దాయిలను అరెస్ట్ చేసి, 37 వాహనాలను సీజ్ చేసినందుకు సిసిఎస్ డిఎస్పీ పి. జగదీష్ నాయక్, ఇన్స్పెక్టర్ ప్రేమయ్య, బాపట్ల టౌన్ ఇన్స్పెక్టర్ రాంబాబు, చీరాల 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, సిసిఎస్ ఎస్‌ఐ రాంబాబు, సిసిఎస్ కానిస్టేబుల్స్ కోటేశ్వరరెడ్డి, కృష్ణ, సురేష్, దాసు, చిరంజీవి, హోంగార్డ్ రవూఫ్‌లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి క్యాష్ రివార్డులను అందజేశారు. ఈ సమావేశంలో సిసిఎస్ డిఎస్పీ జగదీష్ నాయక్, సిసిఎస్ సిఐ ప్రేమయ్య, బాపట్ల టౌన్ సిఐ రాంబాబు, చీరాల 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు మరియు సిబ్బంది పాల్గొన్నారు. #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat
01:47

More like this