నియోజకవర్గ ప్రజలకు తాగునీటి సమస్యలు లేకుండా చూడాలి : గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల
గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధి పట్ల నిరంతర శ్రద్ధ చూపుతూ, గౌరవ శాసన సభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు ఈ రోజు క్యాంప్ కార్యాలయంలో గ్రామీణ జల వనరుల శాఖ (RWS) డిపార్ట్మెంట్ DE, AE లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే గారు నియోజకవర్గంలోని తాగునీటి సరఫరా, ప్రాజెక్టుల పురోగతి మరియు ప్రజలకు అందుతున్న సేవలపై విపులంగా సమీక్షించారు.
గతంలో జల జీవన్ మిషన్ (JJM) ద్వారా మంజూరైన కొన్ని వర్కులు రద్దు చేయబడిన విషయాన్ని ప్రస్తావించి, అవి తిరిగి మంజూరు అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో తాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్న గ్రామాలను గుర్తించి, సమస్యను శాశ్వతంగా పరిష్కరించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
అలాగే గురుకుల పాఠశాలల్లో బాత్రూములు, లాట్రిన్లు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని, విద్యార్థుల ఆరోగ్యం మరియు పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకుని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అధికారులు గ్రామాల్లో తరచుగా పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న సేవలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా కృషి చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో RWS శాఖ డిప్యూటీ ఇంజనీర్ (DE), అసిస్టెంట్ ఇంజనీర్ (AE) లు మరియు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్

