ShareChat
click to see wallet page
🌺 ఆదిగురువు - దక్షిణామూర్తి 🌺 దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలిస్తే కుడిచెవికి మకరకుండలం ఎడమ చెవికి "తాటంకం' అలంకారాలుగా కనిపిస్తాయి. మకరకుండలం పురుషుల శ్రవణాలంకారం. తాటంకం స్త్రీల అలంకృతి, దక్షిణామూర్తిగా సాక్షాత్కరించినది శివశక్తుల సమైక్య రూపమేనని తెలియజేస్తాయి. సనకసనందనాదులకు ముందు రెండుగా కనబడిన శివశక్తులే ఏకాకృతిగా దర్శనమిచ్చాయి. అందుకే దక్షిణామూర్తి అయ్యరూపమే కాక, అమ్మమూర్తి కూడా ఈ విషయాన్నే లలితాసహస్రంలో "దక్షిణామూర్తి రూపిణీ సనకాదిసమారాధ్యా శివజ్ఞాన ప్రదాయినీ" అని వివరిస్తోంది. ఏ దయవలన దుఃఖం పూర్తిగా నిర్మూలనమవుతుందో ఆ 'దయ'ను 'దాక్షిణ్యం' అంటారు. ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి (దాక్షిణ్యం) భగవంతునికి మాత్రమే ఉంది. ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి పరమ జ్ఞానమూర్తియైన ఈ ఆది గురువును స్తుతిస్తూ ఆదిశంకరులు రచించిన దక్షిణామూర్తి సోత్రము బహుళ ప్రసిద్ది చెందింది. దక్షిణామూర్తి సకల జగద్గురు మూర్తి కనుక - స్వామి ఆరాధన సకల విద్యలను ప్రసాదిస్తుంది. ఐహికంగా - బుద్ధి శక్తిని వృద్ధి చేసి విద్యలను ఆనుగ్రహించే ఈ స్వామి పారమార్థికంగా తత్త్వ జ్ఞానాన్ని ప్రసాదించే దైవం. . . .#🌅శుభోదయం #🌷గురువారం స్పెషల్ విషెస్ #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #🪔శ్రీ దక్షిణామూర్తి స్వామి...🕉️ #🪔శ్రీ దక్షిణామూర్తి స్వామి🕉️🚩
🌅శుభోదయం - ShareChat

More like this