ShareChat
click to see wallet page
💥పవన్ కల్యాణ్‌లా గట్స్ ఉన్నవాళ్లని చూడలేదు.! 💥పవర్‌ఫుల్‌ గ్యాంగ్‌స్టర్‌ ‘ఓజీ’ సరసన అలరించేందుకు సిద్ధమయ్యారు నటి ప్రియాంక మోహన్‌. పవన్‌ కల్యాణ్‌ హీరోగా దర్శకుడు సుజీత్‌ రూపొందిస్తున్న సినిమా సెప్టెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈనేపథ్యంలో ప్రియాంక తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది. పవన్‌తో వర్క్‌ చేయడం ప్రారంభించిన తర్వాత ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ అద్భుతమైన వ్యక్తి అని ప్రశంసించారు. ‘‘పవన్ గురించి నేను బెంగళూర్‌లో ఉన్నప్పుడే విన్నాను. సెట్స్‌లో అందరినీ ఒకేలా చూస్తారు. బుక్స్‌ గురించి చెప్పేవాళ్లు. అప్పుడప్పుడు పాలిటిక్స్‌ గురించి మాట్లాడేవారు. ఆయనలా గట్స్ ఉన్నవాళ్లను నేను ఇప్పటి వరకూ చూడలేదు. పవన్‌తో వర్క్‌ చేయడమే ఒక మెమొరీ. ఆయనకు బిడియం ఎక్కువ. డిప్యూటీ సీఎం అవకముందు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవారు. డిప్యూటీ సీఎం అయ్యాక కొంచెం హ్యాపీగా ఉన్నారు. కానీ, ఆయనకు ఇప్పుడు ఇంకా బాధ్యత పెరిగింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు కొంచెం నవ్వుతున్నారు. అంత పెద్ద హోదాలో ఉన్నప్పటికీ చాలా సింపుల్‌గా ఉంటారు.’’! ఓజీ సినిమాలో కణ్మని పాత్ర చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటిదాకా నేను చేసిన పాత్రల్లో కణ్మని నాకు చాలా ఇష్టమైన పాత్ర. ఈ పాత్రకి నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానముంటుంది. పవన్ కళ్యాణ్ గారితో పని చేయడం అనేది ప్రతిరోజూ అదృష్టమే. ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు జెంటిల్ మేన్. అందరినీ సమానంగా చూస్తారు. ఆన్ స్క్రీన్ లో మరియు ఆఫ్ స్క్రీన్ లో ఆయన రియల్ హీరో.!! .... ✍🏻 ఓజీ సినిమా హీరోయిన్ ప్రియాంక మోహన్.! #OG❤️🙏🏻 #OGonSept25❤️🙏🏻 #TheyCallHimOG❤️🙏🏻 #PawanKalyan❤️🙏🏻 #నేటి సమాజం తీరు🤔 #📢డిప్యూటీ సీఎం శాఖలు ఇవే📃 #జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ 🔯🔯 #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #జనసేన పార్టీ 🇵🇱🔯
నేటి సమాజం తీరు🤔 - 2% 2% - ShareChat

More like this