అందమైనలోకంలో🥀🕊️
హాయిగా విహరిస్తూ
కల్మషమెరుగని పవిత్రమైన హృదయంకోసం
అన్వేషణ సాగిస్తుంటే
అపుడు ఎదురైంది ఓ స్నేహం
నీకు తోడుగా ఉంటానని
నా వెనకే నీ పయనమని
కడదాక నీతో సాగుతానని
నీవు లేక నేను లేనని
నీ ఊపిరే నా ప్రాణమని
నీవే నా లోకమని🥀🕊️
నీవు లేక నా జీవితమే శూన్యమని
ఎన్నో బాసలు చేసి
సరికొత్త లోకాన్ని పరిచయం చేసి
నవవసంతాన్ని నా కనులకు
చూపిన నా ప్రియనేస్తమా
అవధుల్లేని ఆనందాన్ని మనసంతా
నింపిన నా హృదయమా
నీ అలికిడి లేక🥀🕊️
మనసుకు కుదురు లేదు
నీ చిలిపి అల్లరిలేక
మదికి సాంత్వన లేదు
నీ తలపుల మల్లెల పరిమళాలు
నను వీడిపోనేలేదు
కొలనులో విరిసిన🥀🕊️
కలువలు వాడిపోనూ లేదు
మిలమిల మెరిసే జాబిలి
మబ్బుల చాటున దాగిపోనేలేదు
మది పుస్తకంలో భద్రంగా దాచుకున్న
నీ జ్ఞాపకాలు పదిలమే
నీ కోసం వేయి కన్నులతో
ఎదురు చూస్తూ
నీ రాకకోసం నిరీక్షిస్తూ🥀🕊️
నీ ప్రేమకోసం పరితపించే
................................
❣️నీ హృదయాంజలి❣️ #✍️కవితలు #💘ప్రేమ కవితలు 💟 #🖋️నేటి కవితల స్టేటస్
