ShareChat
click to see wallet page
#😎మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు🧁 #మెగాస్టార్ చిరంజీవి @ 157 "మన శంకర్ వర ప్రసాద్ గారు" 🎬🎥 #🤩మన శంకరవరప్రసాద్ గారు..టైటిల్ గ్లింప్స్ #🎂🎂HBD మెగాస్టార్ చిరంజీవి 🎂🎂 #మెగాస్టార్ చిరంజీవి HBD మెగాస్టార్ 🎂70🌷 @157 తెలుగు సినిమా గర్వించదగ్గ నటుల్లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవీ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు అనీల్ రావిపూడి కలయికలో తెరకెక్కిస్తున్న చిత్రం కూడా ఒకటి. మెగాస్టార్ కెరీర్లో 157వ సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి నేడు మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా అదిరే ట్రీట్ ని మేకర్స్ ప్రామిస్ చేశారు. ఇక అనుకున్నట్టుగానే ఈ సాలిడ్ గ్లింప్స్ వచ్చేసింది. ఈ చిత్రానికి ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ అనే టైటిల్ ని లాక్ చేసినట్టుగా అనౌన్స్ చేశారు. అయితే ఈ గ్లింప్స్ లో మాత్రం అనీల్ రావిపూడి చిరంజీవిని వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది హైలైట్ అని చెప్పాలి. బ్లాక్ సూట్ లో మెగాస్టార్ తన మార్క్ స్వాగ్ తో నడుచుకుంటూ వస్తుంటే తన అభిమానులకి రెండు కళ్ళు సరిపోవు అనే రీతిలో కనిపిస్తున్నారు. ఇక దీనితో పాటుగా రౌడీ అల్లుడు సినిమా సాంగ్ స్కోర్ ని భీమ్స్ మిక్స్ చేయడం ఫ్యాన్స్ కి మరింత ఇంపాక్ట్ కలిగించేలా ఉందని చెప్పడంలో సందేహం లేదు. ఇన్ని ఉన్నప్పటికీ ఇంకొక్క అంశం కూడా ఉండి ఉంటే ఈ గ్లింప్స్ నిండుగా ఉండేది అనిపించింది. అనీల్ రావిపూడి కాంబినేషన్ అంటేనే కామెడీ.. ఇలా ఈ గ్లింప్స్ మెగాస్టార్ మార్క్ అన్నయ్య సినిమాలో తరహా చిన్న కామెడీ బిట్ ఉన్నా ఈ గ్లింప్స్ ఇంకెక్కడికో వెళ్లిపోయేది. మొత్తానికి మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి మెగా బ్లాస్ట్ గట్టిగానే వర్కౌట్ అయ్యేలా కనిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి వెంకీ మామ వాయిస్ ఓవర్ అందించగా సాహు గారపాటి నిర్మాణం వహిస్తున్నారు.
😎మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు🧁 - App  praja 22nd AUG Butkay| Aaaau  MEGASTAR CHIRANJEEII P SVAPPARAO App  praja 22nd AUG Butkay| Aaaau  MEGASTAR CHIRANJEEII P SVAPPARAO - ShareChat

More like this