💐👍🌿🌹♥️ INSPIRATION 💐👍🌿🌹♥️
___________________________________________
ఎదుటి వ్యక్తి మనకు ఇష్టం అయినప్పుడు వారికి సంబంధించిన అంశాలు అనగా జ్ఞానం , గుణగణాలు , ప్రవర్తన , సంస్కృతి సాంప్రదాయాలు ... అన్నీ " copy" చేసినట్లే. ఉదాహరణకు నాకు శ్రీకృష్ణుడు అంటే ఇష్టం. నేను శ్రీకృష్ణులు వారు చెప్పినవి అన్నీ కాపీ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. వారి మంచితనాన్ని , భగవద్గీతలో చెప్పిన సత్యాలను , మాటలను , జ్ఞానాన్ని , ప్రవర్తనను , క్రమశిక్షణను , తూచా తప్పకుండా కాపీ చేసుకుంటూ... పరోక్షంగా వారిని ఇన్స్పిరేషన్ తో అనుకరించడం జరుగుతుంది. ♥️🌹🌿👍💐
అదేవిధంగా , ఈ sharechat లో నేను ప్రతిరోజూ కొన్ని సంవత్సరాలుగా ఒకరి పోస్టులను కాపీ చేసుకుంటూ ఉండటం వల్ల , పరోక్షంగా వారి జ్ఞానాన్ని , వారి ప్రవర్తనను , వారి క్రమశిక్షణను , వారి గుణగణాలను నా హృదయంలో " COPY"" చేసుకున్నట్లే....!!!! 💐👍🌿🌹♥️🤑
మన పూర్వీకులు ఒక సామెత చెప్తూ ఉంటారు "" 6 నెలల ఎదుటి వ్యక్తితో సహవాసం చేస్తే... ఆ సహవాస ఫలితం వలన వారి ప్రవర్తన , ఆలోచనలు , జ్ఞానం , వారు పాటించే సంస్కృతి సాంప్రదాయాలు ... అన్నీ కూడా కాపీ అయినట్లే. దానినే " INSPIRATION"" అని కూడా అనవచ్చు. ♥️🌹🌿👍💐🤑
రోజూ నేను పోస్టులు తీసుకుంటున్న వ్యక్తే ఇప్పుడు నా ఇన్స్పిరేషన్. ఎందుకంటే, ఆ పోస్టులలో వారి యొక్క జ్ఞానం, వారి ఆలోచన సరళి , వారి ప్రవర్తన , వారి గుణగణాలు , పోస్టుల రూపంలో ప్రతిబింబిస్తుంది కావున వారు నా lifestyle లో ఒక భాగం అయిపోయారు. అందువలన , మనం చేసే మంచి స్నేహాలతో .. మనకు తెలియకుండా వారి ద్వారా inspiration పొంది... చక్కటి జ్ఞానంతో ముందుకు వెళ్ళడానికి మార్గదర్శకం అవుతారని నిస్సందేహంగా చెప్పగలను... ఇది నా అంతరంగం మాత్రమే.
💐👍🌿🌹♥️🧿😂 So, everything can be copied with culture , charactor, knowledge. Behaviour....which can also be copied
___________________________________________
HARI BABU.G
__________________________________________ #✍️నా మది అంతరంగం💜 #నా అంతరంగం #✌️నేటి నా స్టేటస్ #💗నా మనస్సు లోని మాట #🌅శుభోదయం
