ShareChat
click to see wallet page
శ్రీ దత్తాత్రేయస్వామివారి షోడశ అవతారాలు.. అవతరించిన తిధులు.........!! 1. శ్రీ యోగిరాజ -కార్తీక పౌర్ణమి! 2. శ్రీ అత్రి వరద -కార్తీక బహుళ పాడ్యమి! 3. శ్రీ దత్తాత్రేయుడు- కార్తీక బహుళ విదియ! 4. శ్రీ కాలాగ్ని శమనుడు - మార్గశిర శుద్ధ చతుర్దశి! 5. శ్రీ యోగి జన వల్లభుడు - మార్గశిర పౌర్ణమి! 6. శ్రీ లీలా విశ్వంభరుడు - పుష్య పౌర్ణమి! 7. శ్రీ సిద్ధ రాజు - మాఘ పౌర్ణమి! 8. శ్రీ జ్ఞాన సాగరుడు - ఫాల్గుణ దశమి! 9. శ్రీ విశ్వంభరావధూత - చైత్ర పౌర్ణమి! 10. శ్రీ మాయాముక్త అవధూత - వైశాఖ శుద్ధ చతుర్దశి! 11. శ్రీ మాయా యుక్తావధూత - జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి! 12. శ్రీ ఆదిగురుదత్త - ఆషాడ పౌర్ణమి! 13. శ్రీ శివరూప దత్త -శ్రావణ శుద్ధ అష్టమి! 14. శ్రీ దేవ దేవ దత్త- భాద్రపద శుద్ధ చతుర్దశి! 15. శ్రీ దిగంబర దత్త - ఆశ్వీజ పౌర్ణమి! 16. శ్రీ కృష్ణ శ్యామ కమలనమన లోచన దత్త - కార్తీక శుద్ధ ద్వాదశి! ఈ విధంగా శ్రీ దత్తాత్రేయ ప్రభువు, 16 అవతారాలు ధరించినట్టు, దత్త పురాణం చెబుతోంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, స్వామి ఆయాకార్యాలు చేయడానికి, విశేషమైన ఉపదేశాలు చేయడానికి ధరించినరూపాలే షోడశావతారాలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ అవతారాలు అన్నీ దత్తభక్తులకు చాలా విశేషమైనవిగా భావిస్తారు. ఆయా రోజులలో,స్వామివారికి విశేషపూజలు చేసి, నామజపము, గురుచరిత్ర పారాయణ చేయడం ద్వారా స్వామికృపకు పాత్రులు కాగలరు. షోడశ దత్తావతార క్షేత్రాలు..! షోడశ దత్తావతారం కొలువై ఉన్న ప్రాంతం..! 1. శ్రీ యోగిరాజు (ప్రథమ అవతారము) బెంగళూరు! 2. శ్రీ అత్రివరదుడు (ద్వితీయ అవతారము) మచిలీపట్నం! 3. దిగంబరావధూత శ్రీ దత్తాత్రేయుడు (తృతీయ అవతారము) రిషికేశ్! 4. శ్రీ కాలాగ్నిశమనుడు (చతుర్ధ అవతారము) మైసూర్! 5. శ్రీ యోగిజనవల్లభుడు (పంచమ అవతారము) ప్రొద్దుటూర్! (కడప జిల్లా) 6. శ్రీ లీలా విశ్వంబరుడు (షష్టమ అవతారము) సూరత్! 7. శ్రీ సిద్ధరాజు (సప్తమ అవతారము) ఆల్వాయి! (కొచ్చిన్) 8. శ్రీ జ్ఞానసాగరుడు (అష్టమ అవతారము) అనంతపూర్! 9. శ్రీ విశ్వంభరావధూత (నవమ అవతారము) ఆకివీడు! (ఆంధ్రప్రదేశ్) 10. శ్రీ మయాముక్తావధూత (దశమ అవతారం) అచరపాక్కం! (కాంచీపురం జిల్లా) 11. శ్రీ ఆదిగురువు (ఏకాదశ అవతారం) చెన్నై! 12. శ్రీ సంస్కరహీన శివ స్వరూప దత్తాత్రేయుడు (ద్వాదశ అవతారం) జయలక్ష్మీపురం! (మైసూర్ దగ్గర) 13. శ్రీ దేవదేవుడు (త్రయోదశ అవతారం) నూజివీడు! (ఆంధ్రప్రదేశ్) 14. శ్రీ దిగంబరుడు (చతుర్దశ అవతారం) గండిగుంట! (వుయ్యూరు దగ్గర) 15. శ్రీ దత్తావధూత (పంచదశ అవతారం) హైదరాబాద్! 16. శ్రీ శ్యామకమలలోచనుడు (షోడశ అవతారం) విజయవాడ! ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః #దత్తాత్రేయ స్వామి@ #Sri Datta Jayanthi #🔯శ్రీ దత్తాత్రేయ స్వామి #datta jayanthi #తెలుసుకుందాం
దత్తాత్రేయ స్వామి@ - ShareChat

More like this