ShareChat
click to see wallet page
#🌅శుభోదయం #venkateswara #వెంకటేశ్వరస్వామి #🙏శనివారం భక్తి స్పెషల్ 💐 *దివ్య ఆనందనిలయం* *~~~~~~~~~~~~* *తిరుమల తిరుపతి* *~~~~~~~~~~* వైష్ణవాలయాల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచి నిరంతరాయంగా అభివృద్ది చెందుతూ వైదిక కార్యక్రమాలు, భక్తుల గోవిందనామ స్మరణలతో మారుమోగే పవిత్ర ఆలయంగా ప్రసిద్దికెక్కింది తిరుమల శ్రీనివాసుని దివ్య ఆలయం. ఈ ఆలయంలో స్వామివారు నవరత్న ఖచిత దివ్యాభరణాలతో, పట్టు పీతాంబరాలతో, జవ్వాజి-కస్తూరి మొదలగు పరిమళ ద్రవ్యాలతో కూడిన ఊర్ద్వపుండ్రంతో స్వామివారు ప్రకాశిస్తుంటారు. స్వామివారు చతుర్భుజాలతో, నాగభరణాలతో ఉంటారు. ఊర్ద్వ హస్తాలలో శంఖు, చక్రాలు ధరించబడి ఉంటాయి. అధో హస్తాలలో కుడిహస్తం అభయహస్తంగాను, వామహస్తం కఠిహస్తంగాను ఉంటాయి. ఇక వక్షస్థలంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఈ మహిమాన్వితమైన స్వామివారు స్వర్ణరేకుపూతలతో కూడిన దివ్య ఆనందనిలయంలో కొలువుదీరి ఉంటారు. ఈ ఆనంద నిలయం దివ్యవిమానం, రెండు గోపురాలతో, మూడు ప్రాకారాలతో, సప్తద్వారాలతో, నిర్మింపబడి ఉంటుంది. విమానాంతార్థుడైన ఆ భగవంతుని శ్రీమన్నారాయణుడని, వైకుంఠ వాసుడని, ఆపద మొక్కుల వాడని, ఆనాధరక్షకుడని, ఆపద్భాంధవుడుని, వడ్డీకాసులవాడని ఇలా పలు నామాలతో భక్తులు వారి వారి మనోప్రవృతిని బట్టి వెంకన్నను పిలుస్తుంటారు. శ్రీనివాసుని స్థానం వెంకటగిరి. ఇది సాక్షాత్తు వైకుంఠంలో పాలసముద్రంపై గల ఆదిశేషువు అని పురాణాల్లో కీర్తింపబడి ఉంది. ఈ పర్వతానికి వృషభాద్రి, నారాయణాద్రి, అంజనాద్రి, శేషాద్రి, గరుడాద్రి అని అనేక నామాంతరాలు ఉన్నాయి. ఈ ఆగ్నిపై ఉండే వృక్షాలు, జంతువులు, పక్షులు తదితరాలు అన్ని పరమశక్తి సంపన్నులైన రుషులుగా వెంకటాచల మహత్యం అభివర్ణిస్తోంది. వేంకటాద్రి వాసునికి జరిగే పూజాకైంకర్యాలు అన్ని వైఖానస ఆగమశాస్త్రోక్తంగా నిర్వహిస్తుంటారు. ఆ ఆగమం శ్రీనివాసుని అర్చించడానికే వైదిక పద్దతిలో ఆవిర్భవించిందన్నది పెద్దల మాట. మాసపూజలు, వారపూజలు, నిత్యపూజలు, నైమిత్తి పూజలు అన్ని కూడా ఈ ఆగమ విధానంతోనే అర్చకులు నిర్వహిస్తుంటారు. ఈ పూజలన్నింటిలోను ఒక ప్రత్యేకతను సంతరించుకునేది బ్రహ్మోత్సవం. వేంకటాచల మహత్యంలో స్వామివారి బ్రహ్మోత్సవాల గురించి ప్రస్తావించబడింది. రవి కన్యామాసంలో ప్రవేశించిన తరువాత వచ్చే శ్రవణానక్షత్రం రోజున అవబృదమనే కార్యక్రమాన్ని నిర్ణయించుకుని దానికి తొమ్మిదిరోజులు నవాహ్నిక బ్రహ్మోత్సవాలుగా నిర్వహిస్తున్నారు. *`విమాన నిర్మాణ వైశిష్ట్యం`* తిరుమల క్షేత్రంలో ‘ ఆనంద నిలయ విమానం’ అనే ప్రసిద్ధమైన పేరును పొంది ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బంగరు గోపురం ‘త్రితల గోపురం’ (మూడంతస్తుల గోపురం) అని చెప్పబడుచున్నది. క్రింది మొదటి రెండంతస్థులు దీర్ఘచతురస్త్రాకారంగానూ, మూడవది అయిన చివరి అంతస్థు వర్తులాకారంగానూ నిర్మింపబడినది. *`నిర్మాణ వర్ణన`* వేసరశైలిలో ఏకకలశ శిఖరంలో నిర్మింపబడిన ఈ బంగారు గోపురం ఎత్తు కలశంతో సహా 37 అడుగులా 8 అంగుళాలు. ఈ గోపురం కింద నిర్మింపబడిన ప్రాకారం ఎత్తు 27 అడుగులా 4 అంగుళాలు. అనగా భూమితలం నుంచి బంగారు కలశం వరకు కూడా మొత్తం ఆనందనిలయ విమానం ఎత్తు 65 అడుగులా 2 అంగుళాలు. బంగారు శిఖరంలో దీర్ఘచతురస్రాకారపు మొదటి అంతస్థు 10 అడుగులా 6 అంగుళాలు ఎత్తును కలిగి ఉంది. ఈ భాగంగా ఎలాంటి బొమ్మలు లేవు. కేవలం చిన్న చిన్న లతలు, తీగలు, మకరతోరణాలు, చిన్న శిఖరాలు మాత్రమే ఇందులో ఉన్నాయి. ఇక గోపురంలోని దీర్ఘచతురస్రాకారపు రెండవ అంతస్థు 10 అడుగులా 9 అంగుళాల ఎత్తును కలిగి ఉండటమే కాకుండా ఇందులో చుట్టూ 40 బొమ్మలు ఏర్పాటుచేయబడినవి. ఈ రెండవ అంతస్థులోనే ఉత్తర దిక్కున పడమటి వారకు (వాయవ్యమూలకు) ‘శ్రీ వేంకటేశ్వర స్వామి’ ఉత్తరాభిముఖంగా వేంచేసి దర్శనమిస్తూ ఉన్నాడు. ఈయనే ‘విమాన వేంకటేశ్వర స్వామి’. ఇక గోపురంలోని చివరి అంతస్థు వర్తులాకారాన్ని కలిగి ఉండి, 16 అడుగులా 3 అంగుళాల ఎత్తులో విరాజిల్లుతోంది. ఈ భాగంలో మహాపద్మంతో పాటు 20 బొమ్మలు ఉన్నాయి. ఈ చివరి వర్తులాకారంలోనే నాలుగు మూలల్లో 8 సింహాల బొమ్మలు ఉన్నాయి. అనగా ఒక్కొక్క మూలలోచిన్న పద్మాన్ని పరివేష్టించిన రెండు సింహాల వంతున నాలుగు మూలల్లో మొత్తం 8 సింహాలున్నాయి. బంగారు కలశానికి ఆనుకొని కింది భాగంలో ఉన్న ‘మహాపద్మ’ చిలకలు, లతలు, హంసలు మున్నగు చిత్రాలతో అత్యంత విలక్షణంగా ఆకర్షణీయంగా విరాజిల్లుతూ ఉంది. *_𝕝𝕝 ॐ 𝕝𝕝 శ్రీవేఙ్కటేశ చరణౌ శరణం ప్రపద్యే 𝕝𝕝 卐 𝕝𝕝_*
🌅శుభోదయం - Ghodkis ekantha Sedal Ghodkis ekantha Sedal - ShareChat

More like this