#😇My Status #సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి
నవంబర్ 15
డేరింగ్ అండ్ డాషింగ్ హీరో
నటుడు నిర్మాత దర్శకులు స్టూడియో అధినేత
కృష్ణ గారి వర్ధంతి సందర్బంగా ఆత్మీయ నివాళులు
ఘట్టమనేని కృష్ణ (1943 మే 31 - 2022 నవంబరు 15) తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత. కృష్ణ 1970లు, 80ల్లో తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ సాధించి, సూపర్ స్టార్‌గా ప్రఖ్యాతి పొందాడు. ఆయన పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1964-65లో హీరోగా నటించిన తొలి సినిమా తేనెమనసులు, మూడవ సినిమా గూఢచారి 116 పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ఉపకరించాయి. ఆపైన నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో 340 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించాడు. 1970లో నిర్మాణ సంస్థను ప్రారంభించి పద్మాలయా సంస్థ ద్వారా పలు విజయవంతమైన చలన చిత్రాలు తీశాడు. 1983లో ప్రభుత్వ సహకారంతో స్వంత స్టూడియో పద్మాలయా స్టూడియోను హైదరాబాద్‌లో నెలకొల్పాడు. దర్శకుడిగానూ 16 సినిమాలు తీశాడు.
ఘట్టమనేని కృష్ణ
ఘట్టమనేని కృష్ణ
జననం ఘట్టమనేని కృష్ణ
1943 మే 31 గుంటూరు జిల్లా, తెనాలి మండలములోని బుర్రిపాలెం
మరణము 2022 November 15 (వయసు: 79)
హైదరాబాద్
మరణ కారణం కార్డియాక్ అరెస్ట్

