#🕉️దుర్గాష్టమి శుభాకాంక్షలు🌷🙏 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #🌅శుభోదయం #మంగళవారం #శుక్రవారం
*_𝕝𝕝ॐ𝕝𝕝 30/09/2025 - శ్రీ దేవీ శరన్నవరాత్రులు 9వ రోజు - అలంకారం: “ఇంద్రకీలాద్రి”పై అమ్మవారు "శ్రీ దుర్గాదేవీ" అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తుంది. 𝕝𝕝卐𝕝𝕝_*
*≈≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈≈*
*_శ్రీ దుర్గా దేవీ_*
*❀꧁🔆꧂❀*
*_శ్లో𝕝𝕝 సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే, శరణ్యే త్య్రంబకే గౌరి నారాయణి నమోస్తుతే._*
దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది. సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఎర్రని వస్త్రం సమర్పించి, ఎర్రటి అక్షతలు, ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించాలి.
*_𝕝𝕝ॐ𝕝𝕝 oఓo శ్రీ దుర్గాదేవ్యై నమః 𝕝𝕝卐𝕝𝕝_*
