(No.620)_అమ్మపాడే జోలపాట
💞Rohit Rithika creations💞
అమ్మపాడే జోలపాట
అమృతానికన్నా తియ్యనంట
అమ్మపాడే లాలిపాట
తేనెలూరి పారే ఏరులంట
నిండు జాబిలి చూపించి
గోటితో బుగ్గను గిల్లేసి
ఉగ్గును పట్టి ఊయలలూపే
అమ్మ లాలన
ఊపిరిపోసే నూరేళ్ల
నిండు దీవెన
💞Rohit Rithika creations💞
కురిసే వాన చినుకులకి
నీలినింగి అమ్మ
మొలిచే పచ్చని పైరులకి
నేలతల్లి అమ్మ
వీచే చల్లని గాలులకి
పూలకోమ్మ అమ్మ
ప్రకృతిపాడే పాటలకి
యలకోయిల అమ్మ
సృష్టికి మూలం అమ్మతనం
సృష్టికి మూలం అమ్మతనం
సృష్టించలేనిది అమ్మ గుణం
💞Rohit Rithika creations💞
నింగిని తాకే మేడలకి
పునాది రాయి అమ్మ
అందంపొందిన ప్రతి శిలకి
ఉలిగాయం అమ్మ
చీకటి చెరిపే వెన్నెలకి
జాబిల్లి అమ్మ
లోకం చూపే కన్నులకి
కంటిపాప అమ్మ
అమ్మంటే అనురాగ జీవని
అమ్మంటే అనురాగ జీవని
అమ్మ ప్రేమే సంజీవని
💞Rohit Rithika creations💞
File Name: Amma Paata
Artist: Janhavi Yerram,
Lyric: Surender Mittapalli
Music: Sisco Disco
#🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #🎧మ్యూజిక్ #✨మ్యాజిక్ జంక్షన్✨ #✍🏿లిరిక్స్ వీడియోస్🎬
