శ్రీ మహావిష్ణు పురాణం
గజ్రేంద మోక్షము - మకర సంహారం - గజేంద్ర రక్షణం
మొసలిని భూమి పైకి లాగి ఓడించాలని ఏనుగు, ఏనుగుని నీటిలో ముంచి ఓడించాలని మొసలి తమ శక్తి సామర్థ్యాలు పూర్తిగాపెడుతూపోరాడుతున్నాయి. ఆడ ఏనుగులు తీరం నుంచి ఏమి చేయలేక తమ నాథుడుకి కలిగిన పరిస్థితికిదుఖిస్తున్నాయి. కరి మకర పోరాటం గంటలుదాటి రోజులకి మారింది. స్థాన బలిమి వలన రోజులు గడిచేకొద్ది మొసలి బలం పెరుగుతూ ఏనుగు బలం క్షీణిస్తోంది.
గజరాజుకితనకుఓటమి,మరణం తప్పదని తెలిసి వస్తోంది. శక్తి సామర్థ్యాలుపూర్తిగాక్షీణించాయి. తననులోకేశ్వరుడైనశ్రీహరిమాత్రమేరక్షించగలడనిఅర్థమైంది.
అంతబాధలో,మరణంతప్పదన్న ఆఖరి క్షణాల్లో ఆకాశం వైపు తల ఎత్తి, తొండం ఎత్తి నారాయణుని రక్షించమని ప్రార్ధించింది. పోతనా మాత్యులు భాగవతంలో చెప్పిన సుప్రసిద్ధ పద్యం గజేంద్రుడి పరిస్థితిని తెలియజేస్తుంది
"లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యె బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను మూర్ఛవచ్చె, దనువుదస్సెన్శ్రమంబయ్యెడిన్||
నీవే తప్ప నితః పరంబెరుగ మన్నింపదగున్ దీనునిన్
రావే ఈశ్వరా! కావవే వరద! సంరక్షింపు భద్రత్మాకా||"
మంచి చేసే మనస్సు గల శ్రీహరీ! నా బలము పూర్తిగా నశించింది. ధైర్యము సన్నగిల్లిపోయింది. పంచప్రాణాలు శరీరంలో తమ స్థానాలు వదలివెళ్లిపోతున్నాయి. శరీరం అలసి సృహతప్పుతోంది. ఈ కష్టం, బాధ తట్టుకోలేక పోతు న్నాను. నాకు నీవు తప్ప వేరె వ్వరు తెలియదు. ఈ దీనుని మన్నించిరక్షించడానికిరావయ్యా! ఓ శ్రీహరీ! భక్తులు కోరిన వరా లిచ్చే వరదరాజా! ఈశ్వరా!నన్ను రక్షింపుము!
గజేంద్రుని హృదయం నుండి రక్షించమని ప్రార్ధిస్తూ వెలువడిన దీనాలాపాలు లోకాలన్ని దాటి వైకుంఠంలో మహాలక్ష్మితో సరస మాడుతున్న శ్రీహరి చెవులకు చేరాయి. భక్తుల పిలుపులకు తక్షణమే స్పందించే ఆర్తత్రాణ పరాయణుఢైన నారాయణుడు గజేంద్రుడి మొర ఆలకించగానే ఉన్నవాడు ఉన్నట్లే వైకుంఠం వదలి గజేంద్రుని రక్షించడానికి త్రికూట వనము వైపు వేగంగా బయలుదేరి వెళ్ళసాగాడు.
ఈ సన్నివేశం వర్ణిస్తూ పోతన గారి పద్యం చదువుదాం.
"సిరింకింజెప్పడుశంఖచక్రయుగముం జేదోయి సంధింప డే
పరివారంబును జీరడభ్రగపతిం మన్నింపడాకర్ణికాం
తర థమిల్లము చక్కనొత్తడు వివాదప్రోద్ధత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై||"
గజేంద్రుడిప్రాణరక్షించాలనేతొందర లో శ్రీహరి లక్ష్మికి చెప్పలేదు. శంఖచక్రాలను చేతులలోతీసుకో లేదు. పరివారాన్ని రమ్మనలేదు. గరుత్మంతుడి పైన ఆధిరోహించ లేదు.చెవులవరకుజారినజుట్టును సరిచేసుకోలేదు.చదరంగంలో ఓడి తన చేత చిక్కిన లక్ష్మీదేవి పైటనువదలలేదు.అలాగేపట్టుకుని బయలుదేరి వెళ్లాడు.
లక్ష్మీదేవి, గరుడుడు, ఆదిశేషుడు ఆశ్చర్యంగా చూస్తూ హరి వెంట కదిలారు. వారి వెనుక శంఖచక్ర గదాది ఆయుధాలు. నారదుడు, విష్వక్సేనాది వైకుంఠపుర వాసులు వెళుతుంటే ఊర్ధ్వలోకాల వారైన బ్రహ్మ మహేశ్వర ఇంద్రాది దేవతలు, దేవర్షులు, గంధర్వాదులు ఆశ్చర్యంగా చూస్తున్నారు.
త్రికూట పర్వత సమీపానికి వచ్చిన నారాయణుడు కింద సరస్సులో మొసలి నోటికి కాలు చిక్కి రక్షించమని తనను ప్రార్ధిస్తున్న గజేంద్రుని చూసాడు. క్షణమైనా ఆలస్యం చేయకుండా చక్రాన్ని తలచి చేతికి రాగానే మకరం పైకి ప్రయోగించాడు. ముల్లోకాలు కంపించి పోయేట్టు ధ్వని చేస్తూ సుదర్శన చక్రం కదిలింది. చక్రభ్రమణ వేగానికి అగ్ని కణాలు ఉత్పన్నమై ఆకాశాన్ని ప్రకాశితం చేస్తూంటే, సరస్సులోకి దూసుకు వెళ్లి గజేంద్రుని కాలు పట్టుకున్న మొసలి కంఠాన్ని ఖండించి వేసింది.
గజేంద్రుడు తెగిన మొసలిశిరస్సు పట్టు వదలించుకున్నాడు. బాధ తొలిగి ఉపశమనం లభించింది. ఆడ ఏనుగులు సరస్సులో దిగి గజేంద్రుని చుట్టూ చేరి చల్లని నీటిని జలధారలుగా పోస్తూ అలసిన శరీరానికి స్వాంతన చేకూర్చాయి. గజేంద్రుడు తన భార్యలతో కలసి సరస్సులోని పద్మాలు తొండాలతో తీసుకుని శ్రీమహావిష్ణువుకి సమర్పిస్తూ, ఆనంద బాష్పాలతో కృతజ్ఞతలు అర్పిస్తూ ఘీంకారం చేసాడు.
శ్రీహరి చేతిలోకి వచ్చిన పాంచ జన్య శంఖాన్ని పూరించి విజయ నాదం చేశాడు. దేవదుందుభులు మ్రోగాయి.లక్ష్మీదేవిచెంతచేరింది. చతుర్భుజాలలో గదా శంఖ చక్ర పద్మాలు విరాజిల్లగా లక్ష్మీదేవి సమేతుడై గరుత్మంతుడి ఫై ఆసీనుడై గంజేంద్రునికి దర్శన మిచ్చాడు. దేవతలు పుష్ప వర్షం కురిపిస్తూ స్తుతి సోత్రానికి చేశారు.
మకర సంహారంతో శాప విముక్తుడైనగంధర్వుడుభార్యతో కలసి లక్ష్మీనారాయణు లకు భక్తి శ్రద్థలతోనమస్కరించినారాయణ నామాన్నిస్మరిస్తుగంధర్వలోకానికి వెళ్లి పోయాడు.
శ్రీమహావిష్ణువు గంజేంద్రుని దగ్గరకు వచ్చి తన దివ్య హస్త స్పర్శతో అనుగ్రహించి ముక్తి ప్రసాదించాడు. గజేంద్రుడు, అతని భార్యలు తమ దేహాలు వదిలి ఆత్మజ్యోతులుగా వెళ్లి శ్రీహరిలో లీనమయ్యారు. తనను స్తుతిస్తున్న నారదాది మహర్షులను, ఇంద్రాది దేవతలను శ్రీమహావిష్ణువు మందహాసంతో చూసి
"దేవతలారా! మహర్షులారా! నేను భక్తవత్సలుడను. నిరంతరం నా నామం జపించే వారిని, దేవతలా మానవులా జంతువులా అని చూడకుండా ఆపద కలిగి నప్పుడు వెంటనే వచ్చి రక్షించి కాపాడుతాను. ఈ గజేంద్ర రక్షణమే ఇందుకు నిదర్శనం. నా భక్తుడైన గజేంద్రుని మకర బంధం నుండి విడిపించి మోక్షం ప్రసాదించాను.
ఈ గజేంద్ర మోక్షము కథ విన్నవారికి, చదివినవారికి దుఖాలు తొలగి శుభాలు, కీర్తి జయాలు కలుగుతాయి. నిత్య పారాయణ చేసినవారికి మరణానంతరం మోక్షము లభిస్తుంది"అని లక్ష్మీదేవితో కలసిగరుత్మంతుడిపైవైకుంఠానికి వెళ్లి పోయాడు.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
#🙏🕉️శ్రీ మహావిష్ణువు🕉️🙏 #🪐 శ్రీ మహావిష్ణు 🔱 #శ్రీ మహావిష్ణు 🪐
