ShareChat
click to see wallet page
#శ్రీ కాళరాత్రి దేవి (నవదుర్గలు 7వ స్వరూపం) శని దోశ పరిహారం కోసం రేమిడిస్ #శరన్నవరాత్రులు 🔱 నవదుర్గలు (ఆధ్యాత్మికం విశిష్టతలు) #శరన్నవరాత్రులు 🔱 జగన్మాత వైవిధ్య కళల ఆరాధన నవరాత్రులు🙏 #శుభప్రదం🔯 శుభ నిజ ఆశ్వయుజ మాసం⚛️ దేవీ దసరా శరన్నవరాత్రులు - దేవీ అలంకరణాలు 🙏 🔱🕉️🔱🙏 #🔥శ్రీ మహాచండీ దేవి🦅 దేవి నవరాత్రులలో 7వ రోజు కాళరాత్రి (శ్రీ మహాచండి దేవి )( 28.09.2025) ఆశ్వయుజ శుద్ద పాడ్యమి నుండి శుద్ధ దశమి వరకు దేవీ నవరాత్రులలో రోజుకొక దుర్గా రూపమును ఉపాశించ వలెను. నవదుర్గలు : ప్రథమా శైలపుత్రీచ| ద్వితీయా బ్రహ్మచారిణీ|తృతీయా చంద్రఘంటేతి| కూష్మాండేతి చతుర్థికీ|పంచమా స్కందమాతేతి| షష్ఠా కాత్యాయనేతిచ|సప్తమా కాళరాత్రీచ| అష్టమాచేతి భైరవీ|నవమా సర్వసిద్ధిశ్చాత్| నవదుర్గా ప్రకీర్తితా|| నవరాత్రులలో ఈ తొమ్మిది రూపాలలో అమ్మవారిని పూజించాలి. దుర్గా ధ్యాన శ్లోకము : శ్లో|| ఓం హ్రీం కాలాభ్రాభాం కటాక్షైరరికులభయదాం మౌలిబద్ధేందురేఖాంశంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి కరైరుద్వహంతీం త్రినేత్రామ్ |సింహస్కంధాధిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీంధ్యాయేద్ దుర్గాం జయాఖ్యాం త్రిదశపరివృతాం సేవితాం సిద్ధికామైః ॥ కాళరాత్రి ( శ్రీ మహాచండి దేవి) శ్లో|| ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా| లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ |వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా| వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ || నైవేద్యం : 1.కూరగాయలతో వండిన అన్నాన్ని ( కదంబం ప్రసాదం ) 2. రవ్వ కేసరి !! కావలసినవి !! కందిపప్పు 1/2 కప్ బియ్యం 1/2 కప్ ( కొత్తబియ్యం అయితే మరీ రుచిగా వుంటుంది ) 1 వంకాయ 1/4 సొర్రకాయ 1 దోసకాయ బీన్స్ తగినన్ని 1 పోటాటో వేరుశెనక్కాయలు ( పీనట్ ) 2 పిడికిళ్ళు 2 మొక్కజొన్నలు 1/2 క్యారెట్ 2 టోమాటో తగినంత కరివేపాకు కోత్తమీర కోరిన పచ్చి కొబ్బెర 1 చిప్ప 4 పచ్చి మిర్చి నూనె తగినంత నెయ్యి చిన్న కప్పు చింతపండు గొజ్జు తగినంత కాస్త బెల్లం ( జాగిరి ) ఉప్పు , పసుపు తగినంత 3 చెంచాలు సాంబర్ పౌడర్ పోపు గింజలు ,ఎండుమిర్చి, ఇంగువ . ముందుగ కాయగూరలన్ని మీకు కావలసిన సైజులో తరుక్కొని ఉంచుకోండి. కుక్కర్లోకందిపప్పు ,బియ్యం ,పీనట్ , (టోమాటో తప్ప ) అన్నీ కూరగాయలు వేసి పసుపు , ఉప్పు ,నీళ్ళు 5 పావులు వేసి రెండు విజిల్ వచ్చాక stove off చేయండి . మూకుడులో కొద్దిగ నూనె వేసి వేడి చేసాక అందులో కొద్దిగ ఆవాలు వేసి అవి చిట్లిన తరువాతపచ్చిమిర్చి ,కరేపాకు ,టొమాటో , చింతపండు గొజ్జు ,సాంబర్ పౌడర్ , జాగిరి .వేసి బాగా ఉడికిన తరువత ఆ గ్రేవి అంతా ఉడికిన రైస్లో వేసి,కొత్తిమీర ,కరివేపాకు ,నెయ్యి వేసిమరోసారి ఉడికించండి అంతా బాగా ఉడికిన తరువాత ,ఎండుమిర్చి ,ఇంగువతో తాలింపు పెట్టి కొబ్బరి కలిపి దించండి వేడి వేడిగా శ్రీ మహాచండి దేవికి నెయ్యివేసి నైవేద్యం పెట్టి ఆ తల్లి దీవెనలు పొందండి. మహాచండీ అవతారం దుర్గాదేవి యొక్క శక్తివంతమైన రూపం, ఇది విశ్వానికి తల్లిగా, అసుర శక్తుల నుండి రక్షించే దేవతగా భావించబడుతుంది. ఈ అవతారంలో, అమ్మవారు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది. మహాచండీని పూజించడం వల్ల విద్య, కీర్తి, సంపదలు లభిస్తాయని, శత్రువులు మిత్రులుగా మారతారని నమ్మకం. ఈ అవతారం నవరాత్రుల సమయంలో, ముఖ్యంగా ప్రముఖంగా పూజించబడుతుంది. విశిష్టతలు శక్తి స్వరూపిణి: మహాచండీ త్రిశక్తి స్వరూపిణి. ఆమెను ప్రార్థిస్తే సర్వదేవతలను కొలిచినట్టే అని భక్తులు విశ్వసిస్తారు. రక్షకురాలు: భూమిపై ఉన్న తన బిడ్డలను దుష్ట శక్తుల నుండి రక్షించడానికి ఆమె తనలోని దైవిక శక్తులను కలిగి ఉంటుంది. శత్రు సంహారిణి: రాక్షసులను సంహరించి, ధర్మాన్ని స్థాపించడానికి ఈ రూపంలో అమ్మవారు వ్యక్తమవుతుంది. సింహ వాహనం: సింహాన్ని తన వాహనంగా చేసుకుని అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. ఎప్పుడు ఆరాధిస్తారు? శరన్నవరాత్రులు మరియు దుర్గాపూజ సమయంలో మహాచండీ అవతారంలో అమ్మవారిని ఆరాధిస్తారు. ఇది నవరాత్రులలో ప్రత్యేకంగా అలంకరించబడుతుంది. ప్రాముఖ్యత మహాచండీ అవతారాన్ని పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని, జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. విద్య, కీర్తి, సంపదలు లభించి, శత్రువులు కూడా మిత్రులుగా మారతారని విశ్వసిస్తారు. #namashivaya777
శ్రీ కాళరాత్రి దేవి (నవదుర్గలు 7వ స్వరూపం) శని దోశ పరిహారం కోసం రేమిడిస్ - దుర్గాదేవి . 7 శ్రీకకరార్రి కరాళరూపా కాలాబ్ద సమానాక్యతి విగ్రహా ] శుభందద్యా ద్దేవీ చండాట్టహాసినీ Il కాఠరాిః DAILYWISHTELUGU నల్లకలువలాంటి నల్లనైన; భయంకరమైన శరీరకాంతితో వికటాట్టహాసాల్ని (పెదబొబ్బలు చేస్తూ ಂಡ పెడుతూనవ్వటం) కాళరాత్రి దుర్గాదేవీ మాకు శుభాన్ని ప్రసాదించుగాక: తెధ్యాల్సిన తెనందరా a@@ Daily Wish Telugu 0+91 9700 722 711 దుర్గాదేవి . 7 శ్రీకకరార్రి కరాళరూపా కాలాబ్ద సమానాక్యతి విగ్రహా ] శుభందద్యా ద్దేవీ చండాట్టహాసినీ Il కాఠరాిః DAILYWISHTELUGU నల్లకలువలాంటి నల్లనైన; భయంకరమైన శరీరకాంతితో వికటాట్టహాసాల్ని (పెదబొబ్బలు చేస్తూ ಂಡ పెడుతూనవ్వటం) కాళరాత్రి దుర్గాదేవీ మాకు శుభాన్ని ప్రసాదించుగాక: తెధ్యాల్సిన తెనందరా a@@ Daily Wish Telugu 0+91 9700 722 711 - ShareChat

More like this