ShareChat
click to see wallet page
#ఏపీ అప్ డేట్స్..📖 #చంద్రబాబు నాయుడు *బాబుగారిలో ఇదేం పలాయన ధోరణి!‼️* NOVEMBER 11, 2025🎯 ఒక్కసారి అధికారం దక్కిన తర్వాత.. మనుషులు అహంకారంతో, అత్యాశతో గాడితప్పి వ్యవహరించడం చాలా సహజం. అందుకు తెలుగుదేశం లేదా ఇతర ఎన్డీయే కూటమి పార్టీల ఎమ్మెల్యేలు అతీతులేం కాదు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఎమ్మెల్యేలు అడ్డగోలుగా అరాచకంగా వ్యవహరించడం బాగానే జరుగుతోంది. వారి దందాలు ఎంతగా శృతిమించుతున్నా.. చంద్రబాబునాయుడు ఉపేక్ష ధోరణి అనుసరిస్తున్నటుగా కనిపిస్తున్నారు తప్ప.. వారి దందాలు కూటమి పరువును గంగలో కలుపుతాయని, ఇలా చెలరేగడాన్ని అనుమతిస్తే.. వచ్చే ఎన్నికల నాటికి పుట్టగతులు ఉండవని గ్రహించడం లేదు. గుట్టుచప్పుడు కాకుండా ఎమ్మెల్యేలు సాగించే దోపిడీ వ్యవహారంలో ఆయన పట్టించుకోకుండా పోతే అదొక ఎత్తు కానీ.. వ్యవహారం బజార్న పడి, ఎమ్మెల్యేల దందాల గురించి సాక్షాత్తూ డిప్యూటీ ముఖ్యమంత్రి, ఏకంగా మంత్రి వర్గ సమావేశంలోనే ప్రస్తావించినా కూడా.. చంద్రబాబు సీరియస్ గా స్పందించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఎమ్మెల్యేలను క్రమశిక్షణలో పెట్టడం అనేది తన పని కాదు అని ఆయన అనుకుంటున్నారా? లేదా, ఇతరుల మీదికి ఆ బాధ్యతను నెట్టేయడం ద్వారా.. ఎమ్మెల్యేల విచ్చలవిడితనాన్ని మరింతగా, పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారా? అనే అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఒక కీలకాంశాన్ని ప్రస్తావించారు. ప్రజల ఆస్తి తగాదాల్లో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఒక ఎమ్మెల్యే విషయం తన దృష్టికి వచ్చినప్పుడు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చానని కూడా పవన్ కేబినెట్ భేటీలో చెప్పారు. ప్రజల ఆస్తుల తగాదాల్లో జోక్యం చేసుకోవడం మాత్రమే కాకుండా.. వారు రాజీకి సిద్ధం అవుతున్నా సరే.. ఎమ్మెల్యేలు పొసగనివ్వడం లేదని కూడా పవన్ ఆరోపించారు. ఇలాంటి తగాదాల్లో జోక్యం చేసుకోవడం అంటే.. ఎమ్మెల్యేలు దందా చేస్తున్నారనే అర్థం, వారినుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని కూడా అర్థం చేసుకోవాలి. పవన్ చేసిన ఈ సీరియస్ ఆరోపణ పట్ల చంద్రబాబు స్పందన మాత్రం తమాషాగా ఉంది. ఎమ్మెల్యేల పనితీరు మారాలి. లేకపోతే గత ఎన్నికల్లో 50 వేల మెజారిటీ వచ్చిన వారికి ఈసారి 10 వేల మెజారిటీ కూడా రాకపోవచ్చు.. అని చంద్రబాబు హెచ్చరించారు. అంటే, ఇలాంటి దందాలు చేయడం అనేది పార్టీని ఓటమి దిశగా నడిపిస్తాయనే క్లారిటీ చంద్రబాబుకు ఉందని అర్థమవుతోంది. అయితే.. నష్టనినవారణ చర్యల గురించి మాత్రం ఆయన సీరియస్ గా తీసుకుంటున్నట్టు లేదు. ఎమ్మెల్యేలు తప్పు చేస్తే వారిని గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఇన్చార్జి మంత్రులదే అని బాబుగారు అంటున్నారు. అసలు దందాలు చేస్తున్న అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎవరి అండదండలు చూసుకుని ఇలాంటి విచ్చలవిడితనానికి పాల్పడుతున్నారో చంద్రబాబుకు తెలియని సంగతేనా? ఎవరి అండ వారికి ఉన్నదో వారిని నియంత్రించడానికి చంద్రబాబు ధైర్యం చేయడం లేదా? లేదా, తప్పులు చేస్తున్న ఎమ్మెల్యేలను స్వయంగా మందలించి దారిలో పెట్టాలని అనుకోవడం లేదా? అనేది ప్రశ్న. చంద్రబాబు స్వయంగా చెప్పినా కూడా పెడచెవిన పెట్టే ముదురు ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉన్నారు. అలాంటిది.. ఇన్చార్జి ఎమ్మెల్యేల మీద బాధ్యత వదిలేస్తే దందాలు ఆగుతాయా? అనేది అనుమానం. పవన్ కల్యాణ్ కంఠశోష తప్న, ఆయన లేవనెత్తిన అక్రమాలకు అడ్డుకట్ట బాబు గారి తీర్మానంతో జరిగేది కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఏపీ అప్ డేట్స్..📖 - ShareChat

More like this