*నీ జీవితములో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదా! నీ కళ్ళ ముందే అందరి జీవితాలు స్థిరపడుతున్నాయి నీ జీవితములో మాత్రం భయంకరమైన కష్టాలు, బాధలు, శ్రమలు ఎందుకు వస్తున్నాయని విశ్వాసముతో సన్నగిల్లిపోతున్నావా? జీవితములో ఏది కోల్పోయిన బాధపడకు. చెట్టు ఆకులు రాలిన ప్రతిసారి రెట్టింపు ఆకులతో చిగురిస్తుంది కదా! నీ జీవితం కూడా అంతే. నువ్వు ఎంత నలగగొట్టబడితే అంతగా దీవించబడతావు. నీ కళ్ళ ముందు స్థిరపడుతున్న వారిని చూసి నువ్వెందుకు కంగారుపడతావు. ధైర్యంగా ఉండు. దేవుడు నియమించిన సమయం వచ్చినప్పుడు గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వాదిస్తాడు. వర్షపు సూచనలు చూడగానే అహాబు రాజు తన రథం ఎక్కి యేజ్రేయేలు వెళ్తున్నాడు. అదే సమయంలో యెహోవా హస్తం ఏలీయాను బలపరచినప్పుడు అహాబు రాజు కంటే ముందుగా ఏలీయా యేజ్రేయేలు గుమ్మముల యొద్దకు చేరుకున్నాడు. గనుక ధైర్యంగా ఉండు దేవుడు నిన్ను అందరికంటే హెచ్చుగా స్థిరపరుస్తాడు.*
*"Job(యోబు గ్రంథము) 8:7"*
*నీ స్థితి మొదట కొద్దిగా నుండి నను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు.* #యేసయ్య #సండే ప్రేయర్స్ ✝ #యేసయ్య కృప #📙ఆధ్యాత్మిక మాటలు #యేసయ్య ప్రేమ