ShareChat
click to see wallet page
రమా ఏకాదశి : రమాదేవి అనగా లక్ష్మీదేవి. కావున లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన ఏకాదశి అందులోనూ దీపావళికి ముందు వచ్చే బహుళ ఏకాదశి కావున ఈరోజును రమా ఏకాదశి అని పిలవడం జరిగింది. ఈ రోజు అన్ని ఏకాదశిల లానే ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఈరోజు బియ్యం, ధాన్యాలు ముఖ్యంగా తినకూడదు. ఈరోజు అందరూ తప్పనిసరిగా వీలయితే ఉపవాసం ఉండాలి. ఆరోగ్యం సరిగా లేనివారు ఉండనవసరం లేదు. ఈ రమా ఏకాదశి యొక్క గొప్పదనం మనకు బ్రహ్మ వైవర్త పురాణంలో కనిపిస్తుంది. ఈ రమా ఏకాదశిని ఆచరించడం మూలంగా వచ్చే పుణ్యం 100 రాజసూయ యాగాలు లేదా 1000 అశ్వమేధ యాగాలు చేయడం మూలంగా వచ్చే పుణ్యంతో సమానం అని పురాణోక్తి. అంత పుణ్యం కాకపోయినా కొంత అయిన తప్పకుండా మనం భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే రావడం అతిశయోక్తి కాదు. ఈరోజు ఎవరైతే భక్తిశ్రద్ధలతో మాత శ్రీ మహాలక్ష్మిదేవిని శ్రీవారు శ్రీహరిని సేవిస్తారో వారికి ఇహములోనే కాకుండా పరములో కూడా సద్గతి ప్రాప్తించును. ఈరోజు తప్పకుండా సుగంధ భరితమైన పుష్పాలను అమ్మవారికి అయ్యవారికి సమర్పించి అనుగ్రహం పొందగలరు. #🙏🏻భక్తి సమాచారం😲 #ఓం శ్రీ మాత్రే నమః #మహాలక్ష్మి అమ్మవారు #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: రమా ఏకాదశి / రామ ఏకాదశి 🙏🕉️🔱🕉️🙏
🙏🏻భక్తి సమాచారం😲 - ShareChat

More like this