ShareChat
click to see wallet page
#🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #🙏హ్యాపీ నవరాత్రి🌸 #good morning #🌅శుభోదయం #🔥శ్రీ మహాచండీ దేవి🦅 *_𝕝𝕝ॐ𝕝𝕝 28/09/2025 - శ్రీ దేవీ శరన్నవరాత్రులు 7వ రోజు - అలంకారం: దేవీ కాళరాత్రీగా దర్శనమ్ 𝕝𝕝卐𝕝𝕝_* *≈≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈≈* *_దేవీ కాళరాత్రీ_* *━❀꧁🔆꧂❀━* *శ్లో𝕝𝕝 ప్రధమం శైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కంధమాతేతి, షష్ఠమం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత||* *_”దేవీ కాళరాత్రీ" ధ్యాన శ్లోకం_* *_శ్లో𝕝𝕝 ఏకవేణీ జపాకర్ణపూర నగ్నా ఖరాస్థితా| లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ| వామపాదోల్లసల్లోహలతాకంటకభూషణా | వర్ధనమూర్ధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ ||_* "కాళరాత్రి" శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదురై యుండును. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముచుండును. ఈమె త్రినేత్రములు బ్రహ్మాండములవలె గుండ్రనివి. ఈమె నాశికా శ్వాస ప్రశ్వాసలు భయంకరములైన అగ్నిజ్వాలలను వెడలగ్రక్కుచుండును. ఈమె వాహనము గార్దభము. ఈమె తన ఒక కుడిచేతి వరముద్ర ద్వారా అందఱికిని వరములను ప్రసాదించుచుండును. మఱియొక కుడిచేయి అభయ ముద్రను కలిగియుండును. ఒక ఎడమచేతిలో ఇనపముండ్ల ఆయుధము, మఱొక ఎడమచేతిలో ఖడ్గము ధరించియుండును. కాళరాత్రి స్వరూపము చూచుటకు మిక్కిలి భయానకము - కాని ఈమె ఎల్లప్పుడూ శుభములనే ప్రసాదించుచుండును. అందువలన ఈమెను "శుభంకరి" అనియు అంటారు. కావున భక్తులు ఈమెను చూచి ఏ మాత్రము భయమును గాని, ఆందోళనను గాని పొందనవసరమే లేదు. కాళరాత్రి మాతను స్మరించినంతమాత్రముననే దానవులు, దైత్యులు, రాక్షసులు, భూత, ప్రేత, పిశాచములు భయముతో పారిపోవుట తథ్యము. ఈమె యనుగ్రహమున గ్రహబాధలును తొలగిపోవును. ఈమెను ఉపాసించువారికి అగ్ని, జలము, జంతువులు మొదలగువాటి భయముగాని, శత్రువుల భయముగాని, రాత్రి భయముగాని ఏ మాత్రము ఉండవు. ఈమె కృపచే భక్తులు సర్వధా భయవిముక్తులగుదురు. *_𝕝𝕝ॐ𝕝𝕝 oఓo శ్రీ కాళరాత్రీదేవ్యై నమః 𝕝𝕝卐𝕝𝕝_*
🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ - ShareChat
00:39

More like this