ShareChat
click to see wallet page
*చండ్రుగొండ – అన్నపురెడ్డిపల్లి – ములకలపల్లి మండలాలలో* *పర్యటించిన ఎమ్మెల్యే జారె* *22.09.2025 – సోమవారం* అశ్వారావుపేట నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు ఈ రోజు చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి మండలాల్లో పర్యటించారు. ముందుగా చండ్రుగొండ మండల కేంద్రంలో చింతల వెంకటేశ్వర్లు గారికి అత్యవసర సర్జరీ కోసం రూ.2,50,000ల ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్ఓసి చెక్కును అందించారు. తరువాత అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో, ములకలపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మానసిక అంగవైకల్య వికలాంగుల కోసం రూ.28,50,000ల వ్యయంతో నిర్మించబోయే మూడు భవనాలకు శంకుస్థాపన చేశారు. అన్నపురెడ్డిపల్లి రైతు వేదికలో రూ.18,02,088, ములకలపల్లి రైతు వేదికలో రూ.32,03,712 నిధులతో చేపట్టబోయే పనులను ప్రారంభించారు. అలాగే ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన కళ్యాణలక్ష్మి – షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అన్నపురెడ్డిపల్లి సోషల్ వెల్ఫేర్ వసతిగృహం, ములకలపల్లి జూనియర్ కళాశాల, ములకలపల్లి కేజీబీవీ పాఠశాలలో రీనోవేషన్ & రిపేర్ వర్క్‌ల కోసం రూ.40 లక్షలతో చేపట్టబోయే పనులను ప్రారంభించారు. చివరిగా ములకలపల్లి మండలం కంపగూడెం గ్రామంలో గ్రామస్థుల ఆహ్వానం మేరకు బతుకమ్మ వేడుకలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో మూడు మండలాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. #🔹కాంగ్రెస్ #🌍నా తెలంగాణ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🏛️రాజకీయాలు #కాంగ్రెస్
🔹కాంగ్రెస్ - ShareChat

More like this