#🗞️అక్టోబర్ 2nd అప్‌డేట్స్💬 #🌍నా తెలంగాణ #కాళేశ్వరం #🆕Current అప్‌డేట్స్📢 #BRS party దిక్కుతోచని కాంగ్రెస్ సర్కారుకు.. మేడిగడ్డే దిక్కు💥
📢 రెండేండ్ల కాలయాపన తర్వాత కదిలిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఎట్టకేలకు పునరుద్ధరణ చర్యలు
😡 కాళేశ్వరం కూలిందని ఇన్నాళ్లు దుష్ప్రచారం. పగులును సాకుగా చూపి రెండేండ్లు పడావు
📌 ఇప్పుడు మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజ్‌ల మరమ్మతుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం
♦️ ఏజెన్సీలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ
✅ అన్ని వైపుల నుంచి ఒత్తిడితో కదిలిన కాంగ్రెస్ సర్కార్. స్థానిక ఎన్నికల భయంతోనే రిపేరుకు.
కాళేశ్వరం పనికిరాదన్నారు.. కూలేశ్వరం అన్నారు.. లక్ష కోట్లు వృథా అన్నారు.. ఇక దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని బాకా ఊదారు. కమిషన్ల పేరుతో నానాయాగీ చేశారు. చివరికి రెండేండ్ల తర్వాత మళ్లీ అదే దిక్కయింది.
తమ్మిడిహట్టి అంటూ గొప్పలకు పోయిన సర్కారు ఇప్పుడు కాళేశ్వరమే తమను కాపాడగలదని భావిస్తున్నది. స్థానిక ఎన్నికల్లో ప్రజాగ్రహం వెల్లువెత్తడానికి ముందే సర్దుకున్నది. కూలిపోయిందన్న కాళేశ్వరానికి మరమ్మతులు చేస్తామని ఇప్పుడు తీరిగ్గా ప్రకటించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కటే తెలంగాణ వరదాయిని. గోదావరిలో తెలంగాణ వాటాను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే. ఈ విషయాన్ని ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కార్ అంగీకరించింది.
ఇంతకాలం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, ఇతర బరాజ్‌లపై అడ్డగోలుగా అసత్య ఆరోపణలకు దిగిన ప్రభుత్వం తాజాగా బరాజ్‌ల పునరుద్ధరణకు పూనుకున్నది.
ఈ నేపథ్యంలో తప్పనిసరి స్థితిలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ ఎట్టకేలకు మేడిగడ్డ మరమ్మతులపై దృష్టి సారించించింది. బరాజ్‌ల పునరుద్ధరణకు నడుం బిగించింది. డిజైన్ కన్సల్టెన్సీల నుంచి ఈవోసీ (ఎక్స్‌ప్రెషన్స్ ఆఫ్ ఇంట్రస్ట్) కోసం నోటిఫికేషన్ జారీచేసింది.

