#✌️నేటి నా స్టేటస్ #21September2025సూర్యగ్రహణం
#2025SuryaGrahanam #2025SolarEclipse #kalabhairavaguru #kalabhairavatv #rajahmundry
#2025సూర్యగ్రహణం ఈ గ్రహణము ఏ రాశి వారికి, ఏ జన్మ నక్షత్రము వారికి పిల్లలకు పెద్దలకు ఎవ్వరికీ ఎటువంటి దుష్ప్రభావాన్ని, శాపాన్ని, దోషాన్ని ఇవ్వదు. భారతదేశంలో ఉన్నటువంటి వారు గ్రహ నియమాలు పాటించవలసిన అవసరం లేదు. భారత కాలమానము ప్రకారము 21రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల 22 నిమిషాల వరకు ఈ గ్రహణం నడుస్తుంది ఈ సమయంలో మంత్ర ఉపదేశం ఉన్నవారు. మంత్రపురచ్చరణ మంత్రసిద్ధిలో భాగంగా గురుపరంపరలో ఉన్నవారు భగవత్ నామస్రనామాత్రం చేయవచ్చు. https://www.youtube.com/live/iew8LloEFGM?si=TjasLImirvdx_pG8
కేవలం మంత్ర జపాన్ని మాత్రమే చేయండి.
సెప్టెంబర్ 21న ఏర్పడనున్న పాక్షిక సూర్యగ్రహణం
భారత్‌తో పాటు పొరుగు దేశాల్లోనూ కనిపించని ఖగోళ వింత
న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అంటార్కిటికాలో స్పష్టంగా వీక్షణ
'ఈక్వినాక్స్ ఎక్లిప్స్'గా గుర్తింపు
సూర్యుడిని పాక్షికంగా కప్పివేయనున్న చంద్రుడు. సెప్టెంబర్ 21న పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ అద్భుతమైన ఖగోళ పరిణామం భారతదేశంలో కనిపించదు. ఈ గ్రహణం ప్రధానంగా దక్షిణార్ధగోళంలోని కొన్ని ప్రాంతాల వారికి మాత్రమే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రవేత్తలు ఈ గ్రహణానికి సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు.
ఎక్కడ, ఎప్పుడు కనిపిస్తుంది? #mantropadesham
సెప్టెంబర్ 21న ఏర్పడే ఈ గ్రహణాన్ని పాక్షిక సూర్యగ్రహణం అని పిలుస్తారు. అంటే, చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేయకుండా కేవలం కొంత భాగాన్ని మాత్రమే అడ్డుకుంటాడు. దీనివల్ల ఆకాశంలో సూర్యుడు నెలవంక ఆకారంలో దర్శనమిస్తాడు.#anadanamseva
ఈ సూర్యగ్రహణం భారత్‌తో పాటు పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ వంటి పొరుగు దేశాల్లో కూడా కనిపించదు.
ఇది ప్రధానంగా న్యూజిలాండ్, తూర్పు ఆస్ట్రేలియా, అంటార్కిటికా, దక్షిణ పసిఫిక్ ప్రాంతాల్లోని ప్రజలకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా, న్యూజిలాండ్‌లోని డ్యూనెడిన్ వంటి నగరాల్లో సూర్యుడు దాదాపు 72 శాతం వరకు చంద్రుడి చాటుకు వెళతాడని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
‘ఈక్వినాక్స్ ఎక్లిప్స్’గా ప్రత్యేక గుర్తింపు
ఈ గ్రహణానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇది సెప్టెంబర్ 22న వచ్చే 'ఈక్వినాక్స్' కు సరిగ్గా ఒక రోజు ముందు ఏర్పడుతోంది. అందుకే శాస్త్రవేత్తలు దీనిని 'ఈక్వినాక్స్ ఎక్లిప్స్' అని కూడా పిలుస్తున్నారు. 'ఈక్వినాక్స్' రోజున సూర్యుడు భూమధ్యరేఖకు సరిగ్గా పైన ఉంటాడు. ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా పగలు, రాత్రి సమయాలు దాదాపు సమానంగా ఉంటాయి. ఉత్తరార్ధగోళంలో ఇది శరదృతువు ఆరంభానికి, దక్షిణార్ధగోళంలో వసంత రుతువు ఆరంభానికి సూచికగా నిలుస్తుంది. https://youtu.be/j60zd0EaGRU?si=7bvzZt6MrPVzDO3k
