నిరక్షరాస్యులకు తక్కువ సమయంలో సులభంగా తెలుగును నేర్పించేందుకు ‘ఎన్ఆర్’ అనే కొత్త పద్ధతి రూపొందించిన నెల్లూరు నరసింహారావు గారి కృషి అభినందనీయం. బోధన, అభ్యసనకు ప్రత్యేకంగా తెలుకు వాచకాన్ని తీసుకువచ్చి నిరక్షరాస్యులకు కేవలం 30 గంటల్లోనే చదవడం, రాయడం నేర్పించవచ్చని నిరూపించారు. అక్షర ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం ఆకునూరులో అమలుచేసిన ‘ఎన్ఆర్’ విధానం విజయవంతం అయినందుకు సంతోషంగా ఉంది. ఇందుకు సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో నూరు శాతం అక్షరాస్యత సాధించేందుకు ఇదో ముందడుగు కానుంది.
#schools
#telugu
#language
#andhrapradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
